'ఆ వివాదం మొదలైంది నా బిల్డింగ్ లోనే' | 'Time for Hrithik Roshan and Kangana Ranaut to end their war' says Akshay | Sakshi
Sakshi News home page

'ఆ వివాదం మొదలైంది నా బిల్డింగ్ లోనే'

Published Sun, May 8 2016 5:46 PM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

'ఆ వివాదం మొదలైంది నా బిల్డింగ్ లోనే' - Sakshi

'ఆ వివాదం మొదలైంది నా బిల్డింగ్ లోనే'

'అసలు హృతిక్, కంగనాల యుద్ధం మొదలైంది బాలీవుడ్లో కాదు.. నా బిల్డింగ్ లోనే' అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. తన తదుపరి మల్టీస్టారర్ 'హౌస్ ఫుల్-3' సాంగ్ లాంచ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హృతిక్ రోషన్, కంగనా రనౌత్లు 'ప్రేమ' వివాదాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై స్పందించాల్సిందిగా విలేకరులు అక్కీని అడగ్గా.. అసలు ఈ వివాదం మొదలయ్యిందే నా బిల్డింగ్లో (హృతిక్, అక్షయ్లు ఒకే బిల్డింగ్లో పక్కపక్కనే నివాసముంటున్నారు.) అంటూ సరదాగా అన్నారు.

'ఏదేమైనా ఇక వారిద్దరూ వివాదాన్ని ముగించాలి. ఆ సమయం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. అయినా ఎంతకాలమని వాళ్లు వాదులాడుకుంటారు. ఇలాగే కొనసాగితే వారి సొంత ఖర్చులతో అందరికీ ఉచిత వినోదం అందించినట్లుంటుంది' అంటూ అక్షయ్ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న అభిషేక్ బచ్చన్ కూడా హృతిక్, కంగనల వివాదానికి త్వరలోనే తెరపడాలని కోరుకున్నారు.

ఈ రోజు 'సన్ డే'
ఈ రోజు సండే కాదు 'సన్ డే' అంటూ ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్. గత తొమ్మిదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న తన సుపుత్రుడు ఆదివారం మొదటి డిగ్రీ బ్లాక్ బెల్ట్ను పొందిన సందర్భంగా తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానంటూ ట్విట్టర్లో తన సంతోషాన్ని పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement