విడాకుల రూమర్స్‌.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు | TV Actor Sanjay Gagnani Reacts on Divorce Rumours with Wife Poonam Preet | Sakshi
Sakshi News home page

పెళ్లయి మూడేళ్లు.. భార్యతో విడాకులు? ఎట్టకేలకు స్పందించిన నటుడు

May 22 2024 6:20 PM | Updated on May 22 2024 7:12 PM

TV Actor Sanjay Gagnani Reacts on Divorce Rumours with Wife Poonam Preet

నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తను ఇది చూస్తే ఎంత బాధపడుతుందోనని కంగారుపడ్డాను. మేమేంటో మాకు తెలుసు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందనే అ‍స్సలు పట్టించుకోము. అలాగే ఈ పుకారును కూడా లైట్‌ తీసుకున్నాం. అయితే విడాకుల కోసం లాయర్‌ను సంప్రదించానని ప్రచా

బుల్లితెర జంట సంజయ్‌ గగ్నానీ, పూనమ్‌ ప్రీత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. అయితే వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని, త్వరలోనే విడిపోవడం ఖాయమంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఇందుకు తోడు సంజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టి తొలగించాడట! ఇంకేముంది.. ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు.

ఫస్ట్‌ టైం చూసి..
తాజాగా ఈ రూమర్స్‌పై సంజయ్‌ స్పందించాడు. మేము విడిపోతున్నామన్న వార్త మొదటిసారి చదివినిప్పుడు షాకయ్యాను. ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా అర్థం కాలేదు. నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తను ఇది చూస్తే ఎంత బాధపడుతుందోనని కంగారుపడ్డాను. కానీ ఆమె కూడా ఒక యాక్టర్‌ కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోగలదనిపించింది.

ఈ ప్రపంచం ఏమనుకున్నా..
ఈ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్‌ సర్వసాధారణమే! మేమేంటో మాకు తెలుసు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందనే అ‍స్సలు పట్టించుకోము. అలాగే ఈ పుకారును కూడా లైట్‌ తీసుకున్నాం. అయితే విడాకుల కోసం లాయర్‌ను సంప్రదించానని ప్రచారం చేశారు. 

ఎంత నవ్వుకున్నానో..
అది విని అయితే ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కుండలీ భాగ్య సీరియల్‌ తర్వాత సంజయ్‌ మరే ధారావాహికలోనూ కనిపించలేదు. అన్నీ నెగెటివ్‌ రోల్స్‌ వస్తుండటం వల్లే దేనికీ ఒప్పుకోలేదంటున్నాడు. తాజాగా యూట్యూబ్‌లో రిలీజైన రాత్‌ అభి అనే సాంగ్‌లో సంజయ్‌ మెరిశాడు.

చదవండి: రిలేషన్‌షిప్‌లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement