
ఫ్రమ్ గీతాకృష్ణ టు కల్యాణ్ కృష్ణ నాగార్జున ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్‌గోపాల్ వర్మ, దశరథ్, లారెన్స్... ఇలా నాగ్ పరిచయం చేసిన దర్శకులు పది మందికి పైనే ఉంటారు. జస్ట్ తాను హీరోగా నటించిన సినిమాల ద్వారానే కాదు.. నిర్మించిన చిత్రాల ద్వారా కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నారట. అతని పేరు వంశీ అని తెలిసింది.
ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాల తర్వాత కొత్త దర్శకుడు వంశీతో చేసే సినిమా మొదలవుతుందని భోగట్టా. సమ్మర్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. నాగ్ ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుల్లో ఆల్‌మోస్ట్ అందరూ సక్సెస్. సో.. వంశీ కూడా ఆ హిట్ లిస్ట్‌లో చేరతారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment