ఫాతిమాకు కాంస్యం | NATIONAL SHOOTING CHAMPIONSHIP | Sakshi
Sakshi News home page

ఫాతిమాకు కాంస్యం

Dec 19 2014 1:08 AM | Updated on Sep 2 2017 6:23 PM

ఫాతిమాకు కాంస్యం

ఫాతిమాకు కాంస్యం

జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ఫాతిమా దిసావాలా కాంస్య పతకం గెలుచుకుంది.

జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్
 పుణే: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ఫాతిమా దిసావాలా కాంస్య పతకం గెలుచుకుంది. గురువారం జరిగిన 10 మీటర్ల పిస్టల్ యూత్ మహిళల ఈవెంట్ లో ఫాతిమా 372 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో హరియాణాకు చెందిన యశస్విని (384), నయని భరద్వాజ్ (374) వరుసగా స్వర్ణం, రజతం సాధించారు. మరోవైపు కర్ణాటక షూటర్ ప్రకాశ్ నంజప్ప... ‘చాంపియన్స్ ఆఫ్ చాంపియన్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతనికి రూ. 50 వేల నగదు పురస్కారాన్ని భారత రైఫిల్ సంఘం అందజేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement