
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్య నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు విద్యుల్లేఖా రామన్. తమిళ క్యారెక్టర్ నటుడు, సినిమా జర్నలిస్ట్ మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. ఇన్నాళ్లూ కుమారి విద్యుల్లేఖగా ఉన్న ఆమె త్వరలో శ్రీమతి కానున్నారు. కొంతకాలంగా ఆమె న్యూట్రిషియనిస్ట్, ఫిట్‌నెస్ నిపుణులు సంజయ్‌తో ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో గత నెల 26న వీరి రోకా (ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం గురించి ఫార్మల్‌గా మాట్లాడి, ఫంక్షన్‌లా చేసుకోవడం) ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియ ద్వారా తెలియజేశారు విద్యుల్లేఖా. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి, ‘‘ఫొటోలు దిగినప్పుడు మాస్క్‌లు తీసేశాం. వేడుక జరుగుతున్నంతసేపూ మాస్క్‌లు పెట్టుకున్నాం’’ అన్నారు విద్యుల్లేఖా రామన్.
Comments
Please login to add a commentAdd a comment