
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సౌండ్ పార్టీ. హృతిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటించింది. సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో వీజే సన్నీ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపాడు.
అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాల కోసం కష్టపడుతూనే ఉన్నానని పేర్కొన్నాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా విజయం సాధించిన సన్నీ ఈ సీజన్‌లో ప్రశాంత్, అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, శివాజీ టాప్ 5లో ఉంటారని అంచనా వేశాడు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. మొదట్లో సీరియల్స్‌లో నటించిన ఇతడు తర్వాత వెండితెరపై మెరిశాడు. అన్‌స్టాపబుల్, సకలగుణాభిరామ సినిమాలు చేశాడు.
చదవండి: ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మకు కూడా చెప్పా.. మనసులో మాట బయటపెట్టిన హీరో
Comments
Please login to add a commentAdd a comment