‘సౌండ్ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్‌లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.ఈ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు.
‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ సంజయ్ శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment