మహర్షిగా అదరగొడుతున్న వార్నర్‌ | Viral Video Of David Warner Immitates Mahesh Babu In Maharshi Movie | Sakshi
Sakshi News home page

మహర్షిగా అదరగొడుతున్న వార్నర్‌

Published Thu, Dec 31 2020 8:15 PM | Last Updated on Thu, Dec 31 2020 8:28 PM

Viral Video Of David Warner Immitates Mahesh Babu In Maharshi Movie - Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మహర్షిగా అదరగొడుతున్నాడు. అదేంటి మహర్షి సినిమాలో మహేష్‌ బాబు హీరోగా నటించాడు.. వార్నర్‌ ఎక్కడి నుంచి వచ్చాడనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. లాక్‌డౌన్‌ కాలంలో ఎన్నో టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన వార్నర్‌ తాజాగా మరో ఫన్నీ వీడియోతో ముందుకొచ్చాడు.  తాజాగా సూపర్‌స్టార్‌  మహేశ్‌ బాబు నటించిన 'మహర్షి' సినిమా టీజర్‌ను ఎడిట్‌ చేశాడు. మహర్షిలా కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. సినిమాలోని కొన్ని సీన్స్‌లో  మహేశ్‌ ముఖానికి బ‌దులు వార్నర్‌ త‌న ఫొటోని యాడ్‌ చేసి డైలాగ్స్‌తో అలరించాడు.(చదవండి : ఎంజాయ్‌ మూడ్‌లో టీమిండియా.. రోహిత్‌ మాత్రం)

'మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుంది.. విషాదంతో నిండిన ఈ ఏడాదిలో చివరిరోజును హాయిగా నవ్వుకుంటూ ముగిద్దాం' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది కరోనా లాక్‌డౌన్‌ నుంచి  తెలుగు సినిమా పాటలు, డైలాగులు, హీరోల హావభావాలతో వీడియో రూపొందించి అలరించాడు.ముఖ్యంగా టిక్‌టాక్‌ వీడియోలతో అటు తెలుగు ప్రజలకు.. ఇటు సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కాగా గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన వార్నర్‌ మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఇరు జట్ల మధ్య జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.(చదవండి : ఆసీస్‌ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement