Maharshi Movie First Look Teaser Released on Ugadi 2019 - Sakshi
Sakshi News home page

మహర్షి మాటలు వినండి

Published Fri, Apr 5 2019 6:04 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Mahesh Babu starrer releasing on Ugadi festival - Sakshi

మహేశ్‌బాబు

స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా రిషి ఎలా ఉంటాడో చూశాం. రిషి స్నేహితులు రవి, మహాలను చూశాం. రిషి డైలాగ్‌ చెబితే ఎలా ఉంటుందో ఉగాది సందర్భంగా చూడబోతున్నాం. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘చోటీ చోటీ బాతే...’ అనే సాంగ్‌ను విడుదల చేశారు.

ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 9గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు వంశీ పైడిపల్లి వెల్లడించారు. ‘చోటీ చోటీ బాతే..’ సాంగ్‌ను కూడా మార్చి 28న ఉదయం 9గంటల 9 నిమిషాలకే విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇందులో స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా మహేశ్‌బాబు కనిపిస్తారు. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో మొదలైందని తెలిసింది. ‘మహర్షి’ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement