
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఫాతిమా ముస్లిం కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆమె హిందువు అని, రాజకీయం కోసం తండ్రి పేరును మార్చారని విమర్శించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వేసినందుకు ఆమెపై ముషిరాబాద్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైందని ఒవైసీ ఆరోపించారు.
(చదవండి : ‘అసదుద్దీన్‌కి ఆ బిర్యానీ తినిపించాలి’)
రేణు సోనీ బీసీ కాదు
ఝాన్సీ బజార్ బీజేపీ అభ్యర్థి రేణు సోనిపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బీసీ కాదని, తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వేశారని ఆరోపించారు. రేణు సోనీకి ముగ్గురు పిల్లలుంటే.. ఇద్దరే అని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని విమర్శించారు. కాగా, ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఒవైసీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment