ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్‌​ స్టార్‌ | Tennis Star Eugenie Bouchard Shocks Recieved Credential Black SwimSuit | Sakshi
Sakshi News home page

Eugenie Bouchard: ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్‌​ స్టార్‌

Published Sat, Aug 20 2022 11:54 AM | Last Updated on Sat, Aug 20 2022 12:11 PM

Tennis Star Eugenie Bouchard Shocks Recieved Credential Black SwimSuit - Sakshi

కెనడా మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణి యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఏ ఆటగాడైనా ఒక టోర్నమెంట్‌లో పాల్గొంటే ఐడీ కార్డు ఇవ్వడం ఆనవాయితీ. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ లాంటి గ్రూఫ్‌ జట్లకు ఐడీ కార్డులు లేకపోయినప్పటికి.. టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ లాంటి క్రీడల్లో పాల్గొనే వారికి ఆయా టోర్నమెంట్‌ పేరిట ఐడీ కార్డులు తయారు చేస్తారు. అవి ఉంటేనే గేమ్స్‌లో అనుమతిస్తారు.

తాజాగా కెనడా మహిళా క్రీడాకారిణి.. 28 ఏళ్ల యూజీనీ బౌచర్డ్‌ ఓల్డమ్‌ బ్రౌన్‌ వాన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ కూడా ఆడింది. అయితే ఆమెకిచ్చిన ఐడీ కార్డుపై సాధారణ ఫోటో కాకుండా టూ పీస్‌ బికినీలో స్విమ్‌సూట్‌ ధరించి ఉన్న ఫోటోను ముద్రించారు. బ్లాక్‌ స్విమ్‌ సూట్‌లో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఆమె ఫోటోను ఈ టోర్నమెంట్‌కు వాడడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా యూజీని బౌచర్డ్‌ 2018లో స్పోర్ట్స్‌ మ్యాగజైన్‌కు సంబంధించి కవర్‌ షూట్‌ కోసం ఈ బికినీ ధరించింది. 

అయితే ఈ ఫోటో వాడడంపై యూజీనీ సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓల్డమ్‌ బ్రౌన్‌ వాన​ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఐడీ ఫోటోను షేర్‌ చేసి.. ''హ్యూజీని బౌచర్డ్‌.. డబ్ల్యూటీఏ ప్లేయర్‌''.. ''ఈ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న అధికారులకు ఒక ప్రశ్న.. ఈ ఫోటో ఎందుకు వాడారో నాకు సమాధానం కావాలి.. ప్లీజ్‌ వివరణ ఇవ్వండి'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 


ఇక మాజీ వరల్డ్‌ నెంబర్‌ 5వ ర్యాంకర్‌ అయిన హ్యుజీని బౌచర్డ్‌ 2014లో వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత భుజం గాయంతో చాలాకాలం ఆటకు దూరంగా ఉ‍న్న ఆమె ఇటీవలే తిరిగి టెన్నిస్‌లో అడుగుపెట్టింది. ఏది ఏమైనా.. యూజీని బికినీ ఫోటోలో దర్శనమివ్వడంతో టెన్నిస్‌ అభిమానులు ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. 

చదవండి: మనీషా కిక్‌ కొడితే...

అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement