మహేశ్‌ కాదనడంతో చరణ్‌తో.. | Mahesh Babus Director Vamshi Paidipally Next Movie With Ram Charan | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ నుంచి మెగా పవర్‌ స్టార్‌కు..

Published Sat, May 16 2020 7:38 PM | Last Updated on Sat, May 16 2020 7:41 PM

Mahesh Babus Director Vamshi Paidipally Next Movie With Ram Charan - Sakshi

‘మహర్షి’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రం మహేశ్‌ బాబుతోనే చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ మీట్‌లో మహేశ్‌తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కూడా. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఆ‌ సినిమా పట్టాలెక్కలేదు. వంశీ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చినప్పటికీ పూర్తి స్క్రిప్ట్‌ పట్ల సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ చిత్రం నుంచి మహేశ్‌ డ్రాప్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మహేశ్‌ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఆ సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో అయోమయంలో పడినట్లు వార్తలు వచ్చాయి.  

అయితే ఆ షాక్‌ నుంచి కోలుకొని రామ్‌ చరణ్‌ కోసం వంశీ పైడిపల్లి ఓ సబ్జెక్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్‌ కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్దం చేసి త్వరలోనే మెగాపవర్‌ స్టార్‌ను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మహేశ్‌ రిజెక్ట్‌ చేసిన స్క్రిప్ట్‌నే చరణ్‌కు వినిపిస్తాడా లేక చరణ్‌ కోసం మరో కథను ఎంచుకున్నాడో తెలియదు. అంతేకాకుండా తన కారణంగా అప్సెట్‌ అయిన వంశీని శాంతపరిచే క్రమంలో ఈ సినిమాను మహేశే నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఫిలింనగర్‌ సర్కిళ్లలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వంశీ-చరణ్‌ కాంబినేషనలో వచ్చిన ‘ఎవడు’ సినిమా సపర్‌డూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.  

చదవండి: 
‘అల..వైకుంఠపురములో’.. 1 బిలియన్‌ వ్యూస్‌
‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement