swim suit
-
ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్
కెనడా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఏ ఆటగాడైనా ఒక టోర్నమెంట్లో పాల్గొంటే ఐడీ కార్డు ఇవ్వడం ఆనవాయితీ. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ లాంటి గ్రూఫ్ జట్లకు ఐడీ కార్డులు లేకపోయినప్పటికి.. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో పాల్గొనే వారికి ఆయా టోర్నమెంట్ పేరిట ఐడీ కార్డులు తయారు చేస్తారు. అవి ఉంటేనే గేమ్స్‌లో అనుమతిస్తారు. తాజాగా కెనడా మహిళా క్రీడాకారిణి.. 28 ఏళ్ల యూజీనీ బౌచర్డ్ ఓల్డమ్ బ్రౌన్ వాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొంది. తొలి రౌండ్ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆమెకిచ్చిన ఐడీ కార్డుపై సాధారణ ఫోటో కాకుండా టూ పీస్ బికినీలో స్విమ్‌సూట్ ధరించి ఉన్న ఫోటోను ముద్రించారు. బ్లాక్ స్విమ్ సూట్లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆమె ఫోటోను ఈ టోర్నమెంట్‌కు వాడడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా యూజీని బౌచర్డ్ 2018లో స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు సంబంధించి కవర్ షూట్ కోసం ఈ బికినీ ధరించింది. అయితే ఈ ఫోటో వాడడంపై యూజీనీ సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓల్డమ్ బ్రౌన్ వాన ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఐడీ ఫోటోను షేర్ చేసి.. ''హ్యూజీని బౌచర్డ్.. డబ్ల్యూటీఏ ప్లేయర్''.. ''ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అధికారులకు ఒక ప్రశ్న.. ఈ ఫోటో ఎందుకు వాడారో నాకు సమాధానం కావాలి.. ప్లీజ్ వివరణ ఇవ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మాజీ వరల్డ్ నెంబర్ 5వ ర్యాంకర్ అయిన హ్యుజీని బౌచర్డ్ 2014లో వింబుల్డన్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత భుజం గాయంతో చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే తిరిగి టెన్నిస్‌లో అడుగుపెట్టింది. ఏది ఏమైనా.. యూజీని బికినీ ఫోటోలో దర్శనమివ్వడంతో టెన్నిస్ అభిమానులు ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. చదవండి: మనీషా కిక్ కొడితే... అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ -
స్విమ్‌సూట్‌లో కనిపించిన సమంత.. గోవాలో చిల్లింగ్
Samantha Goa Trip With Friends Ahead Of New Year, Pics Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం రూటు మార్చిన సమంత సినిమాల విషయంలో మరింత దూకుడు పెంచింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్‌కు పయనమవుతుంది. తాజాగా యశోద షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ గోవాకి చెక్కేసింది. తన బెస్ట్‌ఫ్రెండ్ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఇటీవలె ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటూ హాట్ పర్ఫార్మెన్స్తో హెడ్‌లైన్స్‌లో నిలిచిన సామ్ తాజాగా బికినీలో స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్విమ్‌సూట్‌లో నటి.. విడాకులు ఎప్పుడు అని అడిగిన నెటిజన్
Vidyullekha Raman: లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఇటీవలె పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు, ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడు సంజయ్‌ను విద్యుల్లేక గత నెల 9వ తేదీన చెన్నైలో పెళ్లాడింది. అనంతరం కొత్తజంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. రీసెంట్గా అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి ఏడాదికి రెండుసార్లు అంటే ఆరు నెలలకొకసారి వెకేషన్‌ను ఎంజాయ్ చెయ్యాలి అంటూ స్విమ్ సూట్, గాగుల్స్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న నెటిజన్ కామెంట్‌పై విద్యుల్లేఖ మండిపడింది. '1920 నాటి కాలాన్ని వదిలి 2011కు రండి. నెగిటివ్ కామెంట్ సమస్య కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణం అయితే చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ వారి వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా? నీతి, నిజాయతీ విశ్వాసాలు కలిగిన భర్త లభించడం నా అదృష్టం. ఇక సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను. మీ జీవితంలో మహిళలు అంటే కేవలం శారీరక సుఖాన్ని ఇచ్చి, ఆణచివేత, అవమానాలను భరిస్తూ ఉండే వ్యక్తిలానే చూస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది' అంటూ ఘాటుగా బదులిచ్చింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత -
ఇంకా వేగంగా ఈదాలని ఉందా?, అయితే..
స్పోర్ట్స్ ప్రొడక్టుల ప్రముఖ కంపెనీ స్పీడో.. కొత్త శకానికి నాంది పలికింది. ప్రత్యేకించి ఈత పోటీలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఈ ఆస్ట్రేలియన్ కంపెనీ.. ఓ కొత్త సూట్‌ను త్వరలో మార్కెట్లోకి తేనుంది. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో స్విమ్సూట్ను తయారు చేయించింది. ఈ సూట్ ప్రత్యేకత ఏంటంటే.. ఈత కొట్టే వ్యక్తి తన వేగం కంటే ఎక్కువగా ఈదేందుకు ఈ సూట్ ఉపయోగపడుతుంది. ఫాస్ట్స్కిన్ 4.0 పేరుతో తయారు చేసిన ఈ సూట్.. ఇప్పటిదాకా ఏ కంపెనీ ఉపయోగించని స్థాయిలో కృత్రిమ మేధస్సు స్థాయిని ఉపయోగించడం విశేషం. అయితే దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండబోవని, క్లియరెన్స్ పూర్తైన తర్వాతే దీనిని మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నామని స్పీడో వెల్లడించింది. ఇక ‘ఆక్వామాన్’ తరహా అటిరేలో ఉన్న ఈ సూట్ సాయంతో మనిషి ఈదే వేగం కన్నా గరిష్టంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. చదవండి: కరోనా పేషెంట్ల కోసం సోఫియా చెల్లి ‘ఆక్వా’ల్యాబ్ సాయంతో ఈ సూట్‌ను డెవలప్ చేసిన స్పీడో.. 80 శాతం బయోడిగ్రేడెబుల్ అని తెలిపింది.ఈ సూట్ సెటప్‌లో ఉండే ఎక్సోస్కెలిటన్ సిస్టమ్ వల్లే ఇది సాధ్యమవుతుందని, షార్క్ రెక్కల నుంచి స్ఫూర్తితో ఈ టెక్నాలజీని రూపొందించినట్లు ఆక్వాల్యాబ్ వెల్లడించింది. ఇక సూట్ మీద ఉండే ఏఐ మైక్రో సెన్సార్లు.. ఈతకు ముందు, ఈత టైంలో, ఈత తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీరం పనితీరును ఏఐ కోచ్ క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. అయితే మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్న ఈ స్విమ్ సూట్‌ను స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఉపయోగించాలంటే.. ఆయా దేశాల స్విమ్మింగ్ ఫెడరేషన్లు, అసోషియేషన్ల నుంచి అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది. చదవండి: ఆన్లైన్లో స్విమ్‌సూట్ బుక్ చేయడం ఎలా? -
స్విమ్ సూట్లో మగాళ్లు
హెల్మెట్ పెట్టుకొచ్చిన వాళ్లకే పెట్రోల్ అని ఈమధ్య హైదరాబాద్‌లో ఓ కండిషన్ పెట్టారు! అది వర్కవుట్ కాలేదు. హెల్మెట్ అప్పు అడిగి మరీ పెట్రోల్ పోయించుకోవడం మొదలుపెట్టారు మనవాళ్లు. రష్యాలో కూడా ఇలాంటిదే ఒక ట్రిక్ ప్లే అయింది. అయితే అది కండిషన్ కాదు. ఆఫర్! ఎవరైనా సరే స్విమ్ సూట్లో, హై హీల్స్ వేసుకుని వస్తే ఫుల్ ట్యాంక్ ఫ్రీ! రష్యాలోని ఒబ్లాస్ట్ ప్రాంతంలో కొత్తగా వెలసిన ఓ పెట్రోల్ బంక్ పబ్లిసిటీ స్టంట్ ఇది. స్టంట్ సక్సెస్ అయింది అనడానికి నిదర్శనం.. ఇదిగో ఇంతదూరంలో ఉన్న మనం ఇప్పుడు ఆ వార్త గురించి చెప్పుకోవడం. ఒకే ఒక్కరోజు (జూలై 21)న అదీ మూడు గంటలు మాత్రమే ఆఫర్ అమల్లో ఉంది. కానీ ఇందులో కూడా ఒక కండిషన్ ఉంది. స్విమ్ సూట్ నిండుగా ఉండడానికి లేదు. పైగా ఒంటికి తగినట్టుగా ఆకర్షణీయంగా ఉండాలి. అలాంటి వారు నేరుగా ఆ పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి, ఎవర్నీ అడక్కుండానే ట్యాంకు నిండా ఫ్రీగా పెట్రోల్ నింపుకుని వెళ్లొచ్చు. ఎవరైనా వెళ్లి ఉంటారా? ఫొటో చూశాక కూడా మీకా డౌట్ ఎందుకు? ఫ్రీ పెట్రోల్ కోసం మగాళ్లు కూడా సిగ్గుపడకుండా స్విమ్‌సూట్‌లో ప్రత్యక్షమయ్యారు! -
ఆన్లైన్లో స్విమ్ సూట్‌ను కొనుగోలు చే యాలంటే...
షాపింగ్ ఇటీవల షాపులకు వెళ్లి, కొంత టైమ్ కేటాయించి నచ్చిన వాటిని ఎంచుకునే సమయం అందరికీ ఉండటం లేదు. దీంతో ఆన్లైన్ షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆన్లైన్లో స్విమ్ సూట్ కొనుగోలు చేయాలంటే... రూల్ వన్: మీ శరీర సౌష్టవం ఏ తరహాలో ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారు అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉన్న బికినీ ఎంచుకుంటే మేలు. పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆ భాగాని కవర్ చేసే చిన్న ప్రింట్లు ఉన్న స్విమ్ సూట్ ఎంపిక సరైనది. ప్రముఖ స్విమ్‌వేర్ కంపెనీలు ఆన్లైన్ చాటింగ్ ద్వారా కొనుగోలుదారుల సందేహాలను తీరుస్తున్నాయి. వాటిని ఫాలో అవడం మంచిది. రూల్ టు: మీకు నచ్చిన సూట్స్ కనీసం 2 కొలతలలో ఆర్డర్ ఇవ్వాలి. సైజ్ చార్ట్‌లో సూచించిన సైజ్, ఆ తర్వాతి సైజ్ సూట్‌ను ఆర్డర్ చేసుకోవడం మేలు. రూల్ త్రీ: కొన్ని రకాల డిజైన్లు, ప్రింట్లు ఆన్లైన్లో చూడగానే నచ్చుతాయి. కాని ధరిస్తే అవి అంతగా నప్పవు. రంగులు, డిజైన్లు గల మరో క్లాత్‌తో మీకు ఆ తరహా ప్రింట్లు నచ్చుతాయో లేదో చెక్ చేసుకొని, ఆర్డర్ ఇవ్వడం మేలు.