Enagement
-
ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌చంద్ర పెళ్లి పీటలెక్కనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట.నార్నే నితిన్ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వారి కుమారులు అభయ్, భార్గవ్‌లు సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌రామ్, వెంకటేశ్ పాల్గొన్నారు. కాబోయే వధూవరులను వారు ఆశీర్వదించారు.ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన రీసెంట్గా ఆయ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. View this post on Instagram A post shared by NTR Trends (@ntrfantrends) -
అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఎంగేజ్మెంట్ రింగ్స్
-
ఆ రోజు యువరాణిలా ఫీలయ్యా.. స్టార్ హీరో కుమార్తె పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్ బాయ్‌ఫ్రెండ్‌తో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో ఐరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఐరాఖాన్ తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. తాజాగా ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ఇన్‌స్టాలో ఐరా ఖాన్ రాస్తూ..'నేను అందంగా ఉంటానని ఎప్పుడు భావించలేదు. కానీ ఎందుకో ఆ రోజు అలా అనిపించింది. నన్ను నేను యువరాణిలా భావించా. ఎలాంటి ఎక్స్ప్రెషన్తోనైనా.. ఎలాంటి కోణంలోనైనా ఫోటో తీయవచ్చని భావించా. ఆరోజు నేను ఇంకా అందంగా కనిపించా. చాలా అందంగా కనిపించేలా చేసినందుకు ధన్యవాదాలు.' అంటూ లవ్ సింబల్ జతచేసింది. దీనికి నటి రియా చక్రవర్తి రిప్లై ఇచ్చింది. బ్యూటీఫుల్ అంటూ లవ్ ఎమోజీలు జత చేసింది. మరో నటి జైన్ మేరీ ఖాన్ కామెంట్ చేస్తూ.. 'నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ రోజు మీరు ఎరుపు రంగు డ్రెస్‌లో అందంగా కనిపించారంటూ రిప్లై ఇచ్చింది. మిథిలా పాల్కర్, విజయ్ వర్మ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఏడడుగులకు రెడీ
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్య నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు విద్యుల్లేఖా రామన్. తమిళ క్యారెక్టర్ నటుడు, సినిమా జర్నలిస్ట్ మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. ఇన్నాళ్లూ కుమారి విద్యుల్లేఖగా ఉన్న ఆమె త్వరలో శ్రీమతి కానున్నారు. కొంతకాలంగా ఆమె న్యూట్రిషియనిస్ట్, ఫిట్నెస్ నిపుణులు సంజయ్‌తో ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో గత నెల 26న వీరి రోకా (ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం గురించి ఫార్మల్గా మాట్లాడి, ఫంక్షన్‌లా చేసుకోవడం) ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియ ద్వారా తెలియజేశారు విద్యుల్లేఖా. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి, ‘‘ఫొటోలు దిగినప్పుడు మాస్క్‌లు తీసేశాం. వేడుక జరుగుతున్నంతసేపూ మాస్క్‌లు పెట్టుకున్నాం’’ అన్నారు విద్యుల్లేఖా రామన్. -
‘యూట్యూబర్’తో చహల్ టిక్‌టాక్!
భారత క్రికెట్ జట్టు లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన ధనశ్రీ వర్మతో అతని నిశ్చితార్ధం జరిగింది. సోషల్ మీడియా ద్వారానే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు తమ వివాహానికి ఆమోదం తెలిపినట్లు చహల్ వెల్లడించాడు. టీమిండియా ఆటగాడైన చహల్ తరచుగా పోస్ట్ చేసే టిక్‌టిక్ వీడియోలకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. యూ ట్యూబర్, కొరియా గ్రాఫర్ కూడా అయిన ధనశ్రీ తన పేరుతోనే ఒక కంపెనీ నెలకొల్పి తన వీడియోలు అందులో పెడుతుంటుంది. ఇదే క్రమంలో చహల్‌కు కూడా డ్యాన్స్ నేర్పినట్లు ఇటీవల ఒక పోస్ట్ చేసింది కూడా. భారత్ తరఫున 52 వన్డేలు, 42 టి20లు ఆడిన చహల్ ఆర్సీబీ జట్టు తరఫున త్వరలోనే ఐపీఎల్ బరిలోకి దిగనున్నాడు. -
ప్రేమించడానికి రెడీ కానీ..
చెన్నై : సంచలన హీరోయిన్లలో త్రిష ఒకరు. ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో ఉంటారు. సినీ పరిశ్రమలో 13 ఏళ్లకు పైగా ప్రముఖ కథానాయిక వెలుగొందుతున్నారు. కొత్త నాయికలు వరుసకడుతున్న ఈ రోజుల్లో ఇంత సుదీర్ఘ కాలం రాణించడం సాధారణ విషయం కాదు. ఇంకో విషయం ఏమిటంటే 30 ఏళ్లు పైబడిన త్రిషను చూస్తే అంత వయసుందని అనుకోలేం. ఇంతకు ముందు త్రిషపై రకరకాల వదంతులు ప్రచారం అయ్యాయి. ఆ రూమర్లకు చెలించని త్రిష ఇటీవల వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్ ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధం అయ్యారు.నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో వరుణ్ మణియన్‌కు కటీఫ్ చెప్పేశారు. కారణాలు ఏమైనా త్రిష ఇసుమంత కూడా బాధ వ్యక్తం చేయలేదు. దీన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. మరో విషయం ఏమిటంటే అప్పటి వరకూ నత్తనడకన నడిచిన ఆమె సినీ కేరీర్ ఆ తర్వాతే జెట్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం త్రిషకు చేతినిండా సినిమాలు. ఈ పరిస్థితిలో మళ్లీ ప్రేమలో పడతారా? అన్న ప్రశ్నకు ‘ఓ ఎస్.. నచ్చినోడు తారసపడితే ప్రేమిస్తా.. మనసులు కలిస్తే పెళ్లి కూడా చేసుకుంటా..’ అని బదులిచ్చారు. అయితే వయసు దాటిపోతుందనో, సమాజం కోసమే పెళ్లి చేసుకోవాలనుకోను అని చెప్పారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై-2 చిత్రంలో, నాయకి అనే హారర్ నేపథ్యంలో సాగే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. కమల్ హాసన్‌తో నటించిన తూంగావనం చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది.