బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఎంగేజ్‌మెంట్ బాయ్‌ఫ్రెండ్‌తో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో ఐరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఐరాఖాన్ తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. తాజాగా ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది.
ఇన్‌స్టాలో ఐరా ఖాన్ రాస్తూ..'నేను అందంగా ఉంటానని ఎప్పుడు భావించలేదు. కానీ ఎందుకో ఆ రోజు అలా అనిపించింది. నన్ను నేను యువరాణిలా భావించా. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌తోనైనా.. ఎలాంటి కోణంలోనైనా ఫోటో తీయవచ్చని భావించా. ఆరోజు నేను ఇంకా అందంగా కనిపించా. చాలా అందంగా కనిపించేలా చేసినందుకు ధన్యవాదాలు.' అంటూ లవ్ సింబల్ జతచేసింది. దీనికి నటి రియా చక్రవర్తి రిప్లై ఇచ్చింది. బ్యూటీఫుల్ అంటూ లవ్ ఎమోజీలు జత చేసింది. మరో నటి జైన్ మేరీ ఖాన్ కామెంట్ చేస్తూ.. 'నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ రోజు మీరు ఎరుపు రంగు డ్రెస్‌లో అందంగా కనిపించారంటూ రిప్లై ఇచ్చింది. మిథిలా పాల్కర్, విజయ్ వర్మ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment