![Mahesh Babu's fitness trainer full of praise for actor - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/10/mahesh-babu.jpg.webp?itok=AY_eaIyQ)
∙‘మహర్షి’ లొకేషన్లో వంశీ, మహేశ్, మహేశ్‌తో మినాశ్
స్టార్స్‌లో ఉండే ప్రత్యేకతలు పబ్లిక్‌కి తెలియదు. వాళ్లతో క్లోజ్‌గా పని చేసేవాళ్లు మాత్రమే పసిగట్టగలరు. అలానే మహేశ్‌బాబులో మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఉండే క్వాలిటీని గమనించాను అంటున్నారు ఆయన ఫిజికల్ ట్రైనర్ మినాశ్ గబ్రియేల్. ప్రస్తుతం మహేశ్‌బాబు మినాశ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మహేశ్‌తో పనిచేయడం గురించి ట్రైనర్ మినాశ్ చెబుతూ – ‘‘ఇప్పటి వరకూ మహేశ్‌తో ప్రయాణం బాగా సాగింది. ఆయన శరీర తత్వాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే మహేశ్ తీరు కూడా తెలిసిందే.
ప్రతి పనిని క్షుణ్ణంగా చేయాలని ఆయన పరితపిస్తుంటారు. మహేశ్‌బాడీ షేప్ ఒక స్పోర్ట్స్‌మేన్‌లా ఉంటుంది. ప్రతిరోజూ జిమ్‌లో ఆయన చూపించే పర్ఫెక్షన్, డెడికేషన్ అద్భుతం. అలాంటి మైండ్‌సెట్ మిగతా వాళ్ల నుంచి మహేశ్‌ని సెపరేట్ చేస్తుంటుందనుకుంటున్నాను’’ అన్నారు. మరి మహేశ్ కొత్త లుక్ ‘మహర్షి’లో భాగమా? అనిల్ రావిపూడితో చేయబోయే తదుపరి చిత్రం కోసమా? తెలియాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment