బాలసుబ్రహ్మణ్యం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయకులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంకి అక్కినేని – వంశీ సంగీత పురస్కారం ప్రదానం చేయనున్నట్లు డా. వంశీ రామరాజు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ– ‘‘పురస్కారంతో పాటు బాలూగారికి వంశీ చైర్మన్ డాక్టర్ కొత్త కృష్ణవేణి చేతుల మీదుగా వీణ బçహూకరణ ఉంటుంది.
అమెరికాకు చెందిన గాయని శారదచే ‘నేల మీది జాబిలి .. అక్కినేని – బాలు శతగీత లహరి’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సభ ప్రారంభంలో అక్కినేని – బాలు సినీ సంగీత విభావరి ఉంటుంది. తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య, సినీ నటి డాక్టర్ జమున, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వనాథ్, సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, కేఎం రాధాకృష్ణన్, వీణాపాణి తదితరులు పాల్గొంటారు. 21న శుక్రవారం రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment