బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సెల్ఫీ. శుక్రవారం(ఫిబ్రవరి 24న) రిలీజైన ఈ మూవీ తొలి రోజు నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీనిపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో స్పందించింది. 'కరణ్ జోహార్ నిర్మించిన సెల్ఫీ మొదటి రోజు రూ.10 లక్షలే రాబట్టింది. ఏ ఒక్కరూ దీని గురించి రాయడం లేదే? నన్ను వేధించినట్లుగా ఆయన్ను విమర్శించడం, అవమానించడం వంటివి మర్చిపోయినట్లున్నారే..' అని వ్యంగ్యంగా రాసుకొచ్చింది.
కాగా కొన్ని వెబ్‌సైట్లలో అక్షయ్‌ను వరుస ఫ్లాపులతో బాధపడుతున్న కంగనాతో పోల్చారు. సెల్ఫీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, బహుశా ఇది ఆయనకు వరుసగా ఆరో ఫ్లాప్ అని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంగనా షేర్ చేస్తూ సెల్ఫీ ఫ్లాప్ గురించి ఏమైనా రాశారా? అని వెతికితే అన్ని వార్తలు నాతో పోల్చుతూ నా గురించే ఉన్నాయి అని నవ్వుతున్న ఎమోజీలను జోడించింది.
కాగా డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ మూవీ హిందీ రీమేకే సెల్ఫీ. ఒరిజినల్‌లో పృథ్వీరాజ్, సూరజ్ పోషించిన పాత్రల్లో హిందీలో అక్షయ్, ఇమ్రాన్ నటించారు. ధర్మ ప్రొడక్షన్, మ్యాజిక్ ఫ్రేమ్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, స్టార్ స్టూడియోస్ బ్యానర్లు నిర్మించాయి. ఈ మూవీ అక్షయ్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్‌ను రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.55 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment