Kollywood Hero Vijay Antony Heading For Divorce? - Sakshi
Sakshi News home page

Vijay Antony : విడాకులు తీసుకోబోతున్న హీరో.. ఆ ట్వీట్‌తో కన్ఫామ్‌ చేశాడా?

Published Thu, Oct 13 2022 10:56 AM | Last Updated on Thu, Oct 13 2022 6:20 PM

Kollywood Hero Vijay Antony Heading For Divorce - Sakshi

ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్‌ అయిపోయింది. ఇప్పటికే చై-సామ్‌, ధనుష్‌-ఐశ్వర్యల విడాకుల అంశం హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్‌ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్ర్కొంన్నట్లు కోలీవుడ్‌ టాక్‌. తన భార్య ఫాతిమాతో ఆయనకు విభేదాలు వచ్చాయని, ఈ కారణంగా విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. 

తాజాగా విజయ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసింది.  'కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అంతేకానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానీయకండి. వారు  వచ్చి మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారు' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. సాధారణంగా తన సినిమాల గురించి తప్పా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని విజయ్‌ ఇలాంటి కామెంట్స్‌ చేయడంపై తమిళనాట పెద్ద చర్చ నడుస్తుంది.

ఫాతిమాతో విభేదాల కారణంగానే విజయ్‌ ఈ పోస్ట్‌ చేశాడా? త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన చేస్తారేమో అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ ఫాతిమాతోనే విజయ్‌ ప్రేమలో పడ్డాడు. 2006లో వీరికి వివాహం జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement