
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్‌మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది.
బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment