
ఆర్తి
వంశీ, ఆర్తి, తపస్వి, ఐశ్వర్య, విజయ్, సంజన ముఖ్య తారలుగా మేడం శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నా పేరు తంత్ర’. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎడిటింగ్ విభాగంలో పలు చిత్రాలకు పని చేసిన జగన్ (జె.డి) నిర్మాతగా మారి పరమశివ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ (జెడి) మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉంది. అందుకే 30 మంది గ్రాఫిక్స్ నిపుణులు మా సినిమా కోసం పనిచేస్తున్నారు.
గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘టైటిల్‌కు తగ్గట్టుగా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్. షాయాజీ షిండే, ‘ఛత్రపతి’ శేఖర్, సుమన్ శెట్టి, ప్రాబ్స్, ముక్తార్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: జాక్ పొట్ల, కెమెరా: చక్రి.
Comments
Please login to add a commentAdd a comment