న్యూఢిల్లీ: ఆ దంపతులిద్దరికీ చూపు లేదు. తమకున్న ఒక్కగానొక్క కొడుకే తమ కంటిచూపు అనుకొని బ్రతుకుతున్నారు. అయితే.. పదిరోజుల క్రితం జరిగిన ఓ ఊహించని ఘటన వారిని పూర్తి అంధకారంలో ముంచింది. ఎక్కడ నుంచి వచ్చిందో ఓ మాయ 'లేడి' వారి నాలుగేళ్ల కొడుకుని ఎత్తుకుపోయింది. దీంతో తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
ఢిల్లీలోని మంగొల్‌పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆశారాం(35), లక్ష్మీ దంపతులు.. తమ నాలుగేళ్ల కొడుకు హృతిక్తో సెప్టెంబర్ 15న ఢిల్లీలోని రైల్వే స్టేషన్కు వెళ్లారు. మీరు వెళ్లాల్సిన రైలు నాలుగో నంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తుందంటూ ఓ మహిళ వారికి సహాయం చేయడానికి వచ్చింది. దంపతులు ఆ మహిళను నమ్మి.. ఆమెతో పాటు వెళ్లారు. అదును చూసి ఆ మహిళ హృతిక్ను తీసుకొని పారిపోయింది. తమ కొడుకు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఆ దంపతులు బ్లైండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు శనివారం నిరసనకు దిగారు.
బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని, తొందరలోనే బాలుడి ఆచూకీ కనిపెడతామని రైల్వే డీసీపీ మిలింద్ వెల్లడించారు. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల బహుమానం ఇస్తామని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
చూపులేని దంపతులను మోసగించి..
Published Sun, Sep 25 2016 10:53 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement
Advertisement