vamshi
-
Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేసిన భద్రాద్రి ఏజెన్సీకి చెందిన మోడెం వంశీ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నాడు. కూలీగా మొదలైన ప్రస్థానం ఇపుడు కామన్ వెల్త్ దిశగా సాగుతోంది...మోడెం వంశీ స్వస్థలం ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూyð ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువును అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఓ నర్సరీలో పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. అక్కడ నర్సీరీలో 50 కేజీల బరువు ఉన్న యూరియా బస్తాలను అలవోకగా ఎత్తుకుని తిరగడాన్ని ఆ నర్సరీ యజమాని, మాజీ వెయిట్ లిఫ్టరైన అబ్దుల్ ఫరూక్ గమనించాడు.దీంతో నర్సరీ ప్రాంగణంలోనే వంశీలో ఉన్న ప్రతిభకు సాన పట్టాడు. ఎంతటి బరువులైనా అవలీలగా ఎత్తేస్తుండటంతో తక్కువ సమయంలోనే ఇబ్రహీంపట్నం నర్సరీ నుంచి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ మీదుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని పవర్ లిప్టింగ్ హాల్‌కు వంశీ అడ్రస్ మారింది హైదరాబాద్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తూనే ఎల్బీ స్టేడియంలో వంశీ కోచింగ్ తీసుకునేవాడు. అక్కడ పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున ఏషియా లెవల్ వరకు ఆడిన సాయిరాం వంశీ ఎదుగుదలకు అండగా నిలిచాడు.గోవాలో 2021లో జరిగిన పోటీల్లో మొదటిసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు వంశీ. ఆ తర్వాత 2022లో కేరళ, హైదరాబాద్‌లో 2023లో ఇండోర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్, పటియాల (పంజాబ్)లో జరిగిన పోటీల్లోనూ వంశీ పతకాలు గెల్చుకున్నాడు. దీంతో యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వంశీని ఎంపిక చేస్తూ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2024 జూన్ లో నిర్ణయం తీసుకుంది."ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం స్థానం దక్కింది."తొలిసారిగా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం దక్కిందనే ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. పాస్‌పోర్టు, వీసా, ప్రయాణం తదితర ఖర్చులకు రూ. 2.10 లక్షల అవసరం పడింది. హైదరాబాద్‌లో స్పాన్సర్లు దొరకడం కష్టం కావడంతో తన వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానం మొదలైన భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్‌లో కోచింగ్ ఇచ్చిన రామిరెడ్డిని సంప్రదించాడు. క్రౌడ్ ఫండింగ్ కోసం లోకల్ గ్రూప్‌లలో రూ.100 వంతున సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పట్టణానికి చెందిన వైద్యులు సోమయ్య, శ్రీకర్, కృష్ణప్రసాద్, రోశయ్య, స్పందనలు తమ వంతు సాయం అందించారు.యూరప్ వెళ్లేందుకు వీసా కోసం కాన్సులేట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వంశీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. ‘యూరప్ ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావ్?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే ‘ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నావు?’ అని అడిగినట్లు భావించి ‘పార్ట్‌టైం జాబ్’ అని బదులు ఇచ్చాడు వంశీ. వీసా క్యాన్సల్ అయ్యింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ.20వేలు వృథా కాగా మళ్లీ స్లాట్ బుకింగ్‌కు రూ.15 వేల వరకు అవసరం పడ్డాయి. ఈసారి ఆర్థిక సాయం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ – పీవో రాహుల్ ముందుకు వచ్చాడు.ఇంగ్లీష్ గండం దాటేందుకు స్నేహితులు, కోచ్‌ల ద్వారా ప్రశ్నా – జవాబులు రాయించుకుని వాటిని ్రపాక్టీస్ చేశాడు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఫోన్ చేసి నేర్చుకున్న దాన్ని వల్లెవేయడం, అద్దం ముందు మాట్లాడటం చేస్తూ చివరకు వీసా గండం గట్టెక్కాడు. ఈ పోటీలో పాల్గొనే బృందం ముందుగానే మాల్టా వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 25న హైదరాబాద్ నుంచి ముంబైకి వంశీ ఒక్కడే బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మీదుగా మాల్టా వరకు ఎయిర్‌బస్‌లో చేరుకున్నాడు.ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్æ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం దక్కింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వచ్చే అక్టోబరులో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటేందుకు వంశీ సిద్ధం అవుతున్నాడు. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం. -
అయ్యో కొడుకా.. మాకు దిక్కెవరు?
కరీంనగర్: ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. వివాహమైన తర్వాత కొన్నేళ్లకు జన్మించిన అతన్ని ఎంతో అల్లారు ము ద్దుగా పెంచారు. ఇంజినీరింగ్ విద్య కోసం హైదరాబాద్‌కు పంపారు. ఉన్నత ఉద్యోగం పొంది వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడని ఆశ పడ్డారు. కానీ విధి కన్నెర్ర చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని కబలించి వారికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కళానగర్‌కు చెందిన బాసని రవి–లక్ష్మీ దంపతులకు కుమారుడు వంశీ(20) ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. మీర్‌పేట వద్ద అదుపుతప్పి కింద పడ్డారు.ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వంశీ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆదివారం మెట్‌పల్లికి తీసుకురాగా.. తల్లిదండ్రులు కొడుకా.. ఇక మాకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
దుబాయ్‌లో భర్త.. మరో యువకుడి కారణంగా.. వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పార్పెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మూడేళ్లుగా అతడి భార్య నాగమణి(35) ఇద్దరు కుమారులతో కలిసి తల్లిగారింటి వద్ద నిర్మల్‌లోని బెస్తవార్పేట్లో నివాసం ఉంటోంది. పార్పెల్లి గ్రామానికి చిలుక వంశీ అనే వ్యక్తి నాగమణిని కొద్ది రోజులుగా చరవాణిలో లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో నాగమణి రెండు రోజుల కిందట పార్పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ తనను ఫోనులో వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లితో చెప్పింది. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇంటికి వచ్చిన తల్లి కళావతికి కుమార్తె ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్టౌన్లో కేసు నమోదు చేశారు. పార్‌పెల్లిలో ఆందోళన.. నాగమణి మృతదేహాన్ని పార్పెల్లికి అంత్యక్రియల కోసం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వంశీ అనే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోనే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్, సోన్ సీఐ నవీన్ కుమార్ చేరుకుని పార్‌పెల్లిలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య మృతితో ఇంటికి వచ్చిన భర్త.. నాగమణి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని విషయం తెలవడంతో భర్త చిన్న భోజన్న దుబాయ్ నుంచి గురువారం ఉదయం స్వగ్రామం చేరుకొన్నాడు. దీంతో తన ఇద్దరు కుమారులు శ్రీచరణ్(12), శ్రీవర్ధన్(10)తో కలిసి భార్య మృతదేహం వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పాదయాత్ర చేస్తే పంది ఏనుగు అవ్వదు..లోకేష్ పై వల్లభనేని వంశీ కామెంట్స్
-
వంశీరామ్ బిల్డర్స్ పై కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో " స్ట్రెయిట్ టాక్ "
-
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తానికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌కు సంబంధించిన కుట్రలో పాలు పంచుకున్నారని భార్గవ్ తండ్రి మురళి, తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అఖిలప్రియ–భార్గవ్‌రామ్ కుటుంబాల్లో ఒక్క మౌనిక రెడ్డి తప్ప మిగిలిన వారంతా కిడ్నాప్ కేసులో నిందితులుగా మారారు. హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడానికి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ కొన్నాళ్ల క్రితమే పథకం వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై తమ కుటుంబీకులతో కలసి పదేపదే చర్చలు జరిపారు. గుంటూరు శ్రీను నేతృత్వంలో కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర చేసే సందర్భంలో మురళి, కిరణ్మయి, చంద్రహాస్‌లు భార్గవ్‌రామ్‌తోనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చదవండి: బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి మరోపక్క కిడ్నాప్‌ను అమలు చేయడానికి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను, కిరాయి గూండాలను హైదరాబాద్‌కు రప్పించారు. వీరికి కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్లో బస కల్పించారు. అక్కడ నుంచి యూసుఫ్‌గూడలోని స్కూలుకు తీసుకువచ్చారు. అక్కడే వీరిలో ఐటీ అధికారులుగా నటించే వారికి కొత్త బట్టలు ఇవ్వగా.. గుంటూరు ప్రాంతానికి చెందిన వంశీకి మాత్రం అద్దెకు తీసుకువచ్చిన పోలీసు యూనిఫాం ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల దాడి నేపథ్యంలో తాను బందోబస్తుగా వచ్చినట్లు ఇతడు బాధిత కుటుంబానికి తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న వారి జాబితాలో వంశీ కూడా ఉన్నాడు. భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరులు ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి నేరచరిత్ర ఉండటంతో పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో నిందితులు ప్రత్యేక బృందాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే నిందితులు ముందస్తు బెయిల్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ(ఎంఎస్సీఎస్) రెండో సంవత్సరం చదువుతున్న గాండ్ల వంశీ (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాల్గో పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. నగరంలోని కమలానగర్లో నివాసం ఉంటున్న కృష్ణారావు, పద్మావతి దంపతులు స్థానిక సీవీ రామన్ కాలేజీలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు గాండ్ల వంశీ. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి తాను సినిమాల్లోకి వెళతానని, చదువుపై శ్రద్ధ లేదని తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లమంటూ వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు మూసి ఉండడంతో బద్దలు కొట్టి గదిలోకి వెళ్లి చూశారు. వంశీ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు తండ్రి కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు నాల్గో పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి..సోమవారం పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సుజనాచౌదరిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని
-
పరుచూరి బ్రదర్స్‌కు జీవిత సాఫల్య పురస్కారం
మే 4న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 75వ జయంతి. ఈ సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సాహితీ సేవాసంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, రేలంగి నరసింహారావు చైర్మన్‌గా ఏర్పడిన డా. దాసరి– వంశీ జీవిత సాఫల్య పురస్కారం కమిటీలు ఈ నెల 10న ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్ (పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ)కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు పేర్కొన్నారు. -
‘మహర్షి’ వర్కింగ్ స్టిల్స్
-
అదే మహేశ్‌లో ప్రత్యేకత
స్టార్స్‌లో ఉండే ప్రత్యేకతలు పబ్లిక్‌కి తెలియదు. వాళ్లతో క్లోజ్‌గా పని చేసేవాళ్లు మాత్రమే పసిగట్టగలరు. అలానే మహేశ్‌బాబులో మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఉండే క్వాలిటీని గమనించాను అంటున్నారు ఆయన ఫిజికల్ ట్రైనర్ మినాశ్ గబ్రియేల్. ప్రస్తుతం మహేశ్‌బాబు మినాశ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మహేశ్‌తో పనిచేయడం గురించి ట్రైనర్ మినాశ్ చెబుతూ – ‘‘ఇప్పటి వరకూ మహేశ్‌తో ప్రయాణం బాగా సాగింది. ఆయన శరీర తత్వాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే మహేశ్ తీరు కూడా తెలిసిందే. ప్రతి పనిని క్షుణ్ణంగా చేయాలని ఆయన పరితపిస్తుంటారు. మహేశ్బాడీ షేప్ ఒక స్పోర్ట్స్మేన్లా ఉంటుంది. ప్రతిరోజూ జిమ్‌లో ఆయన చూపించే పర్ఫెక్షన్, డెడికేషన్ అద్భుతం. అలాంటి మైండ్‌సెట్ మిగతా వాళ్ల నుంచి మహేశ్‌ని సెపరేట్ చేస్తుంటుందనుకుంటున్నాను’’ అన్నారు. మరి మహేశ్ కొత్త లుక్ ‘మహర్షి’లో భాగమా? అనిల్ రావిపూడితో చేయబోయే తదుపరి చిత్రం కోసమా? తెలియాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
శిక్ష తప్పదు
ఇరుకళల పరమేశ్వరి ప్రొడక్షన్ పతాకంపై నెట్రంబాక హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో న్. హరిత ప్రియా రెడ్డి నిర్మించిన చిత్రం ‘సిబిఐ వర్సెస్ లవర్స్’. వంశీ, జైన్ నాని, దివ్య, శ్రావణి నిక్కి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ , సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేశారు. ఘన శ్యామ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సుమన్ ఆవిష్కరించి, సత్య ప్రకాష్‌కు ఇచ్చారు. ‘‘థియేటర్స్ విషయంలో చిన్న చిత్రాలకు ప్రభుత్వం అండగా నిలిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సుమన్. ‘‘తొందరపాటు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే కథతో నిర్మించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం. నెక్ట్స్ ‘బ్రహ్మముహూర్తం’ పేరుతో సినిమా నిర్మించబోతున్నాం’’ అన్నారు హరిత ప్రియారెడ్డి. ‘‘తప్పు చేసినవారికి శిక్ష తప్పదనే సందేశం ఇస్తున్నాం’’ అన్నారు హరి ప్రసాద్‌రెడ్డి. -
తలచి... తలచి
వంశీ, స్టెఫీ పటేల్ జంటగా అనిల్ తోట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్‌పై నేదురుమల్లి, అజిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిల్ తోట మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కి తగ్గ సినిమా ఇది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొత్త బ్యానర్లో కొత్త హీరో హీరోయిన్లతో ఈ సినిమా చేశాం. ఇందులో నటించిన, పని చేసిన వారికి ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు అజిత్ రెడ్డి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వంశీ. ‘‘తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు స్టెఫీ పటేల్. -
ఎస్పీబీకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం ప్రదానం చేయనున్నట్లు డా. వంశీ రామరాజు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ– ‘‘పురస్కారంతో పాటు బాలూగారికి వంశీ చైర్మన్ డాక్టర్ కొత్త కృష్ణవేణి చేతుల మీదుగా వీణ బçహూకరణ ఉంటుంది. అమెరికాకు చెందిన గాయని శారదచే ‘నేల మీది జాబిలి .. అక్కినేని – బాలు శతగీత లహరి’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సభ ప్రారంభంలో అక్కినేని – బాలు సినీ సంగీత విభావరి ఉంటుంది. తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య, సినీ నటి డాక్టర్ జమున, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వనాథ్, సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, కేఎం రాధాకృష్ణన్, వీణాపాణి తదితరులు పాల్గొంటారు. 21న శుక్రవారం రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. -
పేరు తంత్ర
వంశీ, ఆర్తి, తపస్వి, ఐశ్వర్య, విజయ్, సంజన ముఖ్య తారలుగా మేడం శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నా పేరు తంత్ర’. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎడిటింగ్ విభాగంలో పలు చిత్రాలకు పని చేసిన జగన్ (జె.డి) నిర్మాతగా మారి పరమశివ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ (జెడి) మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉంది. అందుకే 30 మంది గ్రాఫిక్స్ నిపుణులు మా సినిమా కోసం పనిచేస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘టైటిల్‌కు తగ్గట్టుగా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్. షాయాజీ షిండే, ‘ఛత్రపతి’ శేఖర్, సుమన్ శెట్టి, ప్రాబ్స్, ముక్తార్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: జాక్ పొట్ల, కెమెరా: చక్రి. -
నాగ్ హిట్ లిస్ట్‌లో అతను!
ఫ్రమ్ గీతాకృష్ణ టు కల్యాణ్ కృష్ణ నాగార్జున ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్‌గోపాల్ వర్మ, దశరథ్, లారెన్స్... ఇలా నాగ్ పరిచయం చేసిన దర్శకులు పది మందికి పైనే ఉంటారు. జస్ట్ తాను హీరోగా నటించిన సినిమాల ద్వారానే కాదు.. నిర్మించిన చిత్రాల ద్వారా కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నారట. అతని పేరు వంశీ అని తెలిసింది. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాల తర్వాత కొత్త దర్శకుడు వంశీతో చేసే సినిమా మొదలవుతుందని భోగట్టా. సమ్మర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. నాగ్ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుల్లో ఆల్మోస్ట్ అందరూ సక్సెస్. సో.. వంశీ కూడా ఆ హిట్ లిస్ట్‌లో చేరతారని ఊహించవచ్చు. -
ఇది ‘టెంపర్’ చిత్ర వివాదం
సాక్షి, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ విషయంపై బండ్ల గణేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘ 2015 టెంపర్ చిత్రం వివాదం ఇది. కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుంచి కొనడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టికి సంయుక్తంగా విక్రయించాము. కానీ, నాకు తెలియకుండా టెంపర్ నవలా హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మారు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికిలోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టికి తీసుకు వచ్చాను. అదే సమయంలో టెంపర్ చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్‌ను నిలిపివేశాను. ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నప్పటికీ వంశీ చెక్‌ను పట్టుకొని కోర్టుకి వెళ్లాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను. ఈ విషయంపై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్‌కు వెళ్తున్నాను. రచయిత వంశీపై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు, నా సినిమా యూనిట్ సహాయ రచయితలకు, వంశీ మనస్సాక్షికి తెలుసు. సినిమా రంగంలో నటులకు, దర్శకుల, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమ్మిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. -
వంశీతేజ మృతికి కారణాలేంటి!?
సాక్షి, విజయవాడ : ఇంజినీరింగ్ విద్యార్థి వంశీతేజ మృతి కేసు విచారణ ముందుకు సాగక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల రెండో తేదీన కళాశాలలో పరీక్ష రాసి కనిపించకుండా వెళ్లిన సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గుర్రం వంశీతేజ శవమై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందిన తమ ఒక్కగానొక్క కుమారుడు ఈ రోజు కాకపోయినా రేపయినా తమ వద్దకు వస్తాడని కోటిఆశలతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు వంశీతేజ మృత్యువాత తీరని శోకం మిగిల్చింది. అయితే అసలు వంశీతేజ మరణానికి కారణాలేంటి? కళాశాలకు వెళ్లి పరీక్ష కూడా రాసిన అతను ఆ తరువాత ఎక్కడికి వెళ్లాడు? వైజాగ్ వెళ్లే బస్సు ఎక్కుతున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించిన వంశీ తేజ తిరిగి చీరాల సముద్రం ఒడ్డున ఎలా మృతిచెందాడు? అన్న ప్రశ్నలను ఛేదిం చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్ రికార్డ్స్ ఆధారంగా.. పోలీసులకు దొరికిన వంశీతేజ సిమ్‌కార్డు ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించకుండా వెళ్లిన అతను ఎవరెవరికి ఫోన్లు చేశాడు? ఎవరెవరిని కలిశాడు? అనే వివరాలను రాబడుతున్నారు. ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్‌లో చేసిన అప్పుల వల్లే వంశీతేజ మృతిచెంది ఉంటాడని ముందుగా అందరూ భావించారు. కాల్ రికార్డులను పరిశీలిస్తున్న పోలీసులకు అతని మరణానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ బుకీకి రూ.20 వేల వరకూ ఇవ్వాల్సి ఉందని వార్తలు వినిపిస్తున్నా అంత చిన్న అప్పుకే వంశీతేజ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అతని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఈ రూ.20 వేలతో పాటు ఇంకా వేరే అప్పులేమైనా ఉన్నా యా? లేక కళాశాలలో చదవలేక ఈ నిర్ణయం తీసుకున్నాడా? మరేమైన ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే నగరంలోని పలువురు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను కూడా పిలిపించి పోలీసులు విచారణ చేస్తున్నారని సమాచారం. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం వంశీ తేజ కేసులో అన్ని కోణాలలో విచారణ చేపట్టాం. అతని కాల్ రికార్డ్స్ ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం. అతని మరణానికి అసలు కారణాలు ఏమిటనేవి ఇంకా తెలియడం లేదు. పూర్తి విచారణ తరువాత త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం. – సత్యనారాయణ, సీఐ -
వరంగల్‌కు చేరుకున్న వంశీ మృతదేహం
వరంగల్: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన వంశీరెడ్డి మృతదేహం శుక్రవారం వరంగల్‌కు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వంశీరెడ్డి(27).. ఓ యువతిని కాపాడే యత్నంలో దుండగుడి కాల్పులకు గురై ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. మృత దేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి మంత్రి కేటీఆర్.. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. వంశీ మృతదేహాం రాకతో.. వరంగల్ అర్భన్ జిల్లా వంగపహడ్‌లో విషాదచాయలు అలముకుననాయి. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వరంగల్‌కు చేరుకున్న వంశీ మృతదేహం
-
దుఃఖ సాగరంలో వంశీ కుటుంబం
-
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన వంశీ మామిడాల అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంస్ పూర్తిచేశాడు. శాన్ఫ్రాన్సిస్కో లోని ఓ స్టోర్‌లో పనిచేస్తున్న వంశీ.. గత రాత్రి విధులు ముగించుకొని తన గదికి తిరిగివస్తుండగా హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ వాడిన ఓ తెల్లజాతి వ్యక్తి వంశీపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూపర్‌స్టార్ తర్వాతి సినిమా వంశీతోనా?
-
జగన్ సభకు హాజరైన వారిపై వంశీ అనుచరుల దాడి!
-
జగన్ సభకు హాజరైన వారిపై వంశీ అనుచరుల దాడి!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి వెళుతున్న వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్త మల్లవల్లిలో చోటుచేసుకుంది. వంశీ ఆదేశాల మేరకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ దాడిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిప్పి కొట్టడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అదే గ్రామంలోని కొన్ని ఇళ్లపై మరోసారి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
వినూత్న ప్రేమకథ
వంశీ హీరోగా శ్రీ సాయిభవాని క్రియేషన్స్ పతాకంపై బి. విజయ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీవాస్తవ్ దర్శకుడు. తొలి సన్నివేశానికి బి. గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, మారుతి క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘తొలి ప్రయత్నంగా ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఓ వినూత్న ప్రేమకథ ఇది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. దర్శకునిగా ఇది తొలి సినిమా అని, నిర్మాత ఐదు నిమిషాల కథ విని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారని దర్శకుడు తెలిపారు. ఓ మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరో చెప్పారు. -
వంశీకి 6 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: టీకేఆర్ కాలేజి బౌలర్ వంశీ (6/12) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో జేఎన్టీయూహెచ్ జోన్-ఎ క్రికెట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీకేఆర్ కాలేజి 50 పరుగుల తేడాతో ఎంఆర్‌ఐఈటీ కాలేజిపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీకేఆర్ కాలేజి 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రవి చరణ్ (55) అర్ధ సెంచరీతో రాణిచాడు. ఎంఆర్ఐటీ బౌలర్ శ్రీకాంత్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఎంఆర్ఐటీ 110 పరుగులకే చేతులెత్తేసింది. బాల (42) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటీ కాలేజి 18 పరుగుల తేడాతో ఐఏఆర్ఈ కాలేజిపై విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన ఎంఎల్ఆర్ఐటీ 127 పరుగుల వద్ద ఆలౌటైంది. విశాల్ సింగ్ 26 పరుగులు చేశాడు. ఐఏఆర్ఈ బౌలర్ హిమకర్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన ఐఏఆర్ఈ 108 పరుగుల వద్ద కుప్పకూలింది. రోహిత్ 31 పరుగులు చేశాడు. ఎంఎల్ఆర్ఐటీ బౌలర్ 3 వికెట్లు పడగొట్టాడు.