
దివ్య, వంశీ
ఇరుకళల పరమేశ్వరి ప్రొడక్షన్ పతాకంపై నెట్రంబాక హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో న్. హరిత ప్రియా రెడ్డి నిర్మించిన చిత్రం ‘సిబిఐ వర్సెస్ లవర్స్’. వంశీ, జైన్ నాని, దివ్య, శ్రావణి నిక్కి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ , సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేశారు. ఘన శ్యామ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సుమన్ ఆవిష్కరించి, సత్య ప్రకాష్‌కు ఇచ్చారు. ‘‘థియేటర్స్ విషయంలో చిన్న చిత్రాలకు ప్రభుత్వం అండగా నిలిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సుమన్. ‘‘తొందరపాటు నిర్ణయాల వల్ల విద్యార్థులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే కథతో నిర్మించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం. నెక్ట్స్ ‘బ్రహ్మముహూర్తం’ పేరుతో సినిమా నిర్మించబోతున్నాం’’ అన్నారు హరిత ప్రియారెడ్డి. ‘‘తప్పు చేసినవారికి శిక్ష తప్పదనే సందేశం ఇస్తున్నాం’’ అన్నారు హరి ప్రసాద్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment