Fitness expert
-
ఆమె ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలు.. అతడు ఇంజనీర్.. భార్యాభర్తలిద్దరూ కలిసి
‘కాలంతోపాటు ఎన్నో మారుతున్నాయి. మారనిది మాత్రం జిమ్ మాత్రమే’ అంటూ ఫ్లెక్స్‌నెస్ట్ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు ఈ దంపతులు. ‘విజయం సాధిస్తామా?’ అనే సందేహం వారిలో ఏ ఒక్కరోజూ రాలేదు. ఎందుకంటే కొత్తదనాన్ని ఎవరూ నిరాకరించరనే విషయం వారికి బాగా తెలుసు. ఎన్నో రకాల ఫిట్నెస్ ఎక్విప్మెంట్లను పరిచయం చేసిన ‘ఫ్లెక్స్‌నెస్ట్’ అనుకున్నట్లుగానే గెలుపు జెండా ఎగరేసింది. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది... కోవిడ్ భీకరంగా కోరలు సాచిన సమయం అది. దిల్లీకి చెందిన రియా, రోనక్ ఆనంద్ దంపతులకు జిమ్‌కు వెళ్లనిదే రోజు మొదలు కాదు. అలాంటిది కోవిడ్ వల్ల జిమ్‌కు ఒక్కరోజు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇలా అయితే కుదరదు అనుకొని ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ లేని సమయంలో ఎన్నో షాప్‌లకు వెళ్లారు. ఏ షాప్‌కు వెళ్లినా ఒకే దృశ్యం. అవే పాత ఎక్విప్మెంట్స్! మరికొన్ని షాప్‌లలో విదేశాల్లో నుంచి దిగుమతి చేసుకున్న కొత్త ఎక్విప్మెంట్ కనిపించిదిగానీ, ధరలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. ‘రెండు దశాబ్దాల క్రితం ఇప్పుడున్న స్మార్ట్ఫోన్లు లేవు. స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు లేవు. ఎన్నో రంగాలలో స్మార్ట్ వచ్చేసింది. జిమ్ విషయంలో మాత్రం ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది’ అంటూ మాట్లాడుకున్నారు రియా, ఆనంద్‌లు. అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ దంపతులకు ‘ఫ్లెక్స్‌నెస్ట్’ అనే అంకుర ఆలోచన వచ్చింది. రియా ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలు. కొంత కాలం ఒక మీడియా సంస్థలో పనిచేసింది. ఆనంద్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇద్దరికీ స్టార్టప్‌లో పూర్వ అనుభవం లేదు. అయినా సరే ధైర్యంతో ముందడుగు వేశారు. నిధుల సమీకరణకు వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లపై ఆధారపడలేదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ చేశారు. అవసరమైతే తప్ప పొదుపు మొత్తాలను ఖర్చు చేయకూడదని నిర్ణయించుకున్నారు. థర్డ్ పార్టీ రీటెయిలర్స్, హోల్‌సేలర్స్, మిడిల్మెన్ ప్రమేయం లేని డి2సి (డైరెక్ట్–టు–కస్టమర్) బిజినెస్ మోడల్‌తో ‘ఫ్లెక్స్‌నెస్ట్’ పట్టాలకెక్కింది. మొదట ప్రయోగాత్మకంగా డంబెల్స్, యోగా మ్యాట్స్... అమ్మకాలు మొదలుపెట్టారు. ఆ తరువాత జర్మనీ, చైనా, తైవాన్‌ల నుంచి స్మార్ట్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్లను దిగుమతి చేసుకున్నారు. స్మార్ట్ ఎక్సర్సైజ్ సైకిళ్లు, ఫ్లెక్స్ ట్రైనర్, ఫ్లెక్స్ప్యాడ్, ఫ్లెక్స్ బెంచ్, ఫ్లెక్సి కెటిల్, ఫ్లెక్సిబెల్స్టాండ్, ఫ్లెక్స్ నెస్ట్ యోగా బ్యాక్స్, మసాజ్గన్, ఫ్లెక్స్ బ్యాంగిల్....ఇలా ఎన్నోరకాల ఎక్విప్మెంట్స్తో ఫ్లెక్స్‌నెస్ట్ స్మార్ట్‌గా తయారైంది. మొదలైన కొద్దికాలంలోనే పరుగులు ప్రారంభించింది. ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్న ‘ఫ్లెక్స్‌నెస్ట్’ వర్కవుట్స్, బైక్రైడ్స్కు సంబంధించి సొంత కంటెంట్ తయారు చేసుకుంది. త్వరలో మరిన్ని వర్కవుట్ ప్లాన్స్ తమ యాప్‌లో లాంచ్ చేయనుంది. ‘మేము పరిచయం చేసిన ఎక్విప్పెంట్ వల్ల బ్యాడ్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ప్రాడక్ట్స్ మధ్య తేడా ఎంతోమంది తెలుసుకోగలిగారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను ఒకే వేదికపై తీసుకురావడం ద్వారా ఫిట్నెస్ను మరింత సౌకర్యంగా మార్చాం. వినియోగదారుల ఫిట్నెస్ జర్నీకి మా వంతుగా సహాయం అందించాలనుకుంటున్నాం. ఇండియన్ ఫిట్నెస్ మార్కెట్లో విస్తరించడానికి మరిన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం’ అంటుంది రియా. ఆరోజు... సర్దుకు పోయి ఉంటే, సమస్య లేదనుకొని ఉంటే‘ఫ్లెక్స్‌నెస్ట్’లాంటి సక్సెస్ఫుల్ స్టార్టప్ ఆవిర్భవించేది కాదు. సమస్యతోపాటు పరిష్కారం ఆలోచించడం కూడా గొప్ప వ్యాపార లక్షణం కదా! చదవండి: Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ.. -
Sakshi Malik: 60 లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్.. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది?
ప్రతికూల పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగేవారు కొందరైతే, తమ అభిరుచులను కెరియర్‌గా మలుచుకుని ఉన్నత స్థాయికి చేరి స్ఫూర్తిగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే ప్రముఖ మోడల్ సాక్షి మాలిక్. సాంకేతిక విద్యనభ్యసించి, కార్పొరేట్ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ తనకిష్టమైన ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టి మంచి మోడల్‌గా రాణిస్తోంది. తన శరీర ఆకతిని ఫిట్‌గా ఉంచుకోవడమేగాక, అందంగా ఫిట్‌గా ఉండేందుకు ఏం చేయాలో చెబుతూ లక్షలాది వీక్షకులను ఆకట్టుకోవడమేగాక, తన ప్రతిభతో ఫ్యాషన్ , బ్యూటీ, లైఫ్‌స్టైల్ ఇన్ ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. ఖాన్పూర్లోని మధ్యతరగతి కుటుంబంలో సాక్షి పుట్టింది. ఈమెకు ఒక సోదరి కూడా ఉంది. స్కూలు చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్యకోసం న్యూఢిల్లీ వెళ్లింది. అక్కడే బీటెక్ పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి మోడలింగ్ అంటే బాగా ఇష్టం. దీంతో స్కూలు, కాలేజీలలో జరిగే వివిధ రకాల ఫ్యాషన్ షోలలో చురుకుగా పాల్గొంటుండేది. బీటెక్ అయ్యాక ఎమ్బీఏ చేద్దామనుకున్నప్పటికీ.. ఫ్యాషన్ పై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక ముంబై వెళ్లి మోడల్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆకర్షణీయమైన రూపం, మెరిసిపోయే మేనిఛాయ, తీరైన ఆకృతితో మోడలింగ్ ఏజెన్సీలను సంప్రదించింది. సాక్షి రూపం నచ్చిన వారంతా మోడలింగ్ చేసేందుకు అవకాశాలు ఇవ్వడంతో వాణిజ్య ప్రకటనలు, సౌందర్య ఉత్పత్తుల యాడ్స్‌లో నటించింది. వీటిలో నైకా, పీసీ జ్యూవెలర్స్, ఫ్రెష్బుక్, అడిడాస్, ఫేసెస్ కెనడా వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సాక్షి ఆయా భాషల్లో మోడల్‌గా విజయవంతంగా రాణిస్తోంది. సోనుకీ టిటు.. యాడ్స్‌లో మంచి గుర్తింపు వచ్చిన తరువాత మ్యూజిక్ వీడియోలలో నటించడం మొదలు పెట్టింది సాక్షి. దీనిలో భాగంగానే పంజాబీ మ్యూజిక్ వీడియో ‘కుడియే స్నాప్‌చాట్ వాలియే’ నటించింది. ఈ పాటకు ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీని తరువాత 2018లో విడుదలైన బాలీవుడ్ సినిమా ‘‘సోను కీ టిటు కీ స్వీటీ’లో ‘బమ్ డిగి డిగి బమ్ బమ్’ పాటలో నటించింది. దీంతో ద్వారా సాక్షి మరింత పాపులర్ అయ్యింది. ఈ ఏడాది ఎమ్టీవీలో ప్రసారమైన ప్రముఖ డేటింగ్ షో స్ప్లిట్స్ విల్లా13 లో ప్రముఖులతో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేగాక బిగ్‌బాస్ ఫేమ్ అసిమ్ రియాజ్‌తో కలిసి ‘విహం’ పాటలో నటించింది. ఈ పాట కూడా సాక్షికి మంచి పేరు తీసుకువచ్చింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలలో నటించడంతో సోషల్ మీడియాలో సాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఫిట్నెస్ ఫ్రీక్.. మ్యూజిక్ వీడియోలు, సినిమాలతోపాటు సాక్షి తన సొంత యూట్యూబ్ చానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియా మోడల్ క్వీన్ గానూ పాపులర్ అయ్యింది. అందమైన శరీర ఆకృతిని కాపాడుకునేందుకు జిమ్‌లో ఎటువంటి కసరత్తులు చేస్తుంది? తనలా ఫిట్‌గా అందంగా ఉండేందుకు ఏమేం తినాలి? ఎటువంటి వర్క్‌వుట్స్ చేయాలి... వంటి విషయాలను తన యూట్యూబ్ చానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు చెబుతుంటుంది సాక్షి. ఆమెకు యూ ట్యూబ్‌లో యాభైవేలు, ఇన్‌స్టాగ్రామ్‌లో అరవై లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందమైన రూపం... అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో మంచి నటిగా రాణిస్తూ, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా... మోడల్‌గా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా గుర్తింపు తెచ్చుకోవచ్చని ఎందరికో సాక్షి మాలిక్ ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: Nalini Jameela: అందుకే ‘పడుపు వృత్తి’లోకి.. కానీ ఇప్పుడు ఆమె.. Padmini Govind: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చి.. -
బెస్ట్‌గా తీర్చిదిద్దే.. బ్లష్ విత్ మి స్కూల్
జీవితంలో బతకాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం అనేక రకాల అవగాహనను పెంచుకోవడం కోసం చాలా డబ్బులను వెచ్చిస్తాం. ఉద్యోగం వచ్చాక మనల్ని మరింత బెస్ట్‌గా నిరూపించుకోవడానికి ప్రయతి్నస్తాం. కానీ అది ఎలాగో తెలీదు. చాలామందికి ఎక్కడ ప్రారంభించాలి, వ్యక్తిగత స్టైల్ అంటే ఏంటీ? మనల్ని మనం చక్కగా ఎలా ప్రజెంట్ చేసుకోవాలి? ఆత్మధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? సామాజిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి వంటి వాటి గురించి బొత్తిగా తెలీదు. దీనివల్ల కూడా కెరీర్లో వెనుకబడి పోతుంటారు. మిమ్మల్ని మీరు మరింత బాగా తీర్చిదిద్దుకోవాలంటే ‘‘బ్లష్ విత్ మి – పరి్మతా’’ స్కూల్‌ను ఫాలో అవ్వండి అని చెబుతోంది పర్మితా కట్కర్. నలభైఏళ్ల వయసులో తను ఫిట్‌గా ఉండడమేగా, గ్లామరస్ రోల్స్ పోషిస్తూ, చూపుతిప్పుకోని ర్యాంప్‌వాక్‌లు చేస్తూ, మరోపక్క ఫిట్నెస్ ట్రైనర్‌గా రాణిస్తూ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఢిల్లీలో పుట్టిన పర్మితా కట్కర్..తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా బెంగళూరుకు మకాం మార్చడంతో ఆమె అక్కడే చదువుకుంటూ పెరిగింది. తొలుత మోడల్‌గా కెరియర్ ప్రారంభించింది కానీ తరువాత నటన వైపు ఆకర్షితురాలయ్యింది. ఒక పక్క మోడల్‌గా రాణిస్తూనే 2003లో మిస్ఇండియా పసిఫిక్ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో మోడలింగ్, యాక్టింగ్‌కు మంచి అవకాశాలు వచి్చ పడడంతో బాగా బిజీ అయ్యింది. కెరియర్ ప్రారంభంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కలిసి మోడలింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఇండియాలో ప్రముఖ ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఫోటోగ్రఫీ ఎలా చేస్తున్నారో బాగా గమనించేది. ఇదే ఏడాది ‘బాస్ యన్ హై’లో తారా పాత్రను పోషించింది. మనోజ్ బాజ్‌పేయితో కలిసి ఇంటెకామ్: ద పర్ఫెక్ట్ గేమ్, హూసన్–లవ్ అండ్ బెట్రియాల్, లవ్ కే చక్కర్ మెయిన్, కచ్చి సాదక్ సినిమాల్లో నటించింది. అంతేగాక మధు బండార్కర్ నిర్మించిన ‘పేజ్ 3’లో ఐటమ్ సాంగ్‌లో నటించింది. పెళ్లి... పిల్లలు... ఫోటోగ్రఫీ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ 2008లో రవికురదాను పెళ్లి చేసుకుని న్యూయార్క్‌లో స్థిరపడింది. పరి్మతాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. తన కొడుకులిద్దరిని రకారకాల ఫొటోలను క్రియేటివ్‌గా తీసేది. ఆ ఫోటోలు చూసిన స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ‘ఫోటోలు చాలా బావున్నాయి’ అని చెప్పి పరి్మతను వాళ్ల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు ఫోటోలు తీయమనేవారు. దాంతో ఆమెకు తనలో దాగి ఉన్న ఫోటోగ్రఫీ కళకు మెరుగులు దిద్దుకోవాలనిపించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫోటోగ్రఫీలో డిగ్రీ చేసింది. అదీ సాదాసీదాగా ఏం కాదు... క్లాస్ టాపర్‌గా నిలిచింది. డిగ్రీ చదువుతోన్న సమయంలోనే నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ బాబీ బ్రౌన్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దీంతో బాబీ బ్రౌన్‌తో కలిసి న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పనిచేసింది. అంతేగాక అనేక ఈవెంట్లకు కొరియోగ్రఫీ కూడా చేసింది. మిస్ ఇండియా అమెరికా, మిస్ ఇండియా న్యూయార్క్, మిస్ ఇండియా కనెక్టికట్ వంటి ఈవెంట్లకు పనిచేసి తన కళకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి అనేక కార్యక్రమాల్లో పనిచేసింది. అంతేగాక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఎన్‌ఐఎఫ్‌డీ)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. వీటన్నింటితోపాటు ఫ్యాషన్ వరల్డ్‌లో విద్యార్థులు మరింత ఎదిగేలా ప్రేరణ అందించింది. ఇవేగాక ఎంటర్టెయిన్మెంట్, కామెడీ, సెలబ్రెటీ గాసిప్ వంటి ఎనిమిది రకాల టెలివిజన్ టాక్ షో లకు హోస్ట్‌గా వ్యవహరించింది. బ్లష్ విత్ మి.. ఫ్యాషన్, బ్యూటీపై ఉన్న అవగాహన, ఫోటోగ్రఫీపై పట్టుతో బ్లష్ విత్ మి–పరి్మతా పేరుతో 2014లో యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది, దీని ద్వారా మహిళాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. మహిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించి, వారిపై వారికి నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంపొందించి అంతర్గతంగానూ శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు అనేక రకాల వీడియోలను అప్లోడ్ చేస్తోంది. కెమెరా ముందు తమను తాము ఎంత అందంగా చూపించవచ్చో కూడా నేర్పిస్తుంది. తన యూట్యూబ్ చానల్లో..ముఖ్యంగా మహిళల ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ఫిట్‌గా ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తోంది. అంతేగాక వన్ ఆన్ వన్ ఇమేజ్ కోచింగ్, ఫేస్ యోగా, ఫోటోగ్రఫీలలో శిక్షణ ఇస్తోంది. పర్మితా ఫిట్నెస్ ఐడియాలు నచ్చడంతో ఆమె చానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు ఇరవై లక్షలకు చేరింది. -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
తండ్రి ఫిట్నెస్ కోచ్‌తో ఇరా ప్రేమాయణం!
ముంబై: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మరోసారి ప్రేమలో పడ్డారంట. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఆమె ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. అంతేగాక వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫొటోలను ఇరా తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకునేది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అయితే వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఇరా నుపూర్‌తో ప్రేమ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాలనుకుందంట. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు. (చదవండి: లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె) ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. అంతేగాక తమ ప్రేమ విషయాన్ని తన తల్లి రీనా దత్తాకు చెప్పి, నుపూర్‌ను పరిచయం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కొద్ది రోజులు మహాబళేశ్వరంలోని ఆమిర్ ఫాంహౌజ్‌లో కలిసి ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫాంహౌజ్‌లో సన్నిహితులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్న ఫొటోలను నుపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నుపూర్, ఇరాలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. అయితే ఇరా నాలుగేళ్లు మానసిక ఒత్తిడికి గురైనట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికి డిప్రెషన్‌కు చికిత్స కూడా తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఇరా చెప్పింది. (చదవండి: ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్) View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) -
కరోనా లేదన్నాడు, దానికే బలయ్యాడు
కైవ్: కరోనా వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు సంబంధించి అపోహలు ఉన్నాయి. ఇది ఆరోగ్య ఉన్న వారిని ఏం చేయలేదని, ఫిట్‌గా ఉన్న వారి దరిదాపుల్లోకి కూడా రాదని భావిస్తున్నారు. వచ్చిన వారంలో కోలుకోవచ్చని కూడా చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ వైరస్ సోకి యుక్త వయసులో ఉన్నవారు కూడా చాలామంది మరణించిన ఉదంతాలు కోకొల్లలు. తాజాగా ఉక్రేన్కు చెందిన 33 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, దిమిత్రి స్టుజుక్ కోవిడ్ -19 బారిన పడి మరణించారు. ఒకప్పుడు ఆయన తన అనుచరులకు కరోనా వైరస్ లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. అయితే ఆయనే కరోనా మహమ్మారి సోకి మరణించారు. ఈ విషయాన్ని దిమిత్రి మాజీ భార్య సోఫియా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో స్టుజుక్ మరణ వార్తను ధ్రువీకరించింది. ఇక కరోనా బారిన పడిన దిమిత్రి తాను కరోనా బారిన పడేంత వరకు అది ఉందని అసలు నమ్మలేదని చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ఇప్పట్లో అంతం కాదని, అది చాలా బలమైందని పేర్కొన్నారు. టర్కీకి వెళ్లినప్పుడు దిమిత్రికి తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అనంతరం తన దేశానిక తిరిగి రాగానే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన డిశార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. తరువాత ఉన్నట్టుండి ఆయన పరిస్థితి విషయం కావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దిమిత్రికి 1.1 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: ఐజీని కబళించిన కరోనా మహమ్మారి -
ఏడడుగులకు రెడీ
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్య నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు విద్యుల్లేఖా రామన్. తమిళ క్యారెక్టర్ నటుడు, సినిమా జర్నలిస్ట్ మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. ఇన్నాళ్లూ కుమారి విద్యుల్లేఖగా ఉన్న ఆమె త్వరలో శ్రీమతి కానున్నారు. కొంతకాలంగా ఆమె న్యూట్రిషియనిస్ట్, ఫిట్నెస్ నిపుణులు సంజయ్‌తో ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో గత నెల 26న వీరి రోకా (ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం గురించి ఫార్మల్గా మాట్లాడి, ఫంక్షన్‌లా చేసుకోవడం) ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియ ద్వారా తెలియజేశారు విద్యుల్లేఖా. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి, ‘‘ఫొటోలు దిగినప్పుడు మాస్క్‌లు తీసేశాం. వేడుక జరుగుతున్నంతసేపూ మాస్క్‌లు పెట్టుకున్నాం’’ అన్నారు విద్యుల్లేఖా రామన్. -
బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్
ప్రేక్షకులకు నచ్చినట్టుగా కాదు.. తన ఇష్టాన్ని ప్రేక్షకులు మెచ్చేట్టుగా చేసుకున్న నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్‌ను బ్రేక్ చేసింది. సొంతూరు చండీగఢ్. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు గుర్బానీ. ఇంటి పేరు జడ్జ్. వెరసి గుర్బాని జడ్జ్. కాని ఎమ్‌టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ‘బానీ జె’గా టైటిల్ కార్డ్ పడుతోంది. కాబట్టి అభిమానులు అందరూ బానీ జె అనే పిలుస్తున్నారు. తల్లి తాన్యా జడ్జ్ సంరక్షణలో పెరిగింది బానీ జె... అక్క సనేయాతోపాటు. ముస్సోరీలోని వుడ్ స్టాక్ స్కూల్లో చదువుకుంది. గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిగ్రీ తీసుకుంది. గమ్యం తెలియకుండానే ముంబై చేరింది. ఎమ్‌టీవీ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ రోడీస్’ పాల్గొంది. రన్నరప్‌గా నిలిచి అదే షోకి హోస్ట్‌గా ఎంపికై ఆ ‘షో’ తర్వాతి ఆరు సీజన్లను నడిపించింది. ఆ చానెల్‌కే చెందిన క్యాంపస్ డైరీస్, ఎమ్‌టీవీ అన్ప్లగ్డ్ మొదలైన రియాలిటీ షోస్కూ వీడియో జాకీగా వ్యవహరించింది. బిగ్‌బాస్‌నూ పలకరించింది.. పదవ సీజన్లో. ఇందులోనూ రన్నరప్‌గా నిలబడింది. 2007లో సినిమా ఎంట్రీ ఇచ్చింది... ‘ఆప్ కా సురూర్’తో. తెలుగు తెరకూ బానీ జె పరిచయమే 2016లో వచ్చిన ‘తిక్క’ అనే సినిమాతో. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ కనిపించింది. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’తో బానీ జె వెబ్ సిరీస్ వీక్షకులకూ ఫేవరేట్ యాక్టర్ అయింది. అందులో ఫిట్నెస్ ట్రైనర్, లెస్బియన్.. ఉమన్ సింగ్ పాత్రలో నటించి తన నటనకే కాదు బోలెడంత ధైర్యానికీ అశేష వీక్షకాదరణను సొంతం చేసుకుంది. ఆ సిరీస్ సెకండ్ సీజన్లోనూ ఆ ఆదరణ కొనసాగింది. ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్‌లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. ప్రయాణాలూ ఇష్టమే. కండలు తిరిగిన తన శరీరంతో చాలాసార్లు బాడీషేమింగ్‌కు గురైంది బానీ జె. ఆ కామెంట్స్నెప్పుడూ ఖాతరు చేయలేదు. ‘బాడీషేమింగ్ అనేది మార్కెట్ గిమ్మిక్. మెరుస్తున్న చర్మంతో ఆడవాళ్లు సున్నితంగా, నాజూగ్గా ఉండాలి అనే భావనను జనాల మెదళ్లలో స్థిరం చేస్తుంది. ఈ గిమ్మిక్ మీడియాకు తెలియనిది కాదు. అయినా అందులో భాగం అవుతోంది’ అంటుంది బానీ జె కాస్త ఘాటుగానే. కాంట్రవర్సీ ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీని తను ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. దాంతో వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసి విమర్శలను ఆఫ్‌లైన్‌లోకి తోసింది బానీ జె. -
విటమిన్ ఎఫ్3తో ఫిట్‌గా ఉండండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభించడంతో దానిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ విధించక ముందు ఫిట్నెస్ కోసం చాలా మంది జిమ్‌లకి, జాగింగ్ చేయడం కోసం పార్క్‌లకి వెళ్లే వారు. అయితే లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అవ్వన్ని మూతబడ్డాయి. అయితే ఫిట్నెస్ ప్రియురాలకు ఒక శుభవార్త. ఇంట్లోనే ఉంటూ ఫిట్నెస్ పెంచుకోవడానికి విటమిన్ ఎఫ్3 యూట్యూబ్ ఛానల్ వారు డాన్స్ థెరపిని తీసుకువచ్చారు. ఈ ఛానల్ ద్వారా విటమిన్ ఎఫ్3 ఛానల్ వ్యవస్థాపకులు, సర్టిఫైడ్ మల్టీ ఫిట్నెస్ మాస్టర్ కోచ్ రఫిక్ షేక్ ఇంట్లో ఉంటూ డాన్సర్ థెరపీ ద్వారా ఎలా ఫిట్‌గా ఉండాలో ట్రైన్ చేస్తున్నారు. కేవలం డాన్స్ థెరపీ మాత్రమే కాకుండా కార్డియో, కిక్ బాక్సింగ్ లాంటి ట్రైన్ కూడా విటమిన్ఎఫ్3 లో అందుబాటులో ఉంది. అన్ని వయస్సుల వారు (12-60 సంవత్సరాలు) ఈ డాన్స్థెరపీ చేయ్యవచ్చు. 50 సంవత్సరాల పైబడి నడుం నొప్పి, కీళ్ల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా నెమ్మదిగా ఈ డాన్స్ థెరపీ చెయ్యొచ్చు. 20 నిమిషాల పాటు ఉండే ఈ డాన్స్ థెరపీ ద్వారా మీరు ఫిట్ నెస్ని సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విటమిన్ఎఫ్3 యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్రైబ్ చేసుకొండి, డాన్స్ థెరపీ వీడియోస్ ద్వారా ఇంట్లో ఉండే ఫిట్‌గా ఉండండి. మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి https://www.youtube.com/watch?v=akG3CyxzNGw&feature=emb_logo https://www.youtube.com/watch?v=_kJpgDpRfRo&feature=emb_logo -
లాక్డౌన్: ఫిట్నెస్ కోసం ఇంట్లోనే ఇలా ...
లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉంటున్న వారంతా బద్దకంగా తయారవుతున్నారు. రోజూ బిజీబిజీ జీవితాన్ని అనుభవించే వారు ఒక్కసారిగా ఇంటి పట్టున ఉండటంతో ఏం చేయాలో తోచక సతమతమవుతున్నారు. కొందరు తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి పెడుతుండగా మరికొంత మంది ఏదైనా కొత్తగా నేర్చుకోవడం వంటి పనులతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే లాక్డౌన్ కాలంలో తమ ఫిట్నెస్ను కోల్పోతున్నామని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. జిమ్ములు, ఫిట్నెస్ సెంటర్లు మూత పడటంతో తలబాదుకుంటున్నారు. దీంతో ఇంట్లోనే ఎలా వ్యాయామం చేయాలనే ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. వారి కోసం ఫిట్నెస్ ట్రైనర్స్ కొన్ని సూచనలు ఇస్తున్నారు. (మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు ) ఈ క్రమంలో విటమిన్ ఎఫ్ 3 ఫిట్‌నెస ట్రైనర్ రఫిక్ షేక్ ఓ సులభమైన వ్యాయామాన్ని పరిచయం చేశారు. ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా ఇంట్లోనే 20 నిమిషాలపాటు చేసుకునే వ్యాయామానికి సంబంధించి కొన్ని టిప్స్‌ను తెలిపారు. ఇందుకు ఫాన్సీ గేర్, ఎలాంటి మెషీన్లు కూడా అవసరం లేదు. కేవలం ఒక బాటిల్ వాటర్, హ్యండ్ టవల్, షూస్‌తోపాటు ఓ చాప ఉంటే సరిపోతుంది. ఇందులో వామ్అప్, డ్యాన్స్ థెరపీ, కండిషనింగ్, కార్డియో కిక్ బాక్సింగ్ వంటివి ఉంటాయి. దీన్ని ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా చేయవచ్చు.. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ప్రయత్నించండి. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం ) -
సమ్మర్ ‘జిమ్‌దగీ’
సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు ఫిట్నెస్ ఫీవర్ కారణంగా సిటీటెంపరేచర్తో ఉంది. మరోవైపు సమ్మర్ సీజన్ శరీరాల్ని హీటెక్కించేస్తోంది. వారంలో రెండు మూడు రోజులతో సరిపెట్టేవారు మాత్రమే కాదు ఒక్క రోజు కూడా జిమ్‌కి డుమ్మా కొట్టడానికి ఇష్టపడని వారూ సిటీలో ఎక్కువే.ఈ నేపథ్యంలో.. హాట్ సమ్మర్లో ‘జిమ్‌దగీ’ ఎలా ఉండాలో వివరిస్తున్నారు నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఎం.వెంకట్. వెయిట్‌లాస్‌కి ప్లస్... చలికాలం, వానాకాలంతో పోలిస్తే వేసవిలో శరీరం త్వరగా వార్మప్ అవుతుంది. ‘శారీరక శ్రమ, మరో వైపు వేడిగాలి బాడీ టెంపరేచర్‌ను పెంచుతాయి. ఈ వేడి దేహమంతా విస్తరించేందుకు చర్మం ద్వారా రక్తం అధికంగా సరఫరా అవుతుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని పెంచుతుంది. దీంతో బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయికన్నా పెరుగుతుంది. ఈ పరిస్థితి కేలరీలు అధికంగా ఖర్చయ్యేందుకు, మరింత వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సీజన్ వెయిట్ లాస్ కోరుకునేవారికి ప్లస్ అవుతుంది. నిదానమే సరైన విధానం... ఈ సీజన్లో వ్యాయామం స్లోగానే స్టార్ట్ చేసి దశలవారీగా వేగం పెంచాలి. ఏదేమైనా కొంత వేగాన్ని నియంత్రించడం అవసరమే. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు అధికంగా చేసేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాహం అనిపించకపోయినా సరే వ్యాయామ సమయంలో తరచూ నీళ్లు తాగుతుండాలి. వెదర్.. చూడాలి బ్రదర్.. మిట్టమధ్యాహ్నపు ఎండలో ఏసీ జిమ్‌లో అయినా సరే ఎక్సర్సైజ్లు చేయడం అంతగా మంచిది కాదు. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే వ్యాయామం చేయడం సముచితం. బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్లు పట్టేయడం వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రమైన అలసటకు సంబంధించిన సూచనలు కనిపించినట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి, చల్లని ప్రదేశంలో, నీడలో సేదతీరడం అవసరం. వ్యాయామానంతరం చన్నీటి స్నానం చేస్తే అలసిన కండరాలకు చక్కగా సేదతీరే అవకాశం లభిస్తుంది. సీజన్‌కి...నప్పేవి ఈ సీజన్లో శరీరం సహజంగానే కొంత ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి బాగా ఒత్తిడికి గురిచేసే క్రాస్ ఫిట్ శైలి వ్యాయామాలు టైర్, హామర్తో, బాటిల్ రోప్‌తో చేసే వర్కవుట్స్‌ని బాగా తగ్గించేయాలి. శరీరం వార్మప్ అయి ఉంటుంది కాబట్టి మజిల్ టోనింగ్ మీద దృష్టి పెట్టాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూనే కార్డియో వ్యాయామాలకు బదులుగా క్రంచెస్, పుషప్స్, బర్పీస్, ఇంచ్వామ్, మౌంటెయిన్ క్లైంబర్స్, స్పాట్ జాగింగ్ వంటివి ఎంచుకోవాలి. డీహైడ్రేషన్ దరిచేరకుండా... రోజు మొత్తం మీద కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే సోడియం, పొటాíషియం, క్లోరైడ్లను భర్తీ చేసేందుకు వ్యాయామానికి ముందు పొటాసియం అధికంగా ఉండే అరటి, దానిమ్మ పండ్లు వంటివి తీసుకోవాలి. అవసరమైతే ఓఆర్ఎస్ వంటి సప్లిమెంట్స్‌ని వర్కవుట్స్ చేసే సమయంలో వినియోగించడం మంచిది. స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయించవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్ వల్ల దేహంలోని నీటిస్థాయి ఆవిరై వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోతాం. వాటికి ఈ సీజన్లో తప్పనిసరిగా గుడ్‌బై చెప్పాల్సిందే. వెయిట్‌లాస్‌కి బెస్ట్... కొంత మంది వేసవి సీజన్లో వేడికి భయపడి వర్కవుట్స్ మానేస్తారు. అయితే సరిగ్గా వినియోగించుకుంటే ఇది మజిల్ టోనింగ్‌కి, ముఖ్యంగా వెయిట్‌లాస్‌కి అత్యంత ఉపయుక్తమైన సీజన్. డ్రైఫిట్ దుస్తులు ధరించడం దగ్గర్నుంచి స్వల్ప మార్పు చేర్పులతో ఈ సీజన్లో వర్కవుట్స్‌ని ఎంజాయ్ చేయవచ్చు. – ఎం.వెంకట్, ట్రైనర్, టార్క్ ఫిట్నెస్ స్టూడియో -
‘మహర్షి’ వర్కింగ్ స్టిల్స్
-
అదే మహేశ్‌లో ప్రత్యేకత
స్టార్స్‌లో ఉండే ప్రత్యేకతలు పబ్లిక్‌కి తెలియదు. వాళ్లతో క్లోజ్‌గా పని చేసేవాళ్లు మాత్రమే పసిగట్టగలరు. అలానే మహేశ్‌బాబులో మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఉండే క్వాలిటీని గమనించాను అంటున్నారు ఆయన ఫిజికల్ ట్రైనర్ మినాశ్ గబ్రియేల్. ప్రస్తుతం మహేశ్‌బాబు మినాశ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మహేశ్‌తో పనిచేయడం గురించి ట్రైనర్ మినాశ్ చెబుతూ – ‘‘ఇప్పటి వరకూ మహేశ్‌తో ప్రయాణం బాగా సాగింది. ఆయన శరీర తత్వాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే మహేశ్ తీరు కూడా తెలిసిందే. ప్రతి పనిని క్షుణ్ణంగా చేయాలని ఆయన పరితపిస్తుంటారు. మహేశ్బాడీ షేప్ ఒక స్పోర్ట్స్మేన్లా ఉంటుంది. ప్రతిరోజూ జిమ్‌లో ఆయన చూపించే పర్ఫెక్షన్, డెడికేషన్ అద్భుతం. అలాంటి మైండ్‌సెట్ మిగతా వాళ్ల నుంచి మహేశ్‌ని సెపరేట్ చేస్తుంటుందనుకుంటున్నాను’’ అన్నారు. మరి మహేశ్ కొత్త లుక్ ‘మహర్షి’లో భాగమా? అనిల్ రావిపూడితో చేయబోయే తదుపరి చిత్రం కోసమా? తెలియాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
కళ్లజోడు వాడుతుంటే మెడనొప్పి...
నా వయసు 48. నేను బై-ఫోకల్ కళ్లజోళ్లు ఉపయోగించి కంప్యూటర్ మీద పని చేస్తుంటాను. దాంతో స్క్రీన్‌వైపు చూడాలంటే తల బాగా ఎత్తి కింది అద్దాల్లోంచి చూడాల్సి వస్తోంది. ఫలితంగా కళ్లు అలసిపోవడం, మెడనొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాను. అలా నొప్పులు తీవ్రమైనప్పుడు తలనొప్పిగా కూడా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - గోపాల్‌రావు, అమలాపురం కంప్యూటర్ మీద పనిచేసే సమయంలో బైఫోకల్ కళ్లజోడు నుంచి చూడాల్సి వచ్చినప్పుడు తల బాగా పెకైత్తి చూడటంతో మీరు చెప్పిన సమస్యలు వచ్చి బాధపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే మీరు కంప్యూటర్ మీద పని చేసేటప్పుడు ముందుగా బై-ఫోకల్ కళ్లజోళ్లు వాడటం మానేయ్యండి. ఎందుకంటే బైఫోకల్ కళ్లజోడు వాడే సమయంలో తల పైకి, కిందకి ఎక్కువ సార్లు కదపాల్సి రావడంతో మెడనొప్పి వస్తుంటుంది. మీ నొప్పి ముఖ్యంగా మెడ వల్ల వస్తుంది గాని నిజానికి కళ్లకు కాకపోవచ్చు. అయితే ఆ భాగంలో వచ్చిన నొప్పి తలనొప్పిగా కూడా మీకు అనిపిస్తుండవచ్చు. అందుకే మీ కంప్యూటర్ వాడకం కోసం ఒక రీడింగ్ గ్లాస్‌ను సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో మీరు రీడింగ్ గ్లాసెస్‌ను మాత్రమే వాడండి. దాంతో కళ్లకు శ్రమ తగ్గుతుంది. ఇక ఒకసారి మీ కంటివైద్య నిపుణుడిని సైతం ఒకసారి కలిసి మీకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్