Hritik
-
ఆమనికి ఈ హీరోయిన్ ఏమవుతుందో తెలుసా?
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్‌మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు. -
ఆ రోజు సౌండ్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ, ‘మిర్చి’ ప్రియ కీలక పాత్రల్లో నటించారు. సంజయ్ శేరి దర్శకత్వంలో జయశంకర్ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం ప్రకటించింది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు .దర్శక– నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రెహమానిక్. -
చూపులేని దంపతులను మోసగించి..
న్యూఢిల్లీ: ఆ దంపతులిద్దరికీ చూపు లేదు. తమకున్న ఒక్కగానొక్క కొడుకే తమ కంటిచూపు అనుకొని బ్రతుకుతున్నారు. అయితే.. పదిరోజుల క్రితం జరిగిన ఓ ఊహించని ఘటన వారిని పూర్తి అంధకారంలో ముంచింది. ఎక్కడ నుంచి వచ్చిందో ఓ మాయ 'లేడి' వారి నాలుగేళ్ల కొడుకుని ఎత్తుకుపోయింది. దీంతో తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఢిల్లీలోని మంగొల్పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆశారాం(35), లక్ష్మీ దంపతులు.. తమ నాలుగేళ్ల కొడుకు హృతిక్‌తో సెప్టెంబర్ 15న ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. మీరు వెళ్లాల్సిన రైలు నాలుగో నంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తుందంటూ ఓ మహిళ వారికి సహాయం చేయడానికి వచ్చింది. దంపతులు ఆ మహిళను నమ్మి.. ఆమెతో పాటు వెళ్లారు. అదును చూసి ఆ మహిళ హృతిక్‌ను తీసుకొని పారిపోయింది. తమ కొడుకు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఆ దంపతులు బ్లైండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు శనివారం నిరసనకు దిగారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని, తొందరలోనే బాలుడి ఆచూకీ కనిపెడతామని రైల్వే డీసీపీ మిలింద్ వెల్లడించారు. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల బహుమానం ఇస్తామని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. -
వారి జీవితానికి వెలుగే లేకుండా చేసింది
న్యూఢిల్లీ: కిడ్నాప్‌కు గురైన తమవారిని రక్షించుకోవడం సాధారణ పౌరులకే కష్టం. అలాంటిది అంధులకు ఆ పరిస్థితి ఎదురైతే వారికి ఇంకెంత కష్టమో ఊహించనే లేము. అశారం, లక్ష్మీ అని అంధ దంపతులకు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి పేరు హృతిక్. చీకటితో నిండిని వారి జీవితానికి హృతికే ఆశాకిరణం. వారిది రాజస్థాన్ లోని నీమ్ది అనే గ్రామం. ఢిల్లీలో ఆశారం మంగోల్ పురిలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 15న లక్ష్మీ తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్ బయలుదేరారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్ కు చేరిన వారు నాలుగో నెంబర్ రైల్వే ఫ్లాట్ ఫాంకు చేరాల్సి ఉంది. ఆ సమయంలో వారి పరిస్థితి గమనించిన ఓ కిలాడీ లేడి తాను ప్లాట్ ఫాంకు తీసుకెళ్తానని చెప్పడంతోవారు అంగీకరించారు. ప్లాట్ ఫాంకు చేరుకున్న తర్వాత ఆ బాబు నీళ్లకోసం అడగగా తాను నీళ్లు తాగిస్తానని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఎంతసేపటికి బాబు రాకపోవడంతో వారు తమ బిడ్డకోసం కేకలు పెట్టారు. అక్కడి సిబ్బందిగానీ, పోలీసులుగానీ, చుట్టుపక్కలవారుగానీ వారికి సహాయం చేయలేదు. దీంతో వారు బాధకు అంతులేకుండా పోయింది. ఎట్టకేలకు అతడు తన అంధుల యూనియన్ తో కలిసి నగర పోలీస్ కమిషనర్ ను సంప్రదించగా ఆయన పోలీసులకు ఆదేశించారు. అంతేకాదు. ఆ బాబును గుర్తించిన వారికి రూ.50వేల పారితోషికం ఇస్తామని రివార్డు ప్రకటించారు. ఇప్పటికి ఆ బాబు కిడ్నాప్ కు గురై పది రోజులు అవుతుంది. వారంలోగా రక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
'ఆ వివాదం మొదలైంది నా బిల్డింగ్ లోనే'
'అసలు హృతిక్, కంగనాల యుద్ధం మొదలైంది బాలీవుడ్లో కాదు.. నా బిల్డింగ్ లోనే' అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. తన తదుపరి మల్టీస్టారర్ 'హౌస్ ఫుల్-3' సాంగ్ లాంచ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌లు 'ప్రేమ' వివాదాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై స్పందించాల్సిందిగా విలేకరులు అక్కీని అడగ్గా.. అసలు ఈ వివాదం మొదలయ్యిందే నా బిల్డింగ్‌లో (హృతిక్, అక్షయ్‌లు ఒకే బిల్డింగ్‌లో పక్కపక్కనే నివాసముంటున్నారు.) అంటూ సరదాగా అన్నారు. 'ఏదేమైనా ఇక వారిద్దరూ వివాదాన్ని ముగించాలి. ఆ సమయం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. అయినా ఎంతకాలమని వాళ్లు వాదులాడుకుంటారు. ఇలాగే కొనసాగితే వారి సొంత ఖర్చులతో అందరికీ ఉచిత వినోదం అందించినట్లుంటుంది' అంటూ అక్షయ్ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న అభిషేక్ బచ్చన్ కూడా హృతిక్, కంగనల వివాదానికి త్వరలోనే తెరపడాలని కోరుకున్నారు. ఈ రోజు 'సన్ డే' ఈ రోజు సండే కాదు 'సన్ డే' అంటూ ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్. గత తొమ్మిదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న తన సుపుత్రుడు ఆదివారం మొదటి డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను పొందిన సందర్భంగా తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానంటూ ట్విట్టర్లో తన సంతోషాన్ని పంచుకున్నారు. Its a #SonDay all d way!After 9 yrs of training my son got his 1st degree black belt in Kudo #proudfather #overjoyed pic.twitter.com/z4Obcvhia1 — Akshay Kumar (@akshaykumar) 8 May 2016