Do You Know About Comedian Ali Son-In-Law Family Background - Sakshi
Sakshi News home page

Ali Daughter Marriage: అలీ కుమార్తె వివాహం.. మరి అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?

Published Tue, Nov 29 2022 9:40 PM | Last Updated on Wed, Nov 30 2022 9:24 AM

Ali Daughter Fathima Husband Should be A doctor - Sakshi

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపించాయి. సాధారణంగా నటీనటులు పెళ్లిళ్లు జరిగితే వధువు, వరుడు వివరాలపై ఆరా తీస్తుంటారు. తాజాగా అలీ అల్లుడు ఎవరా అని కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

(చదవండి: నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ)

అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్‌గా నిలిచింది ఫాతిమా. ఇక అల్లుడు షెహయాజ్ కూడా డాక్టరే కావడం విశేషం. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్. అతనికి అన్న, సోదరి ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు వరుడి వదిన కూడా డాక్టరే కావడం మరో విశేషం. వీరంతా గుంటూరుకు చెందిన వారు కాగా.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక అలీ కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడు కూడా డాక్టరే కావాలని.. షెహయాజ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. 

కాగా.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా పరిచయమైన అతడు.. ప్రస్తుతం హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నారు. టీవీ షోకు హోస్ట్ గానూ నిరూపించుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement