Sound Party Movie
-
‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్: సౌండ్ పార్టీ నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్,రేఖ పర్వతాల తదితురులు నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సమర్పణ : ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ రచన - దర్శకత్వం : సంజయ్ శేరి సంగీతం: మోహిత్ రెహమానిక్ సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్: జి.అవినాష్ విడుదల తేది: నవంబర్ 24, 2023 బిగ్‌బాస్ విజేత వీజే సన్నీ, యంగ్ హీరోయిన్ హృతికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ. పేపర్ బాయ్‌తో హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ తన చిరకాల మిత్రుడు సంజయ్ శేరికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అలా వీరి కాంబినేషన్లో సౌండ్ పార్టీ తెరకెక్కింది. అమాయకులైన తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథాచిత్రమిది. మరి ఈ కథ జనాలకు కనెక్ట్ అయిందా? ప్రేక్షకులను మేరకు మెప్పించింది? బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సౌండ్ చేయనుంది? అనేది రివ్యూలో చూసేద్దాం.. కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాలర్ కుమార్(వీజే సన్నీ) ఆయన తండ్రి కుబేర్ కుమార్(శివన్నారాయణ)..కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. ఈజీ మనీ కోసం రకరకాల బిజినెస్‌లు చేసి నష్టపోతుంటారు. చివరకు కుబేర్ కుమార్‌కు పరిచయం ఉన్న సేటు నాగ భూషణం(నాగిరెడ్డి) దగ్గర అప్పు తీసుకొని ‘గోరు ముద్ద’అనే హోటల్ని ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా..డాలర్ కుమార్ ప్రియురాలు సిరి(హృతిక శ్రినివాస్) తండ్రి చెడగొడతాడు. దీంతో డాలర్ కుమార్ ఫ్యామిలీ మళ్లీ రోడ్డున పడుతుంది. మరోవైపు అప్పు ఇచ్చిన నాగ భూషణం డబ్బు కోసం ఒత్తిడి చేస్తుంటాడు. అలాంటి సమయంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద వేసుకిని వెళ్తే...రూ. 2 కోట్లు ఇస్తామని చెబుతారు. డబ్బుకు ఆశపడి అసలు నేరం ఏంటో తెలియకుండా తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఆ రెండు కోట్ల రూపాయలు ఏం అయ్యాయి? కోటీశ్వరులు కావాలనే వారి కోరిక నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కష్టపడకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులొ చాలా సినిమాలే వచ్చాయి. సౌండ్ పార్టీలో కొత్తదనం ఏంటంటే..బిట్‌కాయిన్ అనే పాయింట్‌తో కామెడీ పండించడం. లాజిక్కులను పక్కకి పెట్టి..కేవలం కామెడీని నమ్ముకొనే ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు సంజయ్ శేరి. అయితే పేపర్‌పై రాసుకున్న కామెడీ సీన్‌ని తెరపై అదే స్థాయిలో చూపించి, రక్తికట్టించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమాలోని ప్రతి సీన్ నవ్వించే విధంగానే ఉంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు కావాలనే కథకు అతికినట్లుగా అనిపిస్తుంది. కుబేర్ కుమార్ ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. స్టార్టింగ్ సీన్‌తోనే కథనం ఎలా సాగబోతుందో తెలియజేశాడు. డబ్బు కోసం తండ్రి కొడుకులు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్స్ మాత్రం కథకు అతికినట్లుగానే అనిపిస్తాయి. అలాగే కొన్ని చోట్ల చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో..ఆమె పేరెంట్స్ దొరికిపోయినప్పుడు చేసే కవరింగ్.. అలాగే తండ్రీకొడుకులు అప్పు తీసుకున్న తీరు.. రొటీన్‌గా అనిపిస్తాయి. సీన్ల పరంగా చూస్తే ఫస్టాఫ్ నవ్వుకోవచ్చు. కానీ కథనం మాత్రం రొటీన్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. జైలు నుంచి తప్పించుకునేందుకు తండ్రీకొడుకులు చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపించినా.. నవ్వులు పూయిస్తాయి. పత్తి సతీష్‌గా చలాకీ చంటి ఒకటిరెండు సీన్లలో కనిపించినా..బాగానే నవ్వించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ సన్నివేశానికి చేసిన స్ఫూప్ సినిమాకు ప్లస్ అయింది. బిట్ కాయిన్ ఎపిసోడ్ కథను మలుపు తిప్పుతుంది. లాజిక్కులను పక్కకి పెట్టి.. సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ‘సౌండ్ పార్టీ’ అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం శివన్నారాయణ, సన్నీ పాత్రలే. కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ, డాలర్ కుమార్ పాత్రలో సన్నీ అదరగొట్టేశారు. వీరిద్దరి ఫాదర్-సన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సిరి పాత్రకు హృతిక న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే. ఫాదర్-సన్ కెమిస్ట్రీ ముందు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. బాగానే నవ్వించాడు. ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించాడు. హీరో చెల్లెలుగా రేఖ పర్వతాల తన పాత్ర పరిధిమేరకు చక్కగా నటించింది. ప్రియ, నాగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మోహిత్ రెహమానిక్ నేపథ్య సంగీతంతో పాటు పాటలు బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రెండుగంటలు నవ్వుతూనే ఉంటారు
‘‘అమాయకులైన తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో జరిగే కథే ‘సౌండ్ పార్టీ’. ఈ పాత్రలకి శివన్నారాయణ, సన్నీ కరెక్ట్‌గా సరిపోయారు. నా నిజ జీవితంలోని అనుభవాల నుంచి వినోదాత్మకంగా ఈ చిత్ర కథను రాశాను. ఈ సినిమాతో రెండు గంటలపాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అని డైరెక్టర్ సంజయ్ శేరి అన్నారు. వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్ జంటగా శివన్నారాయణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో ఫుల్ మూన్ మీడియాపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ–‘‘మాది కామారెడ్డి. పూరి జగన్నాథ్‌గారిని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ కావాలనుకున్నా. దర్శకులు మారుతి, సంపత్ నందిగార్ల వద్ద రచనా విభాంగలో పనిచేశా. జయశంకర్ ద్వారా నిర్మాతలకు ‘సౌండ్ పార్టీ’ కథ వినిపించాను.. వారికి నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ ఆరంభించాం. శివ కార్తికేయన్గారితో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు. -
అందుకే ‘సౌండ్ పార్టీ’ సినిమాలో నటించాను: వీజే సన్నీ
-
'ఆడిషన్స్‌కు వెళ్తే పాతిక లక్షలడిగారు, బిగ్‌బాస్ 7లో వాళ్లే టాప్ 5'
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సౌండ్ పార్టీ. హృతిక శ్రీనివాస్ హీరోయిన్గా నటించింది. సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో వీజే సన్నీ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాల కోసం కష్టపడుతూనే ఉన్నానని పేర్కొన్నాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా విజయం సాధించిన సన్నీ ఈ సీజన్లో ప్రశాంత్, అమర్దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, శివాజీ టాప్ 5లో ఉంటారని అంచనా వేశాడు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. మొదట్లో సీరియల్స్‌లో నటించిన ఇతడు తర్వాత వెండితెరపై మెరిశాడు. అన్‌స్టాపబుల్, సకలగుణాభిరామ సినిమాలు చేశాడు. చదవండి: ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మకు కూడా చెప్పా.. మనసులో మాట బయటపెట్టిన హీరో -
సీరియల్ అవకాశం ఎలా వచ్చిందంటే?: VJ సన్నీ
-
‘సౌండ్ పార్టీ’ ప్రతి పంచ్‌కి నవ్వాను: అనిల్ రావిపూడి
‘సౌండ్ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.ఈ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. ‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ సంజయ్ శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు. -
క్లీన్ కామెడీతో పార్టీ
‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్ కామెడీతో ‘సౌండ్ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్‌తో తెలుగులో ‘సౌండ్ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్ అయినా కామెడీ జానర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్‌లో 150కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే!
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
ఆమనికి ఈ హీరోయిన్ ఏమవుతుందో తెలుసా?
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్‌మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు. -
‘సౌండ్ పార్టీ’లో నా పాత్ర ధోనీలా ఉంటుంది: హీరోయిన్
‘సౌండ్ పార్టీ’సినిమాలో నేను సిరి అనే పాత్ర పోషించాను. క్రికెట్ టీమ్‌లో ధోనీలా నా పాత్ర ఉంటుంది. మ్యాచ్ లాస్ట్‌లో వచ్చి ధోని ఎలా సిక్స్ లు కొడతారో అలా నా పాత్ర ఉంటుంది.క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తాను’ అని హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ హ్రితిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►సీనియర్ నటి ఆమని మా అత్త అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. హీరోయిన్ గా తెలుగులో నాకు ఇది రెండో సినిమా. అల్లంత దూరాన తర్వాత నటించిన చిత్రమిది. సంజయ్ గారు కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్ టైన్ అవుతారని నమ్మకం ఉంది. ►ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. సిరి చాలా తెలివైన అమ్మాయి. నా పాత్ర సినిమాలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సీరియస్ క్యారెక్టర్ అయినా సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా రియల్ లైఫ్ కి రిలేటబుల్ గా ఈ పాత్ర ఉంటుంది. ►అమాయకులైన తండ్రి కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నే చాలా ఫన్నీగా దర్శకులు చూపించారు. ఇందులో బిట్ కాయిన్ గురించి కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బిట్ కాయిన్ వాల్యూను చూపించారు. ►సన్నీకి టెలివిజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్ లోనూ ఆయన అలానే ఉంటారు. చాలా జెన్యూన్ గా, ఓపెన్ గా ఉంటారు. సౌండ్ పార్టీ టైటిల్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా నటించారు. సెట్ లో సన్నీ చాలా సపోర్ట్ చేశారు. తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రాకపోతే ఆయనే నేర్పించారు. ►ఇందులో సిచువేషన్ కి తగ్గట్టుగా వచ్చే రెండు పాటలు మాత్రమే ఉంటాయి. మనీ మనీ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ ఉంటుంది. డైరెక్టర్ సంజయ్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. జయశంకర్ సార్ ప్రజెంటర్ గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ►ఎక్స్పరిమెంట్స్ సినిమాలు చేయాలని ఉంది. తెలుగులో నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చేసే రోల్స్ లాంటివి చేయాలని ఉంటుంది. హీరోల విషయంలో నాని అంటే నాకిష్టం.