నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ | Comedian Ali Thanks To Guests Who Attend Her Daughter Wedding | Sakshi
Sakshi News home page

Comedian Ali: నా కూతురిని ఆశీర్వదించిన అతిరథ మహారథులకు కృతజ్ఞతలు

Nov 28 2022 7:45 PM | Updated on Nov 28 2022 7:49 PM

Comedian Ali Thanks To Guests Who Attend Her Daughter Wedding - Sakshi

పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రముఖ కమెడియన్‌ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి–సురేఖ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్,  బ్రహ్మానందం, జయసుధ,  నాగార్జున–అమల, వెంకటేశ్, అనిల్‌ రావిపూడి, బోయపాటి శ్రీను, రాజశేఖర్‌–జీవిత, నిర్మాతలు అల్లు అరవింద్, కె.యల్‌ నారాయణ, ఎస్‌ గోపాల్‌రెడ్డి, చోటా.కె.నాయుడు, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మీ, తొట్టెంపూడి వేణు, ఆది సాయికుమార్, బ్రహ్మానందం, ఊహ, రోషన్, ‘అల్లరి’ నరేశ్, రాజేశ్, ప్రియదర్శి, పూరి జగన్నాథ్‌ సతీమణి లావణ్య,  ఆకాశ్‌ పూరి, పవిత్రా పూరి తదితరులు హాజరై నూతన వధూవరులను దీవించారు. 

రాజకీయ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్, మార్గాని భరత్, ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రపంచ చాంపియన్‌ పి.వి సింధు తల్లితండ్రులతో సహా పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించిన అతిరథ మహారధులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ అలీ ఓ ప్రకటన విడుదల చేశారు.

చదవండి: నోరు జారకు.. రేవంత్‌పై చెలరేగిపోయిన ఫైమా
నా పనిమనిషి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement