ఏం సక్కగున్నారో! | mahesh babu maharshi released on april 25 | Sakshi
Sakshi News home page

ఏం సక్కగున్నారో!

Published Mon, Feb 4 2019 2:34 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

mahesh babu maharshi released on april 25 - Sakshi

మహేశ్‌బాబు, పూజాహెగ్డే

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌ బాబు క్యారెక్టర్‌లో పలు షేడ్స్‌ ఉంటాయి. స్టూడెంట్‌గా, బిలీయనీర్‌గా, ఆధునిక రైతుగా మహేశ్‌ కనిపిస్తారని తెలిసింది.

ఆల్రెడీ రెండు లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడున్న ఫొటోలోని మహేశ్‌ లుక్‌ స్టూడెంట్‌ పోర్షన్‌లోనిదని తెలుస్తోంది. ఈ ఫొటో చూసి, ఏం సక్కగున్నారో! అంటూ మహేశ్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో రిషిగా మహేశ్‌బాబు, రవిగా ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. ‘మహర్షి’ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement