Kangana Ranaut: దాదాపు రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ | After Nearly 2 Years Kangana Ranaut Back On Twitter | Sakshi
Sakshi News home page

దాదాపు రెండేళ్ల నిషేధం.. ట్విటర్‌లోకి బ్లూటిక్‌ లేకుండానే కంగనా రీఎంట్రీ

Jan 24 2023 8:02 PM | Updated on Jan 24 2023 8:02 PM

After Nearly 2 Years Kangana Ranaut Back On Twitter - Sakshi

బెంగాల్‌ ఎన్నికల తర్వాత హింసకు సంబంధించి ట్వీట్లు చేసి.. నిషేధం ఎదుర్కొన్న కంగనా.. 

ముంబై: స్టార్‌ నటి కంగనా రనౌత్‌ దాదాపు రెండేళ్ల తర్వాత ట్విటర్‌లోకి అడుగుపెట్టారు.మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ఆమె అకౌంట్‌పై మే 2021లో బ్యాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని ట్విటర్‌ ఎత్తేసింది. 

ఈ తరుణంలో ఇవాళ సాయంత్రం ఆమె ట్విటర్‌లో ‘హలో ఎవ్రీవన్‌, ఇట్స్‌ నైస్‌ టు బ్యాక్‌ హియర్‌ అంటూ ట్విట్‌ చేశారు. అయితే.. ఆమె అకౌంట్‌కు బ్లూ టిక్‌ లేకపోవడం గమనార్హం. బహుశా ట్విటర్‌ కొత్త పాలసీ వల్లే ఆమె అకౌంట్‌కు బ్లూ మార్క్‌ పోయి ఉండొచ్చు. 

ఇదిలా ఉంటే.. బెంగాల్‌ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన పోస్టులు అప్పట్లో ఆమె ట్వీట్‌ చేయడంతో కలకలం రేగింది. ఈ తరుణంలో.. తమ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ కంగనా రనౌత్‌ ట్విటర్‌ అకౌంట్‌పై బ్యాన్‌ వేటు పడింది. 

ఇక పునరాగమ ట్వీట్‌తో పాటు తన అప్‌కమింగ్‌ చిత్రం ఎమర్జెన్సీకి సంబంధించిన అప్‌డేట్స్‌ సైతం ఇచ్చారు.ఇదిలా ఉంటే.. ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేశాక.. సెలక్టివ్‌గా కొంతమంది ప్రముఖుల ట్విటర్‌ అకౌంట్లు పునరుద్ధరించబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement