స్విమ్‌సూట్‌లో నటి.. విడాకులు ఎప్పుడు అని అడిగిన నెటిజన్‌ | Vidyullekha Raman Gets Questions About Divorce for Wearing Swimsuit | Sakshi
Sakshi News home page

Vidyullekha: విడాకులకు డ్రెస్సింగే కారణమా? అలా అయితే...

Published Tue, Oct 5 2021 2:02 PM | Last Updated on Tue, Oct 5 2021 4:09 PM

Vidyullekha Raman Gets Questions About Divorce for Wearing Swimsuit - Sakshi

Vidyullekha Raman: లేడీ కమెడియన్‌ విద్యుల్లేఖ రామన్‌ ఇటీవలె పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు, ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. అనంతరం కొత్తజంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది. రీసెంట్‌గా అక్కడ ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి

ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్‌ను ఎంజాయ్‌ చెయ్యాలి అంటూ స్విమ్‌ సూట్‌, గాగుల్స్‌తో ఉన్న ఫోటోను పోస్ట్‌ చేసింది. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న నెటిజన్‌ కామెంట్‌పై విద్యుల్లేఖ మండిపడింది. 

'1920 నాటి కాలాన్ని వదిలి 2011కు రండి.  నెగిటివ్‌ కామెంట్‌ సమస్య కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ వారి వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా?

నీతి, నిజాయతీ విశ్వాసాలు కలిగిన భర్త లభించడం నా అదృష్టం. ఇక సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళలు అంటే కేవలం శారీరక సుఖాన్ని ఇచ్చి, ఆణచివేత, అవమానాలను భరిస్తూ ఉండే వ్యక్తిలానే చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది' అంటూ ఘాటుగా బదులిచ్చింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement