సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘మహర్షి’ | Mahesh Babu Maharshi Censor Completed | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘మహర్షి’

Published Sat, May 4 2019 9:55 AM | Last Updated on Sat, May 4 2019 9:55 AM

Mahesh Babu Maharshi Censor Completed - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌ లాంటి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ బడా ప్రాజెక్ట్‌ అదే స్థాయిలో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. మహర్షి.. మహేష్‌ 25వ సినిమా కూడా కావటంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్‌ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్‌ టీం. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, జయసుథ, మీనాక్షి దీక్షిత్‌, రాజేంద్ర ప్రసాద్‌, ముఖేష్‌ రుషి ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement