Vidyullekha
-
ఛీ, ఇది ఒక అమ్మాయేనా? పంది, ఏనుగు అని తిట్టారు: విద్యుల్లేఖ
డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. వెండితెరపై నవ్వులు కురిపించిన ఆమె 2021లో ప్రియుడు, ఫిట్నెస్ నిపుణుడు సంజయ్‌ను పెళ్లాడింది. వివాహ అనంతరం వీరు హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు. ఆ సమయంలో బీచ్‌లో బికినీలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు షేర్ చేయడంతో తనపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఒక నెటిజన్ అయితే ఏకంగా విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారని అడగడంతో ఆమె మనసు నొచ్చుకుంది. డ్రెస్సింగ్‌కు, విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ అతడిని ఏకిపారేసింది. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలో అడుగుపెట్టిన విద్యుల్లేఖ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను ట్రోల్ చేశారు. ఏనుగు, పంది.. ఇలా అన్ని జంతువులతో పోల్చారు. ఎంత లైట్ తీసుకున్నా ఏదో ఒక పాయింట్లో అది గుచ్చుకుంటుంది. నా హనీమూన్‌లో స్విమ్‌సూట్ వేసుకున్నానని.. ఛీ ఇది ఒక అమ్మాయేనా? అని తిట్టిపోశారు' అని పేర్కొంది నటి. అదే షోలో ఉన్న హీరోయిన్ కాజల్ సైతం స్పందిస్తూ.. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా లావెక్కానని ట్రోల్ చేశారని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా, భలే మంచిరోజు సహా పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ మధ్య వచ్చిన హారర్ మూవీ 'రాజుగారి గది'లో కామెడీ పాత్రతో అలరించింది. View this post on Instagram A post shared by Vidyullekha / Vidyu Raman (@vidyuraman) -
బేబీ బంప్‌తో షాకిచ్చిన అనుపమ.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
Anupama Parameswaran Shares Baby Bump Photos Goes Viral: 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనుపమ తాజాగా రౌడీ బాయ్స్ చిత్రంతో ఆకట్టుకుంది. ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా అనుపమ షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ చిరునవ్వులు చిందించింది. అనుపమకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఈ బేబీ బంప్ ఏంటి అన్నదే కదా మీ డౌటు. నిజానికి ఇది రియల్ బేబీ బంప్ కాదు. 2019లో ఓ మలయాళ చిత్రం షూటింగ్లో భాగంగా తీసుకున్న ఫోటో. ఇందులో అనుపమ తండ్రి కూడా ఉన్నారు. కాగా అనుపమ ఈ త్రోబ్యాక్ పిక్చర్‌ని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. నటి, లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సైతం ఈ ఫోటోకు స్పందిస్తూ.. 'బేబ్..ఒక్కక్షణం నేను కంగ్రాట్స్ అని టైప్ చేయబోతున్నాను' అంటూ కామెంట్ చేయగా.. దీనికి అనుపమ ఊప్స్ అంటూ ఫన్నీగా బదులిచ్చింది. పలువురు నెటిజన్లు సైతం అనుపమ ఫోటోను చూసి మీరు నిజంగానే ప్రెగ్నెంట్ అనుకున్నా అంటూ కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
స్విమ్‌సూట్‌లో నటి.. విడాకులు ఎప్పుడు అని అడిగిన నెటిజన్
Vidyullekha Raman: లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఇటీవలె పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. అనంతరం కొత్తజంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. రీసెంట్గా అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్‌ను ఎంజాయ్ చెయ్యాలి అంటూ స్విమ్ సూట్, గాగుల్స్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న నెటిజన్ కామెంట్‌పై విద్యుల్లేఖ మండిపడింది. '1920 నాటి కాలాన్ని వదిలి 2011కు రండి. నెగిటివ్ కామెంట్ సమస్య కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ వారి వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా? నీతి, నిజాయతీ విశ్వాసాలు కలిగిన భర్త లభించడం నా అదృష్టం. ఇక సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళలు అంటే కేవలం శారీరక సుఖాన్ని ఇచ్చి, ఆణచివేత, అవమానాలను భరిస్తూ ఉండే వ్యక్తిలానే చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది' అంటూ ఘాటుగా బదులిచ్చింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత -
మాల్దీవుల్లో హనీమూన్‌కు వెళ్లిన హాస్య నటి
Vidyullekha Ramans Wedding Photos Goes Viral: లేడీ కమెడియన్ విద్యుల్లేక రామన్ ఇటీవల మెట్టినింట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక ఈ నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. తమిళ, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే ఇప్పటివరకు వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా విద్యుల్లేక పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో రెడ్ కలర్ లెహంగాలో పెళ్లికూతురిగా విద్యుల్లేక ముస్తాబవగా, సంజయ్ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇటీవల భర్త క్లిక్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక పలు సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేక. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈమె త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Gitanjali Selvaraghavan (@gitanjaliselvaraghavan) -
ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి విద్యుల్లేఖ ఫోటోలు
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్
లేడీ కమెడియన్ విద్యుల్లేక రామన్.. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట దర్శనమిచ్చాయి. ఆగస్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి తేదీపై మాత్రం ఆమె ప్రస్తావించలేదు. ఈ క్రమంలో నేడు(సెప్టెంబర్ 9) ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇటీవల శరీరాకృతిపై దృష్టి పెట్టిన విద్యుల్లేఖ జిమ్‌లో కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది. చదవండి: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా? ఈ క్రమంలో ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణడైన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం వైపు అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తమిళ సాంప్రదాయంలో వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కరోనా నిబంధనల మేరకు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహక వేడుక జరిగినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. విద్యుల్లేఖ ఇటూ తెలుగు అటూ తమిళంలో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో అందరి మన్ననలను అందుకున్న విద్యుల్లేఖ లేడీ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. చదవండి: RC15 : రామ్‌చరణ్ ధరించిన ఈ కాస్ట్లీ వాచ్ ధరెంతో తెలుసా? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాపై అలాంటి కామెంట్స్ చేశారు: విద్యుల్లేఖ ఎమోషనల్
టాలీవుడ్ పరిశ్రమలో లేడీ కమెడియన్స్ పేర్లు చెప్పమనగానే వెంటనే గుర్తోచ్చే పేరు విద్యుల్లేఖ రామన్. సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇటీవల కాలంలో విద్యుల్లేఖ సినిమాలు తగ్గించినప్పటికి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇటీవల ఓ ఫొటో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ముద్దుగా, బొద్దుగా ఉండే విద్యుల్లేఖ ఈ ఫొటోలో బక్కచిక్కనట్లు కనిపించింది. దీంతో ఆమె ఫొటోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. కొందరూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభిస్తే మరికొందరి తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆమె సంపూర్ణేశ్ బాబుతో ‘పుడింగ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన లావు తగ్గడంపై నెటిజన్లు చేసిన ట్రోల్స్‌పై స్పందించింది. ‘ఏంటీ సన్నబడుతున్నావ్.. ఇక కమెడియన్‌గా చేయవా? హీరోయిన్‌గానే చేస్తావా?’ అంటూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నేను లీడ్ రోల్ చేస్తూ కామెడీ చేయాలని అనుకున్నాను. అలా నేను కలలు కంటున్న సమయంలోనూ కలలాగా ఈ మూవీ ఆఫర్ వచ్చిందంటూ విద్యుల్లేఖ చెప్పుకొచ్చింది. ఇది సంపూర్ణేశ్ బాబు పక్కన.. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ అని ఆమె పేర్కొంది. ఇక తను అధిక బరువు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని, అందుకే తన వ్యాయమం, వర్కవుట్స్ చేసి సన్నబడినట్లు తెలిపింది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్ పోలింగ్ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆ వార్తల్లో నిజం లేదు -
ఏడడుగులకు రెడీ
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్య నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు విద్యుల్లేఖా రామన్. తమిళ క్యారెక్టర్ నటుడు, సినిమా జర్నలిస్ట్ మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. ఇన్నాళ్లూ కుమారి విద్యుల్లేఖగా ఉన్న ఆమె త్వరలో శ్రీమతి కానున్నారు. కొంతకాలంగా ఆమె న్యూట్రిషియనిస్ట్, ఫిట్నెస్ నిపుణులు సంజయ్‌తో ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో గత నెల 26న వీరి రోకా (ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం గురించి ఫార్మల్గా మాట్లాడి, ఫంక్షన్‌లా చేసుకోవడం) ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియ ద్వారా తెలియజేశారు విద్యుల్లేఖా. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి, ‘‘ఫొటోలు దిగినప్పుడు మాస్క్‌లు తీసేశాం. వేడుక జరుగుతున్నంతసేపూ మాస్క్‌లు పెట్టుకున్నాం’’ అన్నారు విద్యుల్లేఖా రామన్. -
పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్
తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు నవ్వులు పంచిన హాస్య నటి విద్యుల్లేఖ రామన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఫిట్నెస్, న్యూట్రీషన్ నిపుణుడు సంజయ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు అభిమానులకు షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో పెళ్లికి ముస్తాబు అవుతున్నారు. ఆగస్టు 26న రోకా ఫంక్షన్ కూడా జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. (చదవండి: 'డ్రగ్స్ లేనిదే టాలీవుడ్లో పార్టీలు జరగవు') "రోకా పూర్తయింది. అతికొద్ది మంది మధ్య మాత్రమే ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో మేం మాస్కులు ధరించాం, కేవలం ఫొటోలకు స్టిల్స్ ఇచ్చే సమయంలో మాత్రం వాటిని తీసివేశాం. మాకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు" అని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు. కాగా లాక్డౌన్లో ఆమె పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి కేటాయించారు. అధిక బరువును తగ్గించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు స్లిమ్‌గా తయారై అందరినీ ఔరా అనిపించారు. (చదవండి: ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నాను : విద్యుల్లేఖ) View this post on Instagram We got Roka-Ed! @lowcarb.india & I had our Roka Ceremony (formal announcement) on 26.08.2020 in an intimate manner with close family around us. It was our lil’ ray of sunshine & we couldn’t be more grateful for the love we received. We wore masks & removed them for the pictures (before anyone asks!) Thank you all so much for showering us with your best wishes! The best is yet to come. 🙏🏼♥️🥰🧿 📸 - @manasimaheshphoto A post shared by Vidyu Raman (@vidyuraman) on Aug 31, 2020 at 9:30am PDT -
ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నాను : విద్యుల్లేఖ
తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో లేడి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విద్యుల్లేఖ రామన్. బొద్దుగా తనదైన నటనతో అందరి మెప్పించే విద్యుల్లేఖ.. లాక్డౌన్ సమయంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. అందుకోసం తీవ్రంగా శ్రమించిన విద్యుల్లేఖ.. అసాధారణంగా రీతిలో బరువు తగ్గారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నకిలీ విశ్వాసం వర్సెస్ నిజమైన విశ్వాసం అని పేర్కొన్నారు. జూన్ 20 నాటికి 68.2 కిలోల బరువు ఉన్నానని విద్యుల్లేఖ వెల్లడించారు. ఇందుకోసం ఎలాంటి కషాయాలు, ఎటువంటి మాత్రలు వినియోగించలేదని స్పష్టం చేశారు. వారానికి ఆరు సార్లు వ్యాయామం చేశానని, డైట్ పాటించానని వెల్లడించారు. (చదవండి : ఆ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ) ‘నేను అధిక బరువుతో ఉన్నప్పుడు చాలా మంది మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అని అడిగేవారు. అప్పుడు నా ఆత్మ విశ్వాసంపై నాకే అనుమానం కలిగేది. కానీ ఇప్పుడు మాత్రం నా మీద నేను పూర్తి నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఊహించని విధంగా నా జీవనశైలి, అలవాట్లను మార్చుకోగలిగాను. మీరు చేయాలని అనుకున్న దానిపై మనసు పెడితే ఏదైనా సాధించవచ్చని గ్రహించాను’ అని విద్యుల్లేఖ పేర్కొన్నారు. కాగా, తమిళ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. చెన్నైలో పుట్టిపెరిగారు. మొదట థియేటర్ ఆర్టిస్టుగా రాణించి...ఆపై వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విద్యుల్లేఖ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తున్నారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో లేడి స్టార్ కమెడియన్‌గా కొనసాగుతున్నారు. (చదవండి : సాంబార్ బుజ్జెమ్మ) View this post on Instagram Fake confidence vs. ACTUAL confidence. When I was overweight a frequently asked question by everyone to me was “how are you so confident?”. In retrospect, was I? Or did I just come to terms with the fact that I will be obese all my life? Today I am actually confident of myself because I did the unthinkable and changed my lifestyle and habits. I have come to realise that if you put your mind to it, anything is possible. Sounds cliché, right? But it’s the truth!! You need to be disciplined, workout 6 times a week and follow a balanced diet. There is no secret potion or pill to make the result happen! Just pure hard work. Nothing in life comes easy but when you see result, it’s worth all the sweat and tears. Recorded weight as on 20/06/20 - 68.2kgs #weightlossjourney #weightlosstransformation A post shared by Vidyu Raman (@vidyuraman) on Jun 21, 2020 at 8:11am PDT -
విద్యుల్లేఖతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ
ఆమె రూపం ప్రత్యేకం...ఆమె గొంతు ప్రత్యేకం. మాట్లాడే భాష కూడా ప్రత్యేకమే. ఆమె తెరపై కన్పించగానే నవ్వులు విరబూయాల్సిందే. రూపం..గొంతు..భాషతో సినీతెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది క్యారెక్టర్ కమ్ కమెడియన్ ఆర్టిస్ట్ విద్యుల్లేఖా రామన్. సరైనోడు సినిమాలో ‘సాంబార్ వదిన’గా..రాజుగారి గది మూవీలో బుజ్జెమ్మగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖ చెన్నైలో పుట్టి పెరిగింది. తండ్రి మోహన్ రామన్ తమిళ నటుడు. మొదట థియేటర్ ఆర్టిస్టుగా రాణించి...ఆపై వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మాయి తెలుగు భాషను తమిళ యాసతో వెరైటీగా మాట్లాడుతుంది. హైదరాబాద్ అంటే ఇష్టమని, పాతబస్తీలో షాపింగ్... పలావ్ లాగించడం మరీ ఇష్టమని చెబుతున్న విద్యుల్లేఖ తన సినీ ప్రయాణం..వ్యక్తిగత అభిరుచుల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. శ్రీనగర్‌కాలనీ: ఆమె తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.. ఏ పాత్ర వేసినా అందులో ఆ పేరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఆమె ఒరిజినల్ పేరు చాలా మందికి తెలియదు. తెలుగులో ‘బుజ్జెమ్మ, సాంబార్’ అని ముద్దుగా పిలిపించుకుంటూ ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఇంకా గుర్తుపట్టలేదా.. అదేనండీ.. ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్‌కు తమిళ సాంబార్ వదినగా, ‘రాజుగారి గది’లో బుజ్జెమ్మగా, ‘రన్ రాజా రన్’లో హీరోయిన్ ఫ్రెండ్‌గా పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించిన నటి. బొద్దుగా చురుకుదనానికి కేరాఫ్‌గా కనిపించిందే ఆమె అసలు పేరు ‘విద్యులేఖా రామన్’. తెలుగు, తమిళ పరిశ్రమలో లేడీ స్టార్ కమెడియన్‌గా చాలా సుపరిచితురాలు. తెలుగు భాషను తమిళ వాసనలో మాట్లాడే ఈ పాప.. ‘సాక్షి’తో తన చిత్రసీమ ప్రయాణాన్ని పంచుకుంది. ఆ వివరాలు బుజ్జెమ్మ అలియాస్ విద్యుల్లేఖా రామన్ మాటల్లోనే.. నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. నాన్న మోహన్ రామన్ తమిళ నటుడు. రజనీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్లతో పాటు పలు ప్రముఖ సీనియల్స్‌లో నటించారు. నేను విజువల్ ఎఫెక్టŠస్ అండ్ మీడియా కమ్యునికేషన్స్‌లో డిగ్రీ చేశాను. మా నాన్న ప్రభావం నాపై పడిందేమో.. నేనూ థియేటర్ ఆర్టిస్ట్ అయ్యాను. పదేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ ‘అను’ అనే ట్రూప్‌ను ప్రారంభించాను. దానిద్వారా ప్రదర్శనలు ఇచ్చి అవార్టులు సైతం అందుకున్నాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా స్టేజ్ ఫియర్ పోయి సినిమాల్లో నటించడానికి చాలా దోహదపడింది. ఒకేసారి తెలుగు, తమిళంలో నటించా.. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా తీస్తున్నారు. ఒక కొత్త అమ్మాయిని క్యారెక్టర్ కోసం వెతుకున్న సమయంలో థియేటర్ ఆర్టిస్ట్‌గా నా ప్రదర్శన చూసిన చిత్ర యూనిట్ ఆయనకు పరిచయం చేశారు. ఆడిషన్ తర్వాత చిత్రంలో క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమానే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఆ తర్వాత రన్‌రాజారన్, సరైనోడు, రాజుగారి గది, తొలిప్రేమ, ఆనందోబ్రహ్మ, నిన్నుకోరి, భాగమతి, ధృవ, డీజే.. ఇలా తెలుగులో 35 చిత్రాలు చేశాను. తమిళంలో విజయ్, అజిత్ లాంటి స్టార్స్‌తో పాటు మొత్తం 26 సినిమాలు, కన్నడలో మూడు చిత్రాల్లోను నటించారు. సొంతంగా డబ్బింగ్.. మొదటి సినిమా చేసేనాటికి నాకు తమిళం తప్ప ఒక్క ముక్క తెలుగు రాదు. అయినా సరే కొత్త వాయిస్ ఉంటే బాగుంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. కొత్త వాయిస్ కావడంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతాను కూడా. రన్ రాజా రన్, రాజుగారి గది, సరైనోడు చిత్రాల్లోని పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఎంతగా అంటే నా అసలు పేరు ఎవరూ గుర్తుంచుకోలేదు.. ఆ చిత్రల్లోని పాత్రల పేరుతోనే పిలుస్తున్నారు. తెలుగు ఫుడ్‌కి ఫిదా అయిపోయా.. నాకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చింది తెలుగు సినిమా.. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. పాతబస్తీ అంటే మరీ ఇష్టం. అక్కడి కట్టడాలు అపురూపంగా ఉంటాయి. ఇక్కడి సంస్కృతి చాలా గొప్పది. పాతబస్తీలో షాపింగ్ అంటే ఇష్టం.. హైదరాబాద్ బిర్యానీ కంటే పలావ్.. భీమవరం చేపల పులుసు, పీతలు, రొయ్యలు, స్పైసీ పుడ్ ఇష్టంగా తింటాను. నన్ను నేను మైమరపించేలా తెలుగు వంటకాలుంటాయి. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, బేగంబజార్, ఔటర్‌రింగ్ రోడ్లో లాంగ్ డ్రైవ్ ఇష్టం. పవన్ కల్యాణ్‌తో సినిమా నా డ్రీమ్.. తెలుగులో పవర్‌స్టార్‌తో సినిమా చేయాలని నా కోరిక.. కానీ తీరేలా లేదు. అవకాశం ఉంటే తప్పక చేస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఇది కుదురుతుంది అనుకుంటున్నాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం.. కానీ ఇష్టంతో చేయాలి. దానితో పాటు సీరియస్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అఖిల్, నితిన్, నిఖిల్, నాగచైతన్య సినిమాల్లో నటిస్తున్నాను. 500 చిత్రాలు చేయాలి తెలుగు, తమిళ భాషల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన మహానటుల్లా నా కెరీర్లో 500 చిత్రాలు చేయాలని ఉంది. దేవుడి కృప ఉంటే తప్పక చేస్తాను. సినిమాల్లో హెల్తీ కామెడీ రావాలి. సైజ్లు, కలర్‌ను పదేపదే అవహేళన చేసే విధంగా కాకుండా ఓ మోతాదులో హెల్తీ కామెడీ ఉంటే బాగుంటుంది. లేడీ కమెడియన్స్ పరిశ్రమలో లేరు. ప్రతిభ ఉన్న వారు తప్పక రావాలి. తమిళంలో కంటే తెలుగులో అధికంగా అవకాశాలు వస్తున్నాయి. నన్ను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. అన్నట్టు నా అసలు పేరు విద్యుల్లేఖా రామన్.. అంటూ ముగించారు. -
లండన్‌లో ల్యాండ్ అయ్యానోచ్!
సిల్వర్ స్క్రీన్‌పై విద్యుల్లేఖా రామన్ ఉంటే చాలు. కామెడీకి కొదవ ఉండదు ఆడియన్స్‌కు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన ‘తొలిప్రేమ’ సినిమాలో ఆమె చేసిన రోల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మళ్లీ వెంకీ అట్లూరి సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అఖిల్ హీరోగా వెంకీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ యూకేలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికి లండన్‌లో ల్యాండ్ అయ్యారు విద్యుల్లేఖా రామన్. ‘‘అఖిల్ థర్డ్ మూవీలో ఎగై్జటింగ్ క్యారెక్టర్ చేయడానికి లండన్ వచ్చాను. లెట్స్ రాక్ అఖిల్’’ అని పేర్కొన్నారామె. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్ చేయనున్నారట. చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
విద్యుల్లేఖ పాస్ పోర్ట్ ఎలా మిస్ అయ్యింది
హాస్య నటి విద్యుల్లేఖ విదేశంలో పాస్‌పోర్టు, వీసాలు పోగొట్టుకుని నానా ఇబ్బందులు పడిన విషయం కోలీవుడ్‌లో పెద్ద కలకలాన్నే సృష్టించింది. హాస్య నటిగా ఇప్పుడే ఎదుగుతున్న నటి విద్యుల్లేఖ. ఈమె థియేటర్ ఆర్టిస్టు. సీనియర్ నటుడు మోహన్‌రామ్ కూతురు. నీ దానే ఎన్ పొన్ వసంతం చిత్రంతో హాస్యనటిగా పరిచయమైన విద్యుల్లేఖ ఆ తరువాత జిల్లా, వీరం, మాస్ తదితర చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనూ రాజుగారి గది, రన్ రాజా రన్, సరైనోడు చిత్రాలలో నటించి హాస్యనటిగా అక్కడా ఎదుగుతున్నారు. తన బంధువుల అమ్మాయికి త్వరలో పెళ్లి జరగనుంది. దీంతో అంతకు ముందుగా ఆమె తన స్నేహితురాళ్లుతో విదేశీయానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు ఎంచుకున్న దేశం ఆస్ట్రియా.విద్యుల్లేఖ తన బంధువుల అమ్మాయి, మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఐదురోజుల విహార యాత్రకు ఆస్ట్రియా వెళ్లారు. అక్కడ వియన్నా నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో బస చేసి, నచ్చిన ప్రదేశాలను చుట్టి చెన్నైకి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు. హోటల్ ఖాళీ చేసి పాస్‌పోర్టు, వీసాలను బ్యాగ్‌లో పెట్టుకుని బయల్దేరారు. అయితే హోటల్ బయటకు వచ్చిన తరువాత నటి విద్యుల్లేఖ తన బ్యాగ్ మిస్ అయిన్న విషయాన్ని గ్రహించారు. వెంటనే హోటల్ మేనేజర్‌కు పరిస్థితిని వివరించారు. అదే సమయంలో తన ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి మోదీకి, విదేశాంగశాఖ మంత్రి సుస్మాస్వరాజ్, భారత రాయబారికి, బంధువులకు విషయాన్ని వివరించారు. విద్యుల్లేఖ హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆమెను అడ్రెస్ అడిగినట్లు దిశ మార్చగా మరో వ్యక్తి ఆమె బ్యాగ్‌ను తస్కరించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. విద్యుల్లేఖ పరిస్థితిని అర్థం చేసుకున్న భారత రాయబారి ఆమెకు తాత్కాలిక పాస్‌పోర్టును, వీసాను సిద్ధం చేసి అందించారు. దీంతో ఎంతో ఉద్వేగం, ఉత్కంఠ భరిత వాతావరణం తరువాత సమస్య నుంచి బయట పడ్డారు. విద్యుల్లేఖ మిత్ర బృందం ఆస్ట్రియా నుంచి శుక్రవారం చెన్నైకి చేరుకోనుంది.