
మహేశ్‌బాబు
ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్ చేస్తుంటారు మహేశ్‌బాబు. సెట్‌లో నటుడిగా ఎంత అంకితభావంతో ఉంటారో అంతే సరదాగా కుటుంబంతో సమయాన్ని గడుపుతుంటారు. తన 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఉత్సాహంలో కుటుంబంతో కలిసి మహేశ్‌బాబు ఆదివారం ప్యారిస్‌కి ఫ్లైట్ ఎక్కారు. అక్కడికి వెళ్లే ముందు దుబాయ్‌ని చుట్టేశారని తెలిసింది. ‘ప్యారిస్‌కు పయనం అవుతున్నాం’’ అని మహేశ్ భార్య నమ్రత పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘ఎఫ్ 2’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ చిత్రం ప్రారంభం అవుతుందనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. గతంలో తన తండ్రి కృష్ణ బర్త్‌డేకి మహేశ్‌బాబు సినిమాల అప్‌డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment