యూపీలో ఎన్‌కౌంటర్‌..యువతిని హత్య చేసిన ముగ్గురిపై కాల్పులు | | Sakshi
Sakshi News home page

యూపీలో ఎన్‌కౌంటర్‌..యువతిని హత్య చేసిన ముగ్గురిపై కాల్పులు

Published Tue, Oct 1 2024 12:37 PM | Last Updated on Tue, Oct 1 2024 1:21 PM

Three Murder Accused Arrested After Police Encounter

సుల్తాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు గాయపడ్డారు. సుల్తాన్‌పూర్‌లో పెళ్లి పేరుతో యువతిని వంచించి, హత్య చేసిన నిందితులు సల్మాన్, సర్వర్, జావేద్‌లపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలపాలైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ అఖండ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

అదనపు పోలీసు సూపరింటెండెంట్ అఖండ్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 21న గోసైంగంజ్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైందన్నారు. ఊపిరాడక ఆ యువతి మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని తెలిపారు. అయితే  ఇంతలో ఒక యువతి అదృశ్యంపై జూన్ ఒకటిన కడిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యిదన్నారు.

సల్మాన్‌, షహెన్‌షా, సర్వర్‌, జావేద్‌ అనే నలుగురు యువకులకు ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా సల్మాన్‌ ఆ యువతిని ముంబై తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె  తనను పెళ్లి చేసుకోవాలని సల్మాన్‌ను అడిగింది. దీంతో సల్మాన్‌ పెళ్లికి నిరాకరిస్తూ, ఆమెను తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడు. అనంతరం సల్మాన్, అతని సహచరులు ఒక పథకం ప్రకారం సెప్టెంబర్ 20 న ఆమెను హత్య చేశారు. ఈ కేసులో షాహెన్‌షాను అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అఖండ్‌నగర్ ప్రాంతంలో పోలీసులు వారిని వెంబడించి, కాల్పులు జరిపారు. తరువాత వారిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్‌..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement