లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటున్న వారంతా బద్దకంగా తయారవుతున్నారు. రోజూ బిజీబిజీ జీవితాన్ని అనుభవించే వారు ఒక్కసారిగా ఇంటి పట్టున ఉండటంతో ఏం చేయాలో తోచక సతమతమవుతున్నారు. కొందరు తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి పెడుతుండగా మరికొంత మంది ఏదైనా కొత్తగా నేర్చుకోవడం వంటి పనులతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కాలంలో తమ ఫిట్‌నెస్‌ను కోల్పోతున్నామని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. జిమ్ములు, ఫిట్‌నెస్ సెంటర్లు మూత పడటంతో తలబాదుకుంటున్నారు. దీంతో ఇంట్లోనే ఎలా వ్యాయామం చేయాలనే ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. వారి కోసం ఫిట్‌నెస్ ట్రైనర్స్ కొన్ని సూచనలు ఇస్తున్నారు. (మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు )
ఈ క్రమంలో విటమిన్ ఎఫ్ 3 ఫిట్‌నెస ట్రైనర్ రఫిక్ షేక్ ఓ సులభమైన వ్యాయామాన్ని పరిచయం చేశారు. ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా ఇంట్లోనే 20 నిమిషాలపాటు చేసుకునే వ్యాయామానికి సంబంధించి కొన్ని టిప్స్‌ను తెలిపారు. ఇందుకు ఫాన్సీ గేర్, ఎలాంటి మెషీన్లు కూడా అవసరం లేదు. కేవలం ఒక బాటిల్ వాటర్, హ్యండ్ టవల్, షూస్‌తోపాటు ఓ చాప ఉంటే సరిపోతుంది. ఇందులో వామ్‌అప్, డ్యాన్స్ థెరపీ, కండిషనింగ్, కార్డియో కిక్ బాక్సింగ్ వంటివి ఉంటాయి. దీన్ని ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా చేయవచ్చు.. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ప్రయత్నించండి. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం )
Comments
Please login to add a commentAdd a comment