ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. లాక్‌డౌన్ సమయంలో భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసి దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్ డైలాగ్ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు.
(చదవండి : ‘ఆచార్య’గా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్)
తర్వాత ఈ స్టార్ క్రికెటర్ రూటు మార్చి రీఫేస్ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్‌బాబు, ‘ఆచార్య’లో చిరంజీవికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకుంది.
తాజాగా ఈ స్టార్ క్రికెటర్ మహేశ్‌బాబు సినిమా పాటకు స్టెప్పులేశాడు. మహేశ్ నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఈ పాటను రీఫేస్ యాప్‌తో ఛేంజ్ చేసి మహేశ్ బాబు వేసిన స్టెప్పులు వార్నర్ వేసినట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment