
స్టెఫీ పటేల్, వంశీ
వంశీ, స్టెఫీ పటేల్ జంటగా అనిల్ తోట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్.ఎల్.ఎం ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్‌పై నేదురుమల్లి, అజిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిల్ తోట మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కి తగ్గ సినిమా ఇది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొత్త బ్యానర్‌లో కొత్త హీరో హీరోయిన్లతో ఈ సినిమా చేశాం. ఇందులో నటించిన, పని చేసిన వారికి ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు అజిత్ రెడ్డి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వంశీ. ‘‘తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు స్టెఫీ పటేల్.
Comments
Please login to add a commentAdd a comment