కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఫాతిమాపూర్లోని ఫాతిమా స్కూలు విద్యార్థులు నలుగురు అదృశ్యమయ్యారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న డి.ఇమ్ములనర్వకు చెందిన అజీజ్, నందిగామ మండలం నర్సప్పగూడకు చెందిన ప్రవీణ్, హైదరాబాద్ జియాగూడకు చెందిన దేవీశ్రీ ప్రసాద్, కొత్తూరు మండలం సెరిగూడ భద్రాయిపల్లికి చెందిన మధుసూదన్‌గౌడ్‌లు అదృశ్యమయ్యారు. మంగళవారం టీచర్ కొట్టాడని వీరంతా పారిపోయారు. కొత్తూరు పోలీసు స్టేషన్‌లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ గౌడ్ తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యం, వ్యాయామ ఉపాధ్యాయుడు శేఖర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment