ira khan
-
ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!
అమీర్ ఖాన్- రీనా దత్త కూతురుగా ఇరా ఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే. ఆమె‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. తన మానసిక ఆర్యోగ్యం(Mental health) గురించి బహిరంగంగానే మాట్లాడుతంటంది. తాను చాలా డిప్రెషన్‌కి గురయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది కూడా. దేని వల్ల తాను డిప్రెషన్‌కి గురయ్యింది, బయటపడేందుకు తీసుకన్న చికిత్స తన జీవితాన్ని ఎలా మార్చేసిందో సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అమీర్ ఖాన్(Aamir Khan) రీనా దత్తాలు 1986లో వివాహం చేసుకున్నారు. దగ్గర దగ్గర 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2002లో స్వస్తి పలికి విడిపోయారు. ఇక వారి ఇద్దరికి కలిగిన సంతానమే జునైద్ ఖాన్, ఇరా ఖాన్. ఇలా ఈ దంపతులు విడిపోవడం వారి కూతురు ఇరాఖాన్(Ira Khan)పై తీవ్ర ప్రభావమే చూపించింది. నిజానికి తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై గట్టిగానే పడుతుంది. అయితే అది కొందరిలో ఆత్మనూన్యత భావానికి లేదా నిరాశ నిస్ప్రుహలకి దారితీస్తుంది. ఇక్కడ ఇరాఖాన్ కూడా అలానే తీవ్రమైన డిప్రెషన్ బారిన పడింది. తాను ఆ సమస్యతో బాధపడుతన్నానని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దీన్నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది. అందుకోసం ఆమె తీసుకున్న థెరపీ(Therapy) మెదట తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించేలా చేసింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బాంధవ్యం గురించి ఓ స్పష్టమైన అవగాహన కలిగించింది. వాళ్లు కేవలం తన తల్లిదండ్రులుగా మాత్రమే చూడకూడదని, వాళ్లూ మనుషులే, తమకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వారి సంతానంగా తాను గౌరవించాలని తెలుసుకుంది ఇరా. అలా తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకుని డిప్రెషన్‌ను జయించే ప్రయత్నం చేశాను. పిల్లలకు వారి పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండమని ఎవ్వరూ చెప్పారు. ఆ పని మనమే చేయాలి. అదే మనకు మనో ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇరాఖాన్ తన ప్రియడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లిచేసుకుని వివాహం బంధంలోకి అడుగు పెట్టింది. (చదవండి: Maha Kumbh 2025: నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!) -
హనీమూన్‌లో స్టార్ హీరో కూతురు.. బీచ్‌లో విన్యాసాలు!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లాడింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ప్రారంభంలో వీరి వివాహం జరిగింది. ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఈ మధ్యే కొత్త జంట హనీమూన్‌కు ఇండోనేషియా చెక్కేసింది. అక్కడ కూడా వర్కవుట్స్ వదలడం లేదు నుపుర్. హనీమూన్‌లో భాగంగా ఏయే ప్రదేశాలకు వెళ్తున్నారో ఆ అన్నిచోట్లా ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. ఒలంపిక్స్‌కు వెళ్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీ హనీమూన్ ఎలా ఉంది? అని భర్తను కొంటెగా అడుగుతూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. హనీమూన్ ఎంజాయ్ చేయకుండా ఈ యోగా ఏంట్రా బాబూ.. ఈయన్ను ఒలంపిక్స్‌కు పంపించండి, ఐరా నువ్వు పెళ్లాడింది మనిషిని కాదు, కోతిని అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమిర్ దగ్గరే పని చేసి అతడి కూతురికే లైన్.. కాగా నుపుర్ శిఖరే.. బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలకు ఫిటెన్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. అలా ఆమిర్ ఖాన్ దగ్గర కొంతకాలంపాటు ఫిట్నెస్ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. జనవరిలో వీరి పెళ్లి, రిసెప్షన్ వేడుకలు జరిగాయి. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్: బీటౌన్ స్టార్లు, క్రికెటర్ల సందడి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్వేడుకలు, బారాత్, రిజిస్టర్ మ్యేరేజ్, ఆతరువాత ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో సదడి చేస్తున్నాయి. మాపెళ్లి మా ఇష్టం: ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్, పట్టుచీరలు, నగల హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్ఖాన్ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. Hassan sisters gives respect to legendary actor Dharmendra at Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#ShrutiHaasan #Dharmendra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/EmFIvfZZh3 — sdn (@sdn7_) January 13, 2024 పెళ్లి తరువాత జైపూర్, ముంబై వేదికగా ఇచ్చని రిసెప్షన్ వేడుకు కూడా టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. జైపూర్ వెళ్ల లేని వారు, ముంబైలో, ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్‌లో ఈ రిసెప్షన్‌కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీటీలు, క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం విశేషం. Maharashtra CM Eknath Shinde attends Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#EknathShinde #Maharashtra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/OvcFQfVREK — sdn (@sdn7_) January 13, 2024 ఇంకా బాలీవుడ్లో ఖాన్ త్రయంగా పేరొందిన షారుఖ్, సల్మాన్ ఇద్దరూ అమీర్‌ఖాన్‌తో కలిసి సందడి చేశారు. ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు విచ్చేసి ఇరా, నూపుర్ జంటకు అభినందనలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్‌కు హాజరైనారు. ఇంకా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ మరింత ఆకర్షణగా నిలిచారు. -
Ira Khan-Nupur Shikhare: గ్రాండ్‌గా మరోసారి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ కూతురు (ఫోటోలు)
-
హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వరుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare) జాగింగ్ చేసుకుంటూ పెళ్లి మండపానికి రావడం, అలాగే వధువు ఇరాఖన్ చాలా సాదాసీదా కనిపించడం తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావు సందడిగా కనిపించడం విశేషంగా నిలిచింది. తాజా మరో విషయం నెటిజనులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రతీ ఇంటికి ఆడబిడ్డ అంటే మురిపెం. అడిగింది కాదనకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కానీ పెళ్లీడు వచ్చి ఒక అయ్యలో చేతిలో పెట్టి అత్తారింటికి పంపే క్రమంలో మాత్రం తన ప్రాణమే పోతున్నంత బాధపడతారు. ముఖ్యంగా తండ్రులు బరువెక్కిన గుండెలతో భావోద్వేగానికి గురవుతుంటారు. ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అని ఓ సినీ కవి అన్నట్టు తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) ఇప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఇరా-నూపుర్ జంట బుధవారం ఉదయపూర్‌లో ఉంగరాలు మార్చుకుని మరో వివాహ వేడుకను జరుపుకున్నారు. ఈ సమయంలో పెళ్లికూతురు తండ్రి అమీర్ ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అమీర్ , తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) -
మరోసారి పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరో కూతురు.. ఎందుకంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇటీవలే తన ప్రియుడిని పెళ్లాడింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నవంబర్ 3న జరిగిన పెళ్లిలో ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర సంప్రదాయంలో వీరి వివాహా వేడుక జరగనుంది. వరుడి కుటుంబం కోరిక మేరకే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహా వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈనెల 8 నుంచి మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఇప్పటికే నూతన వధువరులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అమీర్ ఖాన్ సైతం పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. మెహందీ, హల్దీ వేడుకలకు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధువులు హాజరు కానున్నారు. పెళ్లి ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం జనవరి 13న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో బాలీవుడమ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో సహా పలువురు అగ్రతారలు హాజరు కానున్నారు. కాగా.. జనవరి 3నముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఐరా ఖాన్. ఆమిర్- రీనా దంపతులకు జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు. -
Ira Khan: ప్రియుడితో ఆమిర్ ఖాన్ కూతురి పెళ్లి.. జాగింగ్ డ్రెస్‌లోనే వెడ్డింగ్ (ఫోటోలు)
-
'స్టార్ హీరో కూతురు అయ్యుండి.. ఇలాంటి బట్టలు వేసుకుందేంటి'?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లు గానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యకంగా కనిపించాలని ఆరాటపడినా కొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతుంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత రాత్రి(జనవరి3)న ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖర్‌తో ఇరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. వరుడు బ్లూ కలర్ షేర్వానీలో కనిపించగా, వధువు ఇరాఖాన్ సింపుల్‌గా పటియాలా-చోలి దుస్తుల్లో కనిపించింది. అయితే స్టార్ హీరో కూతురు అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అర్జెంట్‌గా ఈమెకు స్టైలిస్ట్ అవసరం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్లంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా? జాగింగ్ చేస్తూ నుపుర్ పెళ్లి వేడుకకు రావడం ఏంటి? జిమ్ డ్రెస్‌లో పెళ్లి తంతు ముగించడం ఏంటి? కనీసం బట్టలు అయినా పద్దతిగా వేసుకున్నారా అంటే అదీ లేదు. ఇదేదో కొత్తరకం స్టైల్ అనుకుంటున్నారేమో, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ అంటూ కొత్త జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకునేవారు. కానీ ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్‌ని ఎంచుకున్నారు. అనుష్క శర్మ నుంచి పరిణితి చోప్రా వరకు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేస్టల్ కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇరాఖాన్ ఇలా నీలం రంగు దుస్తుల్లో, కొల్హాపురి చప్పల్స్‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. అయినా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు వారివి. నిజం చెప్పాలంటే ఈ జంట హంగు, ఆర్భాటాలతో కాకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం ఆదర్శమని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
స్టార్ హీరో కూతురి పెళ్లి.. బనియన్ మీదే వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్- నిర్మాత రీనా దత్తాల కూతురు ఇరా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. బుధవారం(జనవరి 3న) నాడు ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. జాగింగ్ చేస్తూ మండపానికి.. ఇక వరుడు ఫిట్నెస్ ట్రైనర్ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు కూడా మార్చుకోకుండా టీషర్ట్‌పైనే పెళ్లి వేడుకలు కానిచ్చేశాడు. రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. ఈ పెళ్లిలో ఆమిర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేశారు. రెండో మాజీ భార్య అయిన కిరణ్ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడీ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13న ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 2022లో ఎంగేజ్మెంట్.. కాగా నుపుర్ శిఖరే.. ఆమిర్ ఖాన్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేశాడు. అలా అతడికి ఇరాతో పరిచయం ఏర్పడింది. కరోనా సమయంలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇన్నాళ్లకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్, మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఇరా ఖాన్. ఆమిర్- రీనా దంపతులకు జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు. After marriage ceremony of daughter #IraKhan during photoshoot #AamirKhan kisses #KiranRao what a moment love and Peace 🥰🥰#NupurShikhare #ReenaDutta #celebrity #wedding #celebration pic.twitter.com/lrUEUR7wB5 — sdn (@sdn7_) January 4, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: విజయ్ సినిమాలో ఇన్ని సర్‌ప్రైజులా.. ఫ్యాన్స్‌కు పండగే! -
Ira Khan-Nupur Shikhare Pre-Wedding: అమీర్ ఖాన్ మొదటి భార్య కుమార్తె 'ఇరా ఖాన్' ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
-
తన ఫిట్నెస్ ట్రైనర్‌తో స్టార్ హీరో కూతురి పెళ్లి..
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అమీర్ వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్‌ను ఆమె ప్రేమించింది. వారిద్దరూ కూడా ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం ఆపై పెద్దల అంగీకారంతో ఏడాది క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 3, 2024, అంటే రేపు ఐరా ఖాన్- నుపుర్ శిఖరే వైవాహిక జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు మరో రోజు మాత్రమే ఉండటంతో, వధూవరుల తల్లిదండ్రుల నివాసంలో వివాహ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అమీర్ ఇంటికి సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. అమీర్ ఖాన్ నివాసంలోని రెండు అంతస్తులు విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మరోవైపు అమీర్ మొదటి భార్య రీనా దత్తా ఇల్లు కూడా పూలతో కళకళలాడుతోంది. వివాహానికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. నవంబర్ 2022లో ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ఐరా ఖాన్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహానికి ముందు ఆచారాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కెల్వన్, ఉఖానా చేయడం ద్వారా వివాహానికి ముందు వేడుకలు ప్రారంభమవుతాయి. బాంద్రాలోని రాయల్ తాజ్ ల్యాండ్స్ అండ్ హోటల్లో గ్రాండ్‌గా వెడ్డింగ్ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జనవరి 6, 10 తేదీల మధ్య, 2 రిసెప్షన్ పార్టీలు నిర్వహించబడతాయని సమాచారం. ఢిల్లీ, జైపూర్లలో రిసెప్షన్ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొననున్నారు. అమీర్ తన కుమార్తె పెళ్లి కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పటికే తన బాలీవుడ్ స్నేహితులను వ్యక్తిగతంగా ఆహ్వానించాడు. మానసిక కుంగుబాటుకు గురైన 'ఐరా' ఆమిర్‌ఖాన్ - ఆయన మొదటి భార్య రీనా దత్‌లకు ఐరా జన్మించారు. పరస్పర అంగీకారంతో తల్లీదండ్రులిద్దరూ విడిపోయిన తర్వాత ఐరా మానసిక కుంగుబాటుకు గురయ్యారు. కరోనా సమయంలో ఆమిర్ ఫిట్నెస్ ట్రైనర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది ప్రేమగా మారింది. ఇప్పుడు వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం విశేషం. కూతురు పెళ్లిపై గతంలో అమీర్ ఎమోషనల్ కామెంట్ కూతరు పెళ్లి గురించి తన అభిమానులతో అమీర్ పంచుకున్నాడు. జనవరి 3న ఐరా - నుపుర్‌ల పెళ్లి చేయాలని తాము నిశ్చయించామని ఆయన గతంలోనే చెప్పాడు. నుపుర్ మంచి అబ్బాయని, ఐరా గతంలో మానసిక కుంగుబాటుతో పోరాడుతున్న సమయంలో తనకి అతడే అండగా నిలిచాడని ఆయన చెప్పాడు. పెళ్లి బంధంతో వాళ్లు సంతోషంగా ఉన్నందుకు తానెంతో ఆనందిస్తున్నానని ఆయన ప్రకటించారు. వారిద్దరిలో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. వాళ్ల పెళ్లి నాడు తానెంతో భావోద్వేగానికి గురవుతానని ముందే చెప్పాడు అమీర్.\ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడితో స్టార్ హీరో కూతురి పెళ్లి వేడుక.. ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ పెళ్లిసందడి నెలకొంది. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. జనవరి 3వ తేదీన నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకోనుంది. ఇప్పటితే వీరి వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ జంట వివాహం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో పెళ్లి జరగనుందని నుపుర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. (ఇది చదవండి: విజయ్ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి, వీడియో వైరల్) అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రెసెప్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లి తర్వాత రెండు రిసెప్షన్ పార్టీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6 నుంచి 10 తేదీల మధ్య ఢిల్లీతో పాటు జైపూర్‌లోనూ రిసెప్షన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.కాగా.. అమిర్ ఖాన్ కూతురు ఐరా.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి కోసం తన వంతుగా అవగాహన కల్పిస్తోంది. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఐరా ఖాన్.. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలు ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కెల్వన్ వేడుక అంటే.. మహారాష్ట్ర సంప్రదాయంలో భాగంగా వివాహానికి ముందు కెల్వన్ వేడుకను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు తరఫున తల్లిదండ్రులు ఒకరి కుటుంబాలకు మరొకరు ఆహ్వాన పత్రికలను అందజేస్తారు. ఈ వేడుకలో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వేడుకకు ఇరువైపులా బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులకు బహుమతులు అందజేస్తారు. తాజాగా ఐరా ఖాన్ దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఐరా ఖాన్, నుపుర్ శిఖరే గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 3, 2024న వివాహా బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా.. ఐరా ఖాన్ మానసకి సమస్యలతో బాధపడే వారికి అవగాహన కల్పిస్తోంది. తన తండ్రితో కలిసి ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తోంది. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఆయన కూతురు ఐరా ఖాన్‌కు తన ప్రియుడితో ఎంగేజ్‌మెంజ్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నుపుర్ శిఖరేతో డేటింగ్లో ఉన్న ఐరా గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఏడాది పూర్తవుతున్నా పెళ్లి తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఐరా పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటూ అమిర్ ఖాన్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: రకుల్ భామకు బాయ్‌ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!) అయితే తాజాగా తన కుమార్తె పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ హీరో. అభిమానుల ఊహగానాలకు తెరదించుతూ అమిర్ ఖాన్ పెళ్లి తేదీని వెల్లడించారు. జనవరి 3, 2024న నుపుర్ శిఖరేను ఇరా ఖాన్ వివాహం చేసుకోనున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. ఐరా కష్టకాలంలో నుపుర్ తనకు అండగా నిలిచినట్లు అమీర్ వెల్లడించారు. నుపుర్ ఇప్పటికే మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఐరా పెళ్లి రోజు తాను చాలా ఎమోషనల్ అవుతాననని అన్నారు. అమిర్ మాట్లాడుతూ..'ఐరా జనవరి 3న పెళ్లి చేసుకోబోతోంది. ఆమె ఎంచుకున్న అబ్బాయి చాలా మంచివాడు. ఐరా డిప్రెషన్‌తో పోరాడుతున్నప్పుడు నుపుర్ అండగా నిలిచాడు. మానసికంగా ఆమెకు దృఢంగా మార్చాడు. ఐరా, నుపూర్‌లు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఒకరినొకరు చాలా బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది.' అని అన్నారు. కాగా.. ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. ఇరా, నుపుర్ 2020లో డేటింగ్ ప్రారంభించి.. తన రిలేషన్‌ను 2021లో అఫీషియల్‌గా చేసుకున్నారు. ఇటీవలే తన కూతురితో కలిసి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దయచేసి నిపుణుల సలహాలు తీసుకోమని అమిర్ సూచించారు. (ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్) -
'మీరు తప్పకుండా మా సలహా పాటించండి'.. స్టార్ హీరో విజ్ఞప్తి!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. దంగల్ సినిమాతో దక్షిణాదిలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో సినిమాలతో బిజీగా అన్న హీరో.. తాజాగా తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఎవరైనా సరే మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అంతేకాకుండా మెరుగైన సలహాల కోసం నిపుణులను సంప్రదించమని విజ్ఞప్తి చేశారు. కాగా.. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. అమీర్ ఖాన్ మాట్లాడుతూ..' వైద్యుడైనా, ఉపాధ్యాయుడు, వడ్రంగి అయినా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. వాటికి నిపుణుల సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాదే ప్రతి మనిషి తమ మానసిక పరిస్థితి బాగా లేకపోతే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సిగ్గపడొద్దు. మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం పొందండి. గతంలో నా కుమార్తె ఇరా, నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. అందుకే చికిత్స తీసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్' అని అన్నారు. కాగా.. ఐరా ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఆమె అగాట్సు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణను పెంపొందించడం ఐరా ఖాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఇరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇరా గతంలో డిప్రెషన్‌తో తన బాధపడినట్లు తన అనుభవాన్ని పంచుకుంది. అగట్సు ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కష్ట సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యమని ఐరా చెబుతోంది. కాగా.. అమీర్ ప్రస్తుతం లాపటా లేడీస్, లాహోర్ 1947 చిత్రాలను నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2020లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఇద్దరు కలిసి ఉన్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: 7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు) ఉదయ్‌పూర్‌లో పెళ్లిసందడి ఈ ప్రేమ జంట రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగే వేడుక కోసం ఇప్పటికే ప్లాన్ చేసినట్లు సమాచారం. అమీర్ ఖాన్ సైతం తన కుమార్తె వివాహా వేడుక కోసం ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తి కావడంతో పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేశారు. 26 ఏళ్ల ఐరా తన పెళ్లి ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జనవరి 3వ తేదీన పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు వివరించింది. ఐరా మాట్లాడుతూ..'మేం జనవరి 3న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ సంవత్సరం అనేది మేము నిర్ణయించుకోలేదు. జనవరి 3 మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మేమిద్దరం మొదటిసారి ముద్దుపెట్టుకున్న రోజు' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఓ సైక్లింగ్ ఈవెంట్ సందర్భంగా నుపుర్.. ఆమెకు ప్రపోజ్ చేశారు. అతను వృత్తిరీత్యా ఫిట్నెస్ కోచ్ కాగా.. అమీర్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత, డిసెంబర్ 2005లో కిరణ్ రావును అమీర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2022లో విడిపోయారు. అమీర్ ఖాన్ కుమార్తె 2019లో 'యూరిపిడెస్' మెడియా నాటకం ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అయితే తనకు నటిగా మారడం ఇష్టం లేదని ఐరా స్పష్టం చేసింది. (ఇది చదవండి: అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ.. తాజాగా మరో సినిమా..) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్‌కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
4 గంటలు ఏడ్చేదాన్ని, 10 గంటలు నిద్రపోయేదాన్ని: స్టార్ హీరో కూతురు
పెళ్లి ఎంత ఆర్భాటంగా చేసుకున్నా చాలామంది కలకాలం కలిసి ఉండలేకపోతున్నారు. సెలబ్రిటీలైతే ఫ్రెండ్షిప్లో కటీఫ్ చెప్పుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా ఇలా ఒకటి కాదు రెండు విడాకులు తీసుకున్నాడు. మొదట్లో రీనా దత్తాను పెళ్లాడిన అతడు 2002లో ఆమెకు విడాకులిచ్చాడు. అనంతరం కిరణ్ రావును పెళ్లాడిన ఈ హీరో 15 ఏళ్లపాటు తనతో కలిసి ఉండి 2021లో ఆమెకు కూడా విడాకులిచ్చేశాడు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నాడు. అయితే ఆమిర్ ఖాన్ మొదటి విడాకుల వల్ల తాను ఎంతగానో డిస్టర్బ్ అయ్యానంటోంది అతడి కూతురు ఇరా ఖాన్. ఇటీవలే ఆమె మానసిక ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా అగస్తు సంస్థను స్థాపించింది. ఈ సందర్భంగా ఇరా ఖాన్ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో తను కూడా మానసికంగా క్షోభకు గురయ్యానని చెప్పుకొచ్చింది. 'అమ్మానాన్న విడిపోయినప్పుడు నేనంత ప్రభావితం కాలేదు. కానీ ఏదో తెలియని బాధ మాత్రం నన్ను దహించివేసింది. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే చెప్తే వాళ్లు బాధపడతారని! ఏడాదిన్నరపాటు ఒకరకమైన డిప్రెషన్లో ఉండిపోయాను. నాలుగు రోజులపాటు తిండి కూడా మానేశాను. రోజులో నాలుగు గంటలు ఏడ్చేదాన్ని, 10 గంటలు పడుకునేదాన్ని. ప్రతి 8-10 నెలలకు ఒకసారి మానసికంగా మరింత ఆందోళన చెందేదాన్ని. ఇది పాక్షికంగా జన్యుపరమైనదే! నా కుటుంబంలో కొందరికి మానసిక రుగ్మతలున్నాయి. ఈ మానసిక వ్యాధిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది. నేను కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే నెమ్మదిగా డిప్రెషన్ ఊబిలో కూరుకుపోయాను. గతేడాది జూలైలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నేను మందులు కూడా తీసుకోవడం మానేశా, ఒక్కసారిగా బరువు పెరిగాను. ఆ తర్వాత డిప్రెషన్‌తో పోరాడేలా నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను' అని ఇరా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్- రీనా దత్తాల రెండో కూతురు ఇరా ఖాన్. ఇరా కంటే ముందు వీరికి జునైద్ అనే కుమారుడున్నాడు. ఆమిర్- కిరణ్ రావులకు ఆజాద్ అనే తనయుడున్నాడు. చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్ -
ఆ రోజు యువరాణిలా ఫీలయ్యా.. స్టార్ హీరో కుమార్తె పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్ బాయ్‌ఫ్రెండ్‌తో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో ఐరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఐరాఖాన్ తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. తాజాగా ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ఇన్‌స్టాలో ఐరా ఖాన్ రాస్తూ..'నేను అందంగా ఉంటానని ఎప్పుడు భావించలేదు. కానీ ఎందుకో ఆ రోజు అలా అనిపించింది. నన్ను నేను యువరాణిలా భావించా. ఎలాంటి ఎక్స్ప్రెషన్తోనైనా.. ఎలాంటి కోణంలోనైనా ఫోటో తీయవచ్చని భావించా. ఆరోజు నేను ఇంకా అందంగా కనిపించా. చాలా అందంగా కనిపించేలా చేసినందుకు ధన్యవాదాలు.' అంటూ లవ్ సింబల్ జతచేసింది. దీనికి నటి రియా చక్రవర్తి రిప్లై ఇచ్చింది. బ్యూటీఫుల్ అంటూ లవ్ ఎమోజీలు జత చేసింది. మరో నటి జైన్ మేరీ ఖాన్ కామెంట్ చేస్తూ.. 'నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ రోజు మీరు ఎరుపు రంగు డ్రెస్‌లో అందంగా కనిపించారంటూ రిప్లై ఇచ్చింది. మిథిలా పాల్కర్, విజయ్ వర్మ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
బాయ్‌ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఇరాఖాన్ ఇటీవలె తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలో ఎంగేజ్మెంట్ వేడకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకలో ఇరాఖాన్ రెడ్గౌనులో మెరిసిపోగా, నుపుర్ బ్లాక్ సూట్లో కనిపించాడు. అయితే ఈ ఎంగేజ్మెంట్ పార్టీలో నటి ఫాతిమా సనాషేక్ హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. `థగ్స్ ఆఫ్ హిందూస్థాన్` నుంచి అమీర్ ఖాన్, ఫాతిమా ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. ఆమిర్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకోవడానికి కూడా ఫాతిమానే కారణం అంటూ టాక్ వినిపించింది. ఇప్పుడు మరోసారి వీరి రిలేషన్షిప్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. -
ఫిట్నెస్ ట్రైయినర్తో స్టార్ హీరో కూతురు ప్రేమాయణం, త్వరలో పెళ్లి!
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తండ్రి ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పండగలు, స్పెషల్ డేస్‌ను సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అయితే దీనిపై ఎప్పుడూ ఐరా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా తమ రిలేషన్‌పై ఐరా అధికారిక ప్రటకన ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఎస్ చెప్పానంటూ ఐరా ఓ క్యూట్ వీడియో షేర్ చేసింది. చదవండి: టీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి ఇందులో నుపుర్ ఐరాకు రింగ్ తొడుగుతూ ప్రపోజ్ చేసినట్లు కనిపించాడు. సైక్లింగ్ పోటీలో భాగంగా నుపుర్ ఇటీవల విదేశాలకు వెళ్లాడు. అతనికి తోడుగా ఐరా కూడా వెళ్లింది. ఇక పోటీలు ముగిసిన వెంటనే ప్రియురాలి వద్దకు వచ్చిన నుపుర్ ఆమెను హత్తుకుని ముద్దాడాడు. అనంతరం మోకాలిపై కూర్చొని ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఉంగరం తొడుగుతూ ప్రపోజ్ చేశాడు. ఇక వెంటనే ఐరా మురిసిపోతూ ప్రియుడికి తన చేయి అందించింది. ఇక ఈ వీడియో ఆమె షేర్ చేస్తూ ‘నేను ఎస్ చెప్పాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ తన పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ సినీ సెల్రబెటీలు స్పందిస్తూ ఈ లవ్ బర్డ్స్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదంత చూస్తుంటే త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. కాగా కొన్నేళ్లకు ఆమీర్‌కు నుపుర్ ఫిట్నెస్ ట్రెయినర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలోనే నుపుర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహితులు ఉన్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2020 నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉండగా.. తాజాగా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు ఈ లవ్‌బర్డ్స్. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఆమిర్ ఖాన్ ఎదుటే బికినీలో బర్త్‌డే పార్టీ, ట్రోలర్స్ నోర్మూయించిన ఐరా
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఇటీవల (మే 8న) బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. అయితే ఈసారి వెరైటీగా పూల్ పార్టీ చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో నుంచి తడుచుకుంటూ వచ్చిన ఐరా బికినీలోనే కేక్ కటింగ్ చేసింది. తల్లి రీనా, తండ్రి ఆమిర్ ఖాన్ల ఎదుటే బికినీలో బర్త్‌డే జరుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు ఐరా తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఆమెను దుమ్మెత్తిపోశారు. ఆ డ్రెస్‌లో వేడుక చేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గు లేదా? అని మండిపడ్డారు. అయితే ఈ కామెంట్లను పెద్దగా పట్టించుకోని ఐరా తన బర్త్‌డేను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తాజాగా తనను ట్రోల్ చేసినవారికి గట్టి కౌంటరిచ్చిందామె. 'నా బర్త్‌డే ఫొటోల మీద మండిపడుతూ ట్రోల్ చేయడం అయిపోయిందా? ఎందుకంటే మీకోసం మరికొన్ని ఫొటోలు..' అంటూ మరిన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది ఐరా. దీంతో షాకైన ట్రోలర్స్ ఇలా కౌంటరిచ్చిందేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. దొరికిందే ఛాన్సని నోరు పారేసుకున్నవాళ్లకు భలే ఆన్సరిచ్చావని ఐరాను పొగుడుతున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: ఆర్జే కాజల్ హోం టూర్ వీడియో, దీంట్లో ఓ స్పెషల్ ఉంది! ఖుషి టైటిల్‌తో వస్తున్న విజయ్, సామ్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది -
ఆమిర్ ఖాన్ కూతురు బర్త్‌డే పార్టీ, బికినీలో కేక్ కటింగ్!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ ఆదివారం(మే 8న) 25వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుంది. అయితే ఈ వేడుకల్లో ఇరా బికినీలో కేక్ కట్ చేయడం విశేషం. ఆమిర్, ఆజాద్ కూడా షర్ట్ లేకుండా ఉండటాన్ని బట్టి వారు అప్పుడే స్విమ్మింగ్ పూల్‌లో నుంచి బయటకు వచ్చి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ బర్త్‌డే పార్టీలో తల్లి రీనా దత్తా కూడా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బికినీలో కూడా బర్త్‌డే జరుపుకుంటారా? అని కొందరు సర్ప్రైజ్ అవుతుంటే పేరెంట్స్‌తో ఆ డ్రెస్‌లో వేడుక చేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గు లేదా? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇరా ఖాన్ ప్రియుడు నుపూర్ ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఇరా ఖాన్ ఇటీవలే యాంగ్జైటీతో బాధపడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే! సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నానని, మాటిమాటికీ ఏడుపొస్తుందని తన మానసిక సమస్యను వివరించింది. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) చదవండి: కేజీఎఫ్ 2: 'అమ్మ పాట' ఫుల్ వీడియో చూశారా ? ఫహద్ ఫాజిల్ 'దొంగాట' రివ్యూ.. ఎలా ఉందంటే ? -
ఆ వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు..
Ira Khan Reveals How She Suffers With Anxiety: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన జీవితం గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. ఆమె రిలేషన్షిప్, విజయాలు, సినిమా విషయాలు, ఫ్యామిలీతో ఉండే అఫెక్షన్ వంటి తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా తనకున్న మానసిక ఆరోగ్య సమస్య గురించి ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చింది. 'నేను యాంగ్జైటీతో బాధపడుతున్నాను. దీనివల్ల హార్ట్‌బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరి కూడా సరిగా తీసుకోలేను. పదేపదే ఏడుపొస్తుంది. యాంగ్జైటీ లక్షణాలు పెరిగి పెద్దగా ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. దీంతో నిత్యం డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది.' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది ఐరా ఖాన్. కాగా ఐరా ఖాన్ సినిమాల్లోకి రావడం లేదని ఇటీవల పేర్కొన్ని విషయం తెలిసిందే. చదవండి: నేను సినిమాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన స్టార్ హీరో కూతురు -
మేకప్‌మెన్‌గా మారిపోయిన ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మేకప్‌మెన్‌గా మారిపోయాడు. ఎందుకు? ఎవరికోసం? అనుకుంటున్నారా? తన ముద్దుల కూతురు ఇరా కోసం! ఈ విషయాన్ని స్వయంగా ఇరానే వెల్లడించింది. 'నాకు మేకప్ ఎవరు వేశారో తెలుసా? ఇంకెవరు మా నాన్నే. నాకంటే బాగా మేకప్ వేస్తానని చెప్పాడు. చివరకు ఆ మాటను నిజం చేసి చూపించాడు. ఎవరికైనా యూట్యూబ్ ట్యుటోరియల్స్ కావాలా?' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఆమిర్ తన ముఖానికి మేకప్ వేస్తే ఇరా మాత్రం ఆమిర్ తలకు హెయిర్ బ్యాండ్ పెట్టి నవ్వేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి అనుబంధాన్ని చూసిన ఫ్యాన్స్ ఆమిర్ ఉత్తమ తండ్రి, లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమిర్ నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైత్య, అద్వైత్ చందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: 'నువ్వు యాక్టరేంటి? నిన్ను తీసుకుంటే మాకన్నీ నష్టాలే' -
నేను సినిమాల్లోకి రావడం లేదు.. తేల్చేసిన స్టార్ హీరో కూతురు
Aamir Khan Daughter Ira Khan About Her Acting Interest In Movies: ప్రముఖ హీరోలు, హీరోయిన్ల కుమారులు, కుమార్తెలు సినీ రంగంలోకి అడుగుపెట్టడం సాధారణ విషయమే. తమ వారసులను వెండితెరపై చూసుకోవాలనే ఆశ సూపర్ స్టార్స్‌కు ఉండటం సహజమే. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి యంగ్ జనరేషన్ సెలబ్రిటీలు తమ తల్లిదండ్రుల మార్గాన్నే అనుసరించి సినీ ఫీల్డ్నే ఎంచుకున్న స్టార్స్ ఎందరో ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ల జాబితాలో ఉండనంటుంది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఐరా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ప్రశ్నలు, సమాధానాల సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో ఇన్‌స్టా యూజర్స్‌తో సంభాషించింది. మానసిక ఆరోగ్య సమస్యలు, ఆమె భవిష్యత్తు ప్రణాళికలు వంటి తదితర అంశాలపై స్పందించింది. ఈ క్రమంలోనే ఒక యూజర్ బాలీవుడ్లో నటిగా మారాలనే ఆలోచన ఉందా అని అడిగారు. దానికి ఐరా 'నేను సినిమాల్లోకి రావడం లేదు' అని సమాధానం ఇచ్చింది. దీంతో ఐరాకు యాక్టింగ్ పట్ల ఆసక్తి లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె గతంలో మీడియా అనే నాటకానికి దర్శకత్వం వహించింది. దీన్ని బట్టి చూస్తే ఐరా యాక్టింగ్ పరంగా కాకుండా డైరెక్టర్‌గా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ పెద్ద కుమారుడు జునైద్ ఖాన్ మాత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'మహారాజా' చిత్రంతో సినిమాల్లోకి తెరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. -
ప్రతిభతో నిలదొక్కుకునేందుకు వస్తున్న 'బీటౌన్' వారసులు
వారిస్ వస్తున్నారోచ్.. హిందీలో వారిస్ వస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ విజిటింగ్ కార్డ్‌తో వస్తున్నారు. ఒకట్రెండు సినిమాలకే బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగపడుతుంది. అందుకే టాలెంట్‌తో నిలబడాలనుకుని వస్తున్నారు. ఇప్పుడందరి కళ్లూ ఈ వారిస్ మీదే. ‘వారిస్ ఆ రహే హై’ (వారసులు వస్తున్నారు) అంటూ స్టార్ కిడ్స్‌కి వెల్కమ్ చెప్పడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. త్వరలో పరిచయం కానున్న ఆ వారసుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో వారసుల ఎంట్రీ లిస్ట్ ప్రతి ఏడాది అప్డేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ పేర్లు చేరిపోయాయి. ఈ ముగ్గురూ జోయా అక్తర్ డైరెక్షన్లో ఓ వెబ్ ఫిలిం చేయనున్నారని టాక్. కామిక్ బుక్ ఆర్చీస్ ఆధారంగా ‘ది ఆర్చీస్’ అనే మ్యూజిక్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది నవంబరులో దర్శకురాలు జోయా అక్తర్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 1960 నేపథ్యంలో టీనేజర్స్ కథలా ఉంటుంది ఆర్చీస్ నవల. ఈ ప్రాజెక్ట్ కోసం తాజాగా అగస్త్య నంద, సుహానా ఖాన్, జోయాల మధ్య ఓ మీటింగ్ జరిగినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ షాప్స్‌లో భాగంగానే అగస్త్య, సుహాన, జోయ కలిశారన్నది బీ టౌన్ టాక్. ఇదే ప్రాజెక్ట్‌లో ఖుషీ కపూర్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది. ఖుషీ కపూర్‌కు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని, న్యూయార్క్‌లో శిక్షణ తీసుకుంటోందని గత ఏడాది ఓ సందర్భంలో ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ అన్నారు. తాజాగా ‘త్వరలోనే ఖుషీ కపూర్ కెమెరా ముందుకు వెళుతోంది. ఖుషీ యాక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కావొచ్చు’’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. దీంతో ఖుషీ ‘ది ఆర్చీస్’ ప్రాజెక్ట్‌లో భాగమయిందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీమ్ అలీఖాన్ (సైఫ్–అమృతా సింగ్‌ల కుమారుడు ఇబ్రహీమ్) పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం జోయా అక్తర్ పరిశీలించిన పేర్లలో వినిపిస్తోంది. ఆండ్రూస్, బెట్టి కూపర్, వెరోనికా లాడ్జ్, జగ్హెడ్ జోన్స్ అనే నలుగురు టీనేజ్ క్యారెక్టర్ల చుట్టూ ‘ది ఆర్చీస్’ తిరుగుతుంది. మరి.. ఇందులో ఎవరెవరు ఏయే క్యారెక్టర్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ పైన చెప్పిన స్టార్ కిడ్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే మాత్రం ఒకే ప్రాజెక్ట్‌తో నలుగురు వారసుల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రముఖ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ యాక్టింగ్ జర్నీ ఆరంభమైంది. హీరోయిన్ అనుష్కా శర్మ నిర్మిస్తున్న ‘క్వాల’ అనే వెబ్ సిరీస్‌లో బాబిల్ నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఐదు ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ చిన్న కొడుకు రజ్వీర్ (సన్నీ పెద్ద కొడుకు కరణ్ 2019లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు) ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఈ చిత్రానికి ఎస్. అవ్నీష్ దర్శకుడు. మరోవైపు అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తనయుడు (ఆమిర్–రీనా దత్ల కుమారుడు) జునైద్ ఖాన్ ‘మహా రాజా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా ‘మేదియా’ అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ కూడా ఖరారవుతున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్యన్ యాక్టర్‌గా కన్నా కూడా రైటర్‌గానే ముందుగా పరిచయం కానున్నాడని బీ టౌన్ వార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆర్యన్ రైటర్‌గా మారాడని భోగట్టా. అలాగే ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ నటించనున్నారట. ఇక ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి ఎంట్రీ కూడా ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మరికొందరు స్టార్ కిడ్స్ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. మరి.. టాలెంట్‌తో నిలబడే వారసులు ఎందరో చూడాలి. -
ఆమెను తాకొద్దు.. ఐరా బాయ్‌ఫ్రెండ్‌కు ఫ్యాన్ వార్నింగ్.. తర్వాత ?
Ira Khan Boyfriend Nupur Shikhare Gets Message From Her Fan: బాలీవుడ్ సూపర్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ తమపై ఒకరిపై ఒకరికున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా చూపించడంలో అస్సలు మొహమాటపడరు. గతేడాది వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా తాను నుపుర్ శిఖరేతో రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా తెలిపింది ఐరా. ప్రామిస్ డే సందర్భంగా నుపుర్‌తో కలిసి దిగిన ఫొటోలను 'నీతో ప్రామిస్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను; అంటూ షేర్ చేసింది. తర్వాత వీరు దీపావళి, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నుపుర్ శిఖరే ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నాడు. అందులో అతనికి ఐరా అభిమాని పంపిన మెస్సెజ్ చూపించాడు. 'ఐరా నా ప్రేమ (నా ప్రేయసీ, ఐరా నాది), తనని తాకొద్దు' అంటూ ఐరా ఫ్యాన్ ఒకరు నుపుర్ శిఖరేకు సందేశం పంపాడు. ఇది చూసిన నుపుర్ కొద్దిసేపు ఆలోచించి పక్కనే పని చేసుకుంటున్న ఐరాను చేతివేలితో తాకుతాడు. అది అంతగా పట్టించుకోదు ఐరా. తర్వాత నుపుర్ వచ్చి ఐరాకు ముద్దు పెడతాడు. ఆ ముద్దుతో ఐరా నవ్వుతుంది. దీంతో ఆ వీడియో పూర్తి అవుతుంది. ఐరాను తాకద్దు అని వార్నింగ్ ఇచ్చిన ఆమె ఫ్యాన్‌కు ఐరాకు ముద్దు పెట్టి బదులిచ్చాడు నుపుర్ శిఖర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. ఎపిక్ రిప్లై అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) ఇదీ చదవండి: తండ్రిని పట్టుకుని బంధువా అన్నాడు.. ఐరా ఖాన్ స్ట్రాంగ్ రిప్లై -
తండ్రిని పట్టుకుని బంధువా అన్నాడు.. ఐరా ఖాన్ స్ట్రాంగ్ రిప్లై
Ira Khan Reacts To User For Asking Amir Khan Is Your Relative: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ (అమీర్ ఖాన్, అతని మాజీ భార్య రీనా దత్తా కుమార్తె) సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకల్లో ఆమె తన తండ్రితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలకు నెటిజన్స్ భిన్నంగా, విచిత్రంగా స్పందించారు. ఒక నెటిజన్ ఏకంగా 'అమీర్ ఖాన్ మీకు బంధువా' అని ప్రశ్నించాడు. అతనికి సమాధాంగా వారిద్దరూ తండ్రి కూతుళ్లు అని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జవాబును కూడా నెటిజన్ నమ్మకుండా 'అతను తండ్రిలా కనపడట్లేదు.' అని కొనసాగించాడు. ఈ సమాధానానికి మరో యూజర్ ఆమెకు ఆమీర్ ఖాన్ బయోలాజికల్ ఫాదర్ అన్న రిప్లైకు కూడా ఆ నెటిజన్ 'గుడ్ జోక్ సర్. అలా అయితే షారుక్ ఖాన్ నా బయోలాజికల్ ఫాదర్' అని నవ్వుతూ ఉన్న ఎమోజీతో బదులిచ్చాడు. ఇదంతా విసుగు చెందిన ఇంకొక యూజర్ 'డూడ్. ఆమె ఆమిర్ ఖాన్ కూతురే. ఒకసారి గూగుల్‌లో చూసి కన్ఫర్మ్ చేసుకో' అని సూచించాడు. గూగుల్ కూడా కొన్నిసార్లు తప్పుగా చూపెడుతుంది అని మరో యూజర్ చెప్పాడు. ఇదంతా చూసిన ఐరా ఖాన్ ఆ యూజర్ కామెంట్లకు స్ట్రాంగ్‌గా స్పందించింది. ఆ కన్వర్జేషన్ మొత్తాన్ని స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పెడుతూ 'ఇది కొత్తది. కానీ అవును. గూగుల్‌లో వచ్చే ప్రతి దానిని చదివి నమ్మకూడదు.' అని క్యాప్షన్ ఇచ్చింది ఐరా. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) ఇదీ చదవండి: చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్ -
ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు
Ira Khan Celebrates Diwali With Boyfriend Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా నుపూర్ షిఖరేతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా తొలిసారి తన ప్రియుడిని పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది దీపావళి పండుగను సైతం ప్రియుడు నుపూర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. నుపూర్ తల్లి ప్రీతమ్ శిఖరే కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. ఇక నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు. ఆమిర్ ఖాన్‌కు నుపూర్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్నాడు. అనంతరం ఐరాకు కూడా ఆయన కోచ్‌గా మారాడు. ఈ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) -
ఆమిర్ ఖాన్ కూతురు సిగరెట్ తాగుతుందా?
Aamir Khan’s Daughter Ira Khan: మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది అంటారా? మరేం లేదు, ఇరా ఖాన్ తన కుక్కపిల్లను కాళ్ల మీద పడుకోబెట్టుకుని ఉంది. ఆమె పక్కనే ఓ వస్తువుంది, కానీ అది బ్లర్ అయి ఉంది. అయితే బ్లర్ చేసినప్పటికీ అదేంటో పసిగట్టారు నెటిజన్లు. కచ్చితంగా అది సిగరెట్ బాక్స్ లేదా లైటర్ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరా ఖాన్ సిగరెట్ తరచూ తాగుతుందని, ఇంతకీ ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతుందో? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ సిగరెట్‌తో పాటు లైటర్ కూడా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారు. 'సెలబ్రిటీల పిల్లలు ఎందుకు సరిగా బట్టలు వేసుకోరు', 'ఆమె ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఫాతిమా ఫొటోపై ఆమిర్ ఖాన్ కూతురు కామెంట్.. వైరల్
Fatima Sana Shaikh Viral Pics: ఫాతిమా సనా షేక్... గత కొన్నిరోజులగా ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్టార్ జంట ఆమిర్ ఖాన్- కిరణ్‌రావు దంపతుల విడాకులకు ఈ భామనే కారణమంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దంగల్‌లో ఆమిర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఇప్పుడు అతడితో కలిసి జీవితం పంచుకోబోతుందంటూ ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. అయితే, ఈ విషయాలపై ఫాతిమా ఇంతవరకు నేరుగా స్పందించడంతో.. ‘‘నిజమే కాబోలు.. అందుకే మౌనంగా ఉంది’’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా.. ఆమె అభిమానులు మాత్రం.. ఫాతిమా ఇలాంటి చెత్త విషయాలపై స్పందించదు అని ఆమెను వెనకేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫాతిమా సనా షేక్ ఇటీవల వరుస ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. క్రాప్ టాప్‌నకు జీన్స్ జతచేసి సింపుల్ డ్రెస్సింగ్‌తోనే హీట్ పెంచుతూ ఫాలోవర్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సాన్యా మల్హోత్రా.. ‘‘నిప్పు రాజేస్తున్నావ్’’ అంటూ ఫైర్ ఎమోజీలను జత చేయగా.. ఆమిర్ కూతురు ఇరా ఖాన్.. ‘‘ఎంత అందంగా ఉన్నావో నువ్వు’’ అని కామెంట్ చేసింది. ఫాతిమా ఫొటోపై ఇరా కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘మీ నాన్నకు, నీకూ ఇద్దరికీ నచ్చేశాక ఇంకేముంది. ఫాతిమాను కుటుంబంలోకి ఆహ్వానించినట్లేనా’’ అని ఇష్టారీతిన ట్రోల్ చేస్తున్నారు. కాగా దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్.. నెట్‌ఫ్లిక్స్ యాంథాజలీ అజీబ్ దస్తాన్స్లో చివరిసారిగా కనిపించింది. వీటితో పాటు లేడీస్ స్పెషల్, అగ్లే జనమ్ మోహె బితియా హీ కీజో వంటి టీవీ షోలలోనూ తళుక్కుమంది. View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) -
అమీర్-కిరణ్ విడాకులు: నెట్టింట రచ్చ చేస్తున్న ఐరా ఖాన్ పోస్ట్
Aamir Khan Kiran Rao Divorce: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు రెండు రోజులు క్రితం ప్రకటించినప్పటి నుంచి .. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట సెటైర్లు, ట్రోలింగ్లతో ఈ విషయంపై రచ్చ మామూలుగా లేదనే చెప్పాలి. తాజాగా అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన తండ్రి విడాకులపై స్పందించింది. 15ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్ రావ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విడాకులకు సంబంధించి అమీర్ ఖాన్‌కు యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉన్న కారణంగానే, వాళ్లిద్దరూ విడిపోయారంటూ నెటిజన్లు వీరిపై ట్రోలింగ్, మీమ్స్‌తో విపరీతంగా ఆటాడేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమీర్ కూతురు ఐరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఐరా పరోక్షంగా తన తండ్రి అమీర్ విడాకులపై స్పందిస్తూ పోస్ట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఆ పోస్ట్‌లో... రేపు తదుపరి సమీక్ష, ఏమి జరగబోతుందో మరి?... అంటూ కామెంట్ చేశారు. అమీర్ విడాకులు అనంతరం ఈ తరహా ఫోటో పోస్ట్ చేయడంతో ఐరా తన తండ్రిని ఉద్దేశించే ఇలాంటి సెటైరికల్ కామెంట్ చేశారని కొందరు భావిస్తున్నారు. ఐరా ఖాన్ అమీర్ మొదటి భార్య రీనా దత్త కూతురు. -
బాయ్‌ఫ్రెండ్ ఫోటో చూసి ఇరా ఖాన్ ఏమందంటే..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె తరుచూ నుపూర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ సందర్భంగా ఇద్దరూ ఫాంహౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ప్రియుడు నుపూర్ మజిల్స్ చూపిస్తూ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇరా 'వాట్ ఏ హాటీ' అంటూ ఇరా కామెంట్ చేసింది. దీనికి నుపూర్ కూడా లవ్ సింబల్‌తో ఇరాకు తన ప్రేమను తెలియజేశాడు. ప్రస్తుతం ఇరా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలె ఇన్‌స్టా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్‌లోనూ మీ జీవితంలో మీకే సొంతమైన వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నారా అని ఐరా ప్రశ్నించగా, అవును..నా జీవితంలో ఒకరు ఉన్నారు. ఆమె పేరు ఇరా అంటూ నుపూర్ ఆమె ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫొటోలను ఇరా తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకునేది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు. ఆ సమయంలోనే విరిద్దరూ ప్రేమలో పడ్డారు. నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) చదవండి : పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్ లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె -
బాయ్‌ఫ్రెండ్‌తో లాక్‌డౌన్‌కు రెడీ: స్టార్ హీరో కూతురు
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వినూత్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకొని మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కూతురు ఇరా ఖాన్ కూడా కావాల్సినంత ఫేమస్ అయిపోయారు. అయితే సినిమాలతో కాదు.. తన పర్సనల్ జీవితంలోని విషయాలతో తరుచూ వార్తల్లో నానుతున్నారు. ఇటీవల తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా తన డేటింగ్ వ్యవహారంతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. అయితే ఒకవేళ మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ విధిస్తే ఆమిర్ కూతురు ఇరా తన ప్రియుడు నుపూర్ కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఇరా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్ నుపూర్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లాక్‌డౌన్‌కు సిద్ధం అంటూ పేర్కొన్నారు. చదవండి: పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్ ప్రస్తుత ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్డౌన్ విధిస్తారని జనాలు ఓ వైపు భయపడుతుంటే సూపర్‌స్టార్ కూతురు మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసేందుకు లాక్డౌన్ కోసం ఎదురుచూస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్న ఇరా ఖాన్ మళ్లీ ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు. చదవండి: 'కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు' -
పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్
ముంబై : బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ కూతురు ఇరా ఖాన్ లవ్ ఎఫైర్‌తో గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తాజాగా ప్రామిస్‌డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్ నుపూర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై వాలెంటైన్ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అఫీషియల్‌గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇరా పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎమోజీల రూపంలో ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్‌కు పరిచయం చేసిన ఇరా..కొన్నాళ్లు ఆమిర్ ఫాంహౌజ్‌లోనే ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం. (నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: ఇరా ఖాన్) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ఇరా ఖాన్ ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు.ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో ఇరా తన బాయ్‌ఫ్రెండ్ నుపూర్ పచ్చబొట్టును వేయించుకుంది. మొదటిసారి టాటూ వేయించుకున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. (లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
తండ్రి ఫిట్నెస్ కోచ్‌తో ఇరా ప్రేమాయణం!
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మరోసారి ప్రేమలో పడ్డారంట. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఆమె ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫొటోలను ఇరా తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకునేది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అయితే వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఇరా నుపూర్‌తో ప్రేమ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాలనుకుందంట. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు. (చదవండి: లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె) ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. అంతేగాక తమ ప్రేమ విషయాన్ని తన తల్లి రీనా దత్తాకు చెప్పి, నుపూర్‌ను పరిచయం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కొద్ది రోజులు మహాబళేశ్వరంలోని ఆమిర్ ఫాంహౌజ్‌లో కలిసి ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫాంహౌజ్‌లో సన్నిహితులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్న ఫొటోలను నుపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నుపూర్, ఇరాలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. అయితే ఇరా నాలుగేళ్లు మానసిక ఒత్తిడికి గురైనట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికి డిప్రెషన్‌కు చికిత్స కూడా తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇరా చెప్పింది. (చదవండి: ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్) View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) -
లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన మానసిక ఒత్తడిపై తాజాగా ఓ వీడియో సందేశాన్ని పంచుకుంది. ఇటీవల ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్బంగా తను నాలుగేళ్లకు పైగా డిప్రెషన్‌కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి ఆమె ఒత్తిడికి గల కారణాలు చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యలో ఇరా సోమవారం నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పంచుకున్నారు. పది నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఇరా తన మానసిక ఒత్తిడికి గల కారణాలపై మాట్లాడింది. ‘కొద్ది రోజులుగా నా మానసిక అనారోగ్యానికి గల కారణాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ దానికి తగిన కారణాలు నాకు దొరకడం లేదు. అందుకే మీకు సమాధానం చెప్పలేకపోతున్న. ఎందుకంటే నాకు అన్ని సౌకర్యాలు లభించాయి’ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు) అంతేగాక ‘మూడున్నరేళ్ల క్రితం ఎప్పుడైతే నా ప్రవర్తన మారడం ప్రారంభమైందో నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడం మానేశాను. ఎదో విషయంపై దీర్ఘంగా ఆలోచించేదాన్ని. ఒంటరిగా గదిలోనే ఉండేదాన్ని. ఎక్కవ సమయంలో నిద్రపోయోదాన్ని. అసలు నా గది, మంచం వదిలి ఎక్కువగా బయటకు వచ్చేదాన్ని కాదు. దీర్ఘంగా ఆలోచిస్తూ అలా మంచంపైనే ఉండేదాన్ని. కానీ అది ఉపయోగపడే విషయం కూడా కాదని తర్వాత తెలిసింది’ అలాగే తన తల్లిదండ్రుల విడాకుల విషయంపై స్పందిస్తూ.. ‘నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను. వారి విడాకుల విషయం నన్ను అంతగా బాధపెట్టలేదు. ఎందుకంటే వారు నా కోసం ఎప్పుడు ఉంటారు. వారి విషయంలో నేను ఎప్పుడు ఒత్తిడికి గురి కాలేదు. ఇంకా నాకు 6 ఏళ్ల వయసులో క్షయ వ్యాధి వచ్చింది. అది కూడా నన్ను బాధించలేదు’ అని చెప్పింది. (చదవండి: ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్) అదే విధంగా తను లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నట్లు ఈ సందర్భంగా ఇరా తెలిపింది. ‘నాకు 14 ఏళ్ల వయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యాను. అప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. అయితే ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలిస్తే అది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేది. ఈ క్రమంలో ఏడాది తర్వాత నాకు అర్థమైంది. వెంటనే నా తల్లిదండ్రులకు ఈ మెయిల్ ద్వారా విషయం చెప్పి దాని నుంచి బయటపడ్డాను. ఇక అది కూడా నాపై పెద్ద ప్రభావం చూపలేదు. దాని నుంచి నేను ముందుకు సాగాను, జీవితంలో కూడా నాకు చెడుగా అనిపించలేదు’ అని ఆమె వివరించింది. అయితే చివరకు తన మానసిక వేదన గల కారణాలపై స్పష్టత ఇవ్వకుండానే వీడియో ముగించి నెటిజన్లను, అభిమానులను ఇరా నిరాశపరిచింది. (చదవండి: ‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’) -
గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
-
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
ముంబై : తన మీద వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ స్పందించారు. ఇటీవల ఇరా తన మానసిక ఆరోగ్యం గురించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇరా చేసిన ఈ పోస్టుపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. దీనిపై ఇరా స్పందిస్తూ ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు. తన పోస్టుపై ఎవరైన అభ్యంతరకంగా కామెంట్ పెడితే తొలగిస్తానని, అదే వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే పెట్టడానికి ధైర్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’ ఇక ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు అన్న విషయం తెలిసిందే. తను(ఇరా) గత నాలుగేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. మానసిక ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు. అందుకే తన జర్నీ గురించి చెప్పాలి అనుకుటుంన్నానని, అసలు తనెందుకు ఒత్తిడికి లోనయ్యింది? ఏంటి అనే విషయాలను తెలియజేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దానివల్ల మీకు మానసిక ఆరోగ్యంపై కాస్తైనా అవగాహన వస్తుందేమో" అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు -
‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’
ముంబై: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తాను మానసిక ఒత్తిడి, నిరాశకు గురయ్యానని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అది చూసిన బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇరా వీడియోకు స్పందిస్తూ.. తాను కూడా మానసిక అనారోగ్యంతో బాధపడినట్లు ట్విటర్లో షేర్ చేశారు. ‘నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శారీరక దాడిని ఎదుర్కొన్నాను. నా సోదరిపై యాసిడ్ దాడి జరిగినప్పుడు నేను ఒంటరిగా తనని చూసుకున్నాను. అయితే నిరాశకు గురవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబానికి మాత్రం అది సాధారణ విషయం కాదు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఇరా వీడియోపై కూడా స్పందిస్తూ ఆమె క్లినికల్ డిప్రెషన్‌కు కారణం తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయం అందరికి తెలుసు కానీ దీనిని ఎవరూ ఏకిభవించరు అని పేర్కొన్నారు. (చదవండి: అన్నీ మారాయి... అవి తప్ప!) At 16 I was facing physical assault, was single handedly taking care of my sister who was burnt with acid and also facing media wrath, there can be many reasons for depression but it’s generally difficult for broken families children, traditional family system is very important. https://t.co/0paMh8gTsv — Kangana Ranaut (@KanganaTeam) October 12, 2020 ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు. ఇరా ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ.. “చాలా జరుగుతోంది, చెప్పడానికి చాలా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఒత్తిడితో కూడుకున్నవి, చెప్పలేనివి, అసలు ఏంటో అర్థం కానీ విషయాలు ఇలా చాలా ఉన్నాయి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ అవి ఏంటో కనీసం కొన్నింటినీ కనుక్కోగలిగాను. నాలుగేళ్లకు పైగా నేను నిరాశకు గురయ్యాను. కొన్ని రోజులు మానసిక ఒత్తిడికి వైద్యం కూడా చేయించుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కానీ ఏడాదిగా ఈ మానసిక ఆరోగ్యానికి ఏదైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో.. ఏలా చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఇరా చెప్పకొచ్చారు. (చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు) -
నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు
కళ్ల ముందు కనిపించేది నిజం కాదు. పెదాలపై కదలాడే దరహాసమూ నిజం కాదు. ఆ నవ్వు వెనక విషాదాలు, బాధలు, గాయాలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ వాటిని కనిపించనీయకుండా, మర్చిపోయేందుకు నవ్వును మించిన ఔషధం లేదు. సినిమా వాళ్లు కూడా అంతే.. వాళ్ల వ్యక్తిగత బాధలను పక్కనపెట్టి అభిమానులకు నవ్వుతూనే కనిపిస్తారు, నవ్వుతూనే పలకరిస్తారు.. ఇరా ఖాన్.. స్టార్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు. ఆమె నాలుగేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అక్టోబర్ 10, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశం పంపారు. "నాలుగేళ్లుగా డిప్రెషన్లో ఉన్నాను. వైద్యుల దగ్గర చికిత్స తీసుకున్నాను, ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఓ ఏడాదిగా మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తోచట్లేదు అని చెప్పుకొచ్చారు. అందుకే మిమ్మల్ని నా జర్నీలో భాగం చేస్తున్నాను. అసలు నేనెందుకు ఒత్తిడికి లోనయ్యాను? ఏంటి అనే విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల మీకు మానసిక ఆరోగ్యంపై కాస్తైనా అవగాహన వస్తుందేమో" అని ఆశిస్తూ వీడియో ముగించారు. ఇరా ఖాన్ తన డిప్రెషన్ గురించి మున్ముందు మరిన్ని వీడియోలు చేయనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడ్డాను) -
‘అప్పుడు ఇరా.. ఇప్పుడు ఆమిర్!’
ముంబై: ఆన్లైన్లో సీరియస్‌గా ఫిట్నెస్ క్లాస్ వింటున్న కూతురు ఇరాను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలో వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్న ఇరా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ఇందుకోసం ధూమ్, పీకే సినిమాలకు ఆమిర్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరించిన డేవిడ్ పోజ్నిక్ వద్దనే ఇరా శిక్షణ తీసుకుంటుంది. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ డేవిడ్ సమక్షంలో సీరియస్‌గా కసరత్తు చేస్తున్న ఇరాను ఆమిర్ మధ్యలో వచ్చి ఆటంకం కలిగించిన లైవ్ వీడియోను డేవిడ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (వాళ్లకు పాజిటివ్.. మాకు నెగెటివ్) View this post on Instagram Join us for a fun home workout with Ira Khan during lockdown! Back when I was training Aamir for Dhoom 3 and PK, Ira used to hang out with us a lot, but would basically run away when I tried to get her to work out! Many years have passed, and now we're diving into weekly workouts with plenty of pushups, squat variations, and some fun with feet in the air. This session also included a fun surprise hello from Aamir. But now the tables have turned - Ira was rocking the workout and Aamir just popped in to say hi! You can follow along with this workout, and be sure to stay tuned for more live workouts coming soon! A post shared by Poznic Training (@poznictraining) on Jun 28, 2020 at 1:10am PDT ఈ వీడియోలో ఆమిర్‌ను ‘రండి మీరు కూడా మాతో పాల్గొనండి సార్’ అని డేవిడ్ అడగ్గా.. ‘లేదు నేను మీకు హాయ్ చెప్పాడానికే వచ్చాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. దీనికి డేవిడ్ ‘గతంలో ఆమిర్‌తో పని చేసినప్పుడు ఇరా వచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేది. మమ్మల్ని డిస్టర్బ్ చేసేది. ఇప్పుడు ఇరా సీరియస్‌గా కసరత్తు చేస్తుంటే ఆమిర్ తనని డిస్టర్బ్ చేశాడు’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆమిర్ ఇంటిలో పనిచేసే సిబ్బందికి కరోనా వచ్చిన వచ్చిన విషయం తెలిసిందే. తమ కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చినట్లు ఆమిర్ ఖాన్ తెలిపాడు. (కరోనా : ఆమీర్ ఖాన్ కీలక ప్రకటన) -
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అమీర్ ఖాన్ వారసురాలు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేన కోడలు జాయాన్ మేరీ ఖాన్ నటిగా సినీ ప్రవేశం చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రఖ్యాత సిరిస్ ద్వారా అమీర్ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. కాగా తాను నటించిన ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ నెట్‌ఫ్లిక్స్‌లో శనివారం విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రీమియర్ షోను అమీర్ ఇంటి కుటుంబంతో కలిసి వీక్షించారు. ఇంట్లోనే ప్రోజెక్టర్ ద్వారా ఈ షో చూసిన అమీర్.. తన భార్య కిరణ్ రావ్, కూతురు ఇరా ఖాన్‌తో కలిసి చూసేందుకు సూట్‌తో హజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామలో శనివారం షేర్ చేశారు. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’) View this post on Instagram And it begins! @zaynmarie I love you to bits and I'm so proud of you and happy for you. Quarantine or not, WW3 or not, bad week or great year, we'll always be there to go through it with you. Through the great and the terrible! Fan girlling you at the poster and embarrassing on the red carpet. I'm sorry we weren't physically with you. But I'm sure you could hear the hooting and cheering in Panchgani! Congratulations on the beginning of your career in the film industry🤗❤ . . . #zanyforzayn #hottie #sisterlove #proud #tearsofjoy #celebrate #debut #zaynmariekhan A post shared by Ira Khan (@khan.ira) on May 1, 2020 at 5:01am PDT డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఆమిర్ కూతురు! ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పంచుకున్నారు. ఈ ఫొటోలకు ‘ఇది ప్రారంభం మాత్రమే. నటిగా నీ కెరీర్‌ను ప్రారంభించావు. ఐ లవ్ యూ జయాన్. నీ మొదటి చిత్రం విడుదలైంది నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాదు నిన్ను చూస్తే గర్వంగా కూడా ఉంది. ఎలాంటి పరిస్థితులోనైనా నీకు అండగా మేము ఉంటాం. హర్రర్ చిత్రంలో నటన చూసి అభిమానులు నటిగా సినీ పరిశ్రమలోకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వనిస్తారని ఆశిస్తున్నాను. నీతో కలిసి ఈ క్షణాన్ని పంచుకోలేనందుకు చాలా బాధగా ఉన్న .. మా మాట వింటున్నావనే అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ జయాన్’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్) కాగా హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ శిరీష్ కుందన్ దర్వకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పేయి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీయల్ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అమీర్ మేన కోడలు జయాన్ కిడ్నాప్‌కు గురయ్యే యువతి పాత్రలో కనిపించనుంది. ఇందులో మోహిత్ రైనా కూడా నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమీర్ చందన్ అద్వైత్ చందన్ రూపోందిస్తున్న లాల్ సింగ్ చందన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. -
ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు
తన ప్రేమ విషయాన్ని దాచాలనుకోవడం లేదని.. అలా అని బహిర్గత పరచాలనుకోవడం లేదని బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ అన్నారు. తన మనసుకు ఏది తోస్తే.. అదే చేస్తానని స్పష్టం చేశారు. మ్యూజిక్ కంపోజర్ మిషాల్ కృపలానీతో డేటింగ్ చేస్తున్నట్లు ఇరా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మీరెవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా అన్న నెటిజన్ ప్రశ్నకు బదులుగా.. మిషాల్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇరా షేర్ చేశారు. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ... ‘ నేను ఏదీ దాయాలని ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో నాకు నచ్చిన పోస్టులు పెడతాను. ఫొటోలు షేర్ చేస్తాను. నేను ఏంటీ అనే నిజాన్ని ప్రతిబింబించేలా నా పోస్టులు ఉంటాయి’అని పేర్కొన్నారు. అదే విధంగా... ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని బట్టి తన ప్రవర్తన ఉంటుందని ఇరా చెప్పుకొచ్చారు. కాగా ఇరా ఖాన్ త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఓ థియేటర్ డ్రామా దర్శకురాలిగా ఆమె మెగాఫోన్ పట్టనున్నట్లు బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొంతకాలంగా ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇరా తన డ్రెస్సింగ్ కారణంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇరా.. ఆమిర్- అతడి మొదటి భార్య రీనా దత్తాల మలి సంతానం. ఆమె ప్రస్తుతం తన అన్న జునైద్ ఖాన్, తల్లి రీనాలతో కలిసి జీవిస్తున్నారు. View this post on Instagram I just wanna dance with you💃🏻 @mishaalkirpalani 🎤 @princetonugoeze11 . . . #dance #slowdance #thirdwheel #love #squishies #karaoke A post shared by Ira Khan (@khan.ira) on Jun 27, 2019 at 5:28am PDT -
‘డైరెక్టర్’గా స్టార్ హీరో కూతురు!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే అందరు స్టార్ కిడ్స్ మాదిరి తను హీరోయిన్గా కాకుండా డైరెక్టర్‌గా తన అదృష్టం పరీక్షించుకోనున్నట్లు సమాచారం. ఓ థియేటర్ డ్రామా దర్శకురాలిగా ఆమె మెగాఫోన్ పట్టనున్నారని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నాడు. దీనికి ‘యూరిపైడ్స్మిడియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని, దీనిని భారతదేశంలోని ఎంపిక చేయబడిన పట్టణాలలో ప్రదర్శిస్తారని తెలిపాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభమయ్యాయని..డిసెంబరు నాటికి ఈ నాటకం ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నాడు. ఇక కొంతకాలంగా ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇరా తన డ్రెస్సింగ్ కారణంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఇరా.. ఆమిర్- అతడి మొదటి భార్య రీనా దత్తాల మలి సంతానం. ఆమె ప్రస్తుతం తన అన్న జునైద్ ఖాన్, తల్లి రీనాలతో కలిసి జీవిస్తున్నారు. ఆమిర్-రీనా విడాకులు తీసుకున్నప్పటికీ స్నేహితుల్లా మెలుగుతున్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నీటి పొదుపు ఆవశ్యకతను ప్రచారం చేస్తున్నారు. ఇక తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘లగాన్’ సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్‌రావుతో ప్రేమలో పడిన ఆమిర్... ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. #NewsFlash: Ira Khan - daughter of Aamir Khan - to make her directorial debut with a theatre production... Titled #EuripidesMedea... Will be showcased in select #Indian cities... Rehearsals for the play will start soon... Premieres Dec 2019. pic.twitter.com/9VqiRf52ql — taran adarsh (@taran_adarsh) August 23, 2019 -
ఆమిర్ కూతురు డైరెక్షన్లో...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్ ఫొటోలతో తరచూ వార్తల్లో ఉంటుంటారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్. ఈ స్టార్ కిడ్ త్వరలో నటిగా కెమెరా ముందుకు రాబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఐరా డైరెక్షన్ దిశగా అడుగులు వేస్తున్నట్లున్నారు. ఇంత చిన్న వయసులో డైరెక్షన్ వంటి పెద్ద బాధ్యతను ఐరాకు అప్పజెప్పింది ఎవరా? అనే ఆలోచన చేయవద్దు. ఎందుకుంటే ఐరా డైరెక్ట్ చేయబోయేది ఫీచర్ ఫిల్మ్‌ని కాదు. ఓ నాటకానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. గ్రీక్ ట్రాజిడీ డ్రామా ‘మేడియా’ను డైరెక్ట్ చేయబోతున్నారు ఐరా. ‘‘ఒరిజినల్ 431 బీసీ కాలానికి చెందినది. నా ప్రజెంటెషన్‌లో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పగలను. ఏమో భవిష్యత్‌లో సినిమాను కూడా డైరెక్ట్ చేస్తానేమో ఇప్పుడే చెప్పలేను’’ అని ఐరా ఖాన్ చెప్పుకొచ్చారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ డ్రామా ప్రీమియర్‌ను డిసెంబర్లో ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. -
హూ ఆర్ యు?
ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొన్నాళ్లుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తున్న ఫొటోషూట్ సీరిస్ నిన్నటితో పూర్తయ్యాయి. ‘హూ ఆర్ యు?’ అనే టైటిల్‌తో ఇన్నాళ్లూ ఇరా పోస్ట్ చేస్తున్న ఫొటోలు (తనవే) బోల్డ్‌గా, బ్యూటిఫుల్‌గా, ఇన్స్పైరింగ్గా ఉండటంతో బ్యూటీ లవర్స్ అంతా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అంటుకుపోయారు. ముగింపు చిత్రాలలో చీరను పోలిన వస్త్రధారణతో, నుదుటిపై బొట్టుతో ఇరా మెరుపులు కురిపించారు. View this post on Instagram APPRECIATION POST! I'm so lucky to get to work with these amazing women! They made my shoot possible and they were so enthusiatic! It was beautiful. Pizza and waffle team! Thanks a tonne❤❤❤ 📸 @photographybyroozbeh . . . #appreciationpost #grateful #collaboration #behindthescenes #art #fashion #photography #photoshoot #fun A post shared by Ira Khan (@khan.ira) on Aug 20, 2019 at 12:27am PDT -
అవును.. ఆయనతో డేటింగ్ చేస్తున్నా!
‘బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమలో పడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది’ గత కొన్ని నెలలుగా ఈ వార్త సోషల్ మీడియాతో హల్చల్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఇరా ఖాన్ భాయ్ ప్రెండ్ ఎవరు? ఇంతకి ఆమె ప్రేమలో పడింది నిజమా కాదా? అనే చర్చ కూడా అటు బాలీవుడ్‌లోను, ఇటు సోషల్ మీడియాలోనూ బాగానే జరిగింది. వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ.. ‘అవును నేను ఒకరిని ప్రేమిస్తున్నా. ఆయనతో డేటింగ్లో ఉన్నా’ అని కుండబద్దలు కొట్టింది అమీర్ ముద్దుల కుమార్తె ఇరాఖాన్. ‘మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మ్యూజిక్ కంపోజర్ మిషాల్‌ను హగ్ చేసుకున్న ఫోటోను ఇరా పోస్ట్ చేసింది. అయితే ఇది మిషాల్‌తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం ఇరా ఖాన్ ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తన ఇన్‌స్టా గ్రామ్‌లో అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. గతంలో ఇరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేస్తూ ‘‘హోప్ యువర్ స్ప్రింగ్ బ్రేక్ వాజ్ సన్నీ అండ్ స్మైలీ’’ అంటూ ట్యాగ్ తగిలించింది.అలాగే మిషాల్ పాట పాడుతున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోను రెండు మూడు వారాలకొకసారైనా వింటా. ఆ పాటతోనే ఆ ఆరోజు మొదలవుతుంది. అని ట్యాగ్ తగిలించింది. View this post on Instagram Hope your Spring Break was sunny and smiley as @mishaalkirpalani's, which of course, I piled onto ❤❤❤ 📸 @sahirahoshidar A post shared by Ira Khan (@khan.ira) on Mar 24, 2019 at 10:04pm PDT -
‘నమ్మలేకున్నా.. లవ్ యూ పాపా’
పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల కంటికి మాత్రం ఎప్పుడూ చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. సంతానంపై వారికున్న వాత్సల్యం అటువంటిది. ముఖ్యంగా తండ్రికి, కూతురికి ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ తండ్రి తన కూతురుని రాజకుమార్తెలాగానే భావిస్తాడు. కూతురికి కూడా మొదటి హీరో తన తండ్రే. ఇలాంటి భావోద్వేగాలకు తాను కూడా మినహాయింపు కాదంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. తన కూతురు ఇరాఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమిర్ షేర్ చేసిన ఫొటో, ఆమెపై కురిపించిన ప్రేమ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్నారి ఇరాను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమిర్...‘ 21వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇరా.!!!నువ్వు ఇంత త్వరగా ఎదిగావన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా! నాకెప్పుడూ నువ్వు ఆరేళ్ల చిన్నారివే. లవ్ యూ పాపా’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో లక్షల్లో లైకులు కొడుతూ నెటిజన్లు ఇరాపై శుభాకాంక్షల జల్లు కురిపిస్తున్నారు. కాగా ఆమిర్ ఖాన్-రీనా దత్తాలకు కుమార్తె ఇరా, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు. 2002లో రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్.. మూడేళ్ల అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Happy 21st @khan.ira !!! Can't believe you got there so fast! You will always remain 6 for me! Love you. Papa. A post shared by Aamir Khan (@_aamirkhan) on May 9, 2019 at 10:15am PDT -
ఆమిర్‌కు సోషల్ మీడియాలో చుక్కెదురు!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కు సోషల్‌మీడియాలో చుక్కెదురైంది. ఫ్యామిలీతో జాలీగా గడుపుతున్న ఫోటోలను సోషల్‌మీడియాలోని తమ అభిమానులతో పంచుకోవడం సెలబ్రెటీలకు అలవాటే. అయితే అవి అందరికీ నచ్చవు. నెగటివ్‌గా కామెంట్ చేసే వారు కూడా ఉంటారు. ఇలాంటి చేదు అనుభవమే ఆమిర్‌కు కూడా ఎదురైంది. తాజాగా ఆమిర్ కూతురు ఇరా,తన తండ్రిపై కూర్చొని ఉన్న ఫోటోను ఆమిర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటీ? అని ఒకరు కామెంట్ చేస్తే... మీరంటే నాకు ఇష్టం. మీ నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు అని మరొకరు... వయసొచ్చిన కూతురుతో ఇలా ఏంటీ అని ఇంకొకరు రకరకాల కామెంట్లతో వారి అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు మాత్రం... ఆమీర్‌కు సపోర్ట్‌గా... అక్కడ అమ్మాయి ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు.. అదే అబ్బాయి ఉంటే ఇలానే అనే వారా?... పవిత్రమైన తండ్రీ కూతుళ్ల బంధాన్ని ఇలా విమర్శించవద్దంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. ఈ విషయంలోకి మతాన్ని లాగొద్దంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. -
నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి!
ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావ్ ముంబైలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన దీపావళి పార్టీ... ఇరా ఖాన్ రాకతో మరింత దేదీప్యమానం అయింది! ఆకుపచ్చని చీరలో, చేతికి గాజులు వేసుకుని సంప్రదాయపు చిరునవ్వుతో తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇరాఖాన్ను, అప్పటికే పార్టీలో కాంతులను విరజిమ్ముతున్న ‘ఎ’లిస్ట్ తారలంతా తలలు తిప్పి చూడడం ఆమె తల్లి రీమా దత్ హృదయాన్ని ఉప్పొంగించే సంగతే కానీ, ఆ పార్టీలో ఆమె ఎక్కడా దర్శనమివ్వలేదు. రీమా, ఆమిర్ మొదటి భార్య. 1986 ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరిగింది. పదిహేనేళ్ల తర్వాత 2002 డిసెంబరులో విడిపోయారు. అప్పట్నుంచీ ఇరా, ఆమె సోదరుడు తల్లితోనే ఉంటున్నారు. ప్రతి దీపావళికీ ఇరా తన తండ్రి ఇచ్చే పార్టీకి బాలీవుడ్‌లోని ఇతర ప్రముఖలతో పాటు ఒక అతిథిగా హాజరువుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఆమె తన పదహారవ యేట ఒక పరిపూర్ణమైన స్త్రీగా ప్రత్యక్షం అవడం అందరినీ ముగ్ధులను చేసింది.