Eugenie Bouchard
-
ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్
కెనడా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి యూజీనీ బౌచర్డ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఏ ఆటగాడైనా ఒక టోర్నమెంట్లో పాల్గొంటే ఐడీ కార్డు ఇవ్వడం ఆనవాయితీ. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ లాంటి గ్రూఫ్ జట్లకు ఐడీ కార్డులు లేకపోయినప్పటికి.. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో పాల్గొనే వారికి ఆయా టోర్నమెంట్ పేరిట ఐడీ కార్డులు తయారు చేస్తారు. అవి ఉంటేనే గేమ్స్‌లో అనుమతిస్తారు. తాజాగా కెనడా మహిళా క్రీడాకారిణి.. 28 ఏళ్ల యూజీనీ బౌచర్డ్ ఓల్డమ్ బ్రౌన్ వాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొంది. తొలి రౌండ్ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆమెకిచ్చిన ఐడీ కార్డుపై సాధారణ ఫోటో కాకుండా టూ పీస్ బికినీలో స్విమ్‌సూట్ ధరించి ఉన్న ఫోటోను ముద్రించారు. బ్లాక్ స్విమ్ సూట్లో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆమె ఫోటోను ఈ టోర్నమెంట్‌కు వాడడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా యూజీని బౌచర్డ్ 2018లో స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు సంబంధించి కవర్ షూట్ కోసం ఈ బికినీ ధరించింది. అయితే ఈ ఫోటో వాడడంపై యూజీనీ సీరియస్‌గా కాకుండా ఫన్నీగా స్పందించడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓల్డమ్ బ్రౌన్ వాన ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఐడీ ఫోటోను షేర్ చేసి.. ''హ్యూజీని బౌచర్డ్.. డబ్ల్యూటీఏ ప్లేయర్''.. ''ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అధికారులకు ఒక ప్రశ్న.. ఈ ఫోటో ఎందుకు వాడారో నాకు సమాధానం కావాలి.. ప్లీజ్ వివరణ ఇవ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మాజీ వరల్డ్ నెంబర్ 5వ ర్యాంకర్ అయిన హ్యుజీని బౌచర్డ్ 2014లో వింబుల్డన్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత భుజం గాయంతో చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే తిరిగి టెన్నిస్‌లో అడుగుపెట్టింది. ఏది ఏమైనా.. యూజీని బికినీ ఫోటోలో దర్శనమివ్వడంతో టెన్నిస్ అభిమానులు ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. చదవండి: మనీషా కిక్ కొడితే... అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ -
‘సిల్లీ ప్రశ్న.. సూపర్బ్ రియాక్షన్స్’
కెనడా టెన్నిస్ ప్లేయర్ యూజిని బౌచర్డ్ ఆట పరంగా కాకుండా ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. బౌచర్డ్ ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో బౌచర్డ్‌కు ట్విటర్లో తెగ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె చేసే పోస్ట్‌లకు అభిమానులు క్షణాల్లోనే రియాక్ట్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. గతంలో సరదాగా చేసిన ఓ ట్వీట్ తెలియని వ్యక్తితో డేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం పందెంలో ఓడిపోవడంతో అపరిచిత వ్యక్తితో డేట్‌కు వెళ్లింది. ఈ వార్త అప్పట్లో తెగ హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ట్విటర్ వేదికగా బౌచర్డ్ అడిగిన సిల్లీ ప్రశ్నకు నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ టెన్నిస్ భామ తెగ ఉబ్బితబ్బిబవుతోంది. ఇంతకీ ఈ అమ్మడు పోస్ట్ చేసిందేమిటంటే. ‘ఆర్డర్ చేయడానికి బెస్ట్ పిజ్జా ఏంటి?’అని పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీగానే స్పందన వచ్చింది. కొందరు నిజాయితీగా తమకు నచ్చిన పిజ్జాలను సూచించారు. అయితే చాలా మంది నెటిజన్లు బౌచర్డ్‌పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేయగా ఆమె ఓపిగ్గా లైక్‌లు కొట్టారు. మరి కొందరు వ్యంగ్యంగా కామెంట్ పెడుతున్నారు. పిజ్జాలు పక్కకు పెట్టి.. ముందు ఆటపై దృష్టి పెట్టు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మరికొందరు ముందు ఒక్క టోర్నీనైనా గెలువు అని సలహాలు ఇస్తున్నారు. ‘నువ్వు టోర్నీ గెలిచి ఎంతకాలమైందో తెలుసా?’అంటూ మరికొందరు కామెంట్ చేశారు. సంచలనాలకు మారుపేరైన బౌచర్డ్ 2012లో జూనియర్ వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి వార్తల్లోకి ఎక్కింది. అనంతరం 2014లో డబ్ల్యూటీఏ టోర్నీ గెలిచి మరో సంచలనం సృష్టించింది. అదే ఏడాది యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరడంతో భవిష్యత్ టెన్నిస్ ఆమెదే అని అందరూ భావించారు. కానీ అంచనాలకు మించి ఆడకపోవడంతో కెరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ టోర్నీలో ఏదో ఒక స్టార్ క్రీడాకారిణిని మట్టికరిపిస్తోంది. గతేడాది మాడ్రిడ్ ఓపెన్‌లో రష్యా స్టార్ ప్లేయర్ మరియా షరపోవాను ఓడించటంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిందని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఒక్క టోర్నీలో కూడా ఆమె మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. -
కోర్టుకెక్కి.. పరిహారం గెలిచి..
అమెరికా టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ) నిర్లక్ష్యం కారణంగానే కెనడా టెన్నిస్ స్టార్ యూజినీ బౌచర్డ్ గాయపడిందని అమెరికా కోర్టు తేల్చింది. 2015 యుఎస్ ఓపెన్ సందర్భంగా లాకర్ రూమ్‌లో తాను జారిపడ్డానని, దాని వల్ల తన కెరీర్ దెబ్బతిందని ఆరోపిస్తూ, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని బౌచర్డ్ కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి దశ విచారణ ముగించిన కోర్టు యూఎస్టీఏను తప్పుపట్టింది. లాకర్ రూమ్‌లో బౌచర్డ్ గాయపడటంలో ఆమె తప్పు 25 శాతం కాగా.. యూఎస్‌టీఏ నిర్లక్ష్యం 75 శాతం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై బౌచర్డ్ ఆనందం వ్యక్తం చేసింది. 'కోర్టు తీర్పులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రస్తుత తీర్పుతో నేను సంతోషంగా ఉన్నాను' అని బౌచర్డ్ తెలిపింది. తుది దశ విచారణ ముగిశాక బౌచర్డ్‌కు చెల్లించాల్సిన పరిహారంపై కోర్టు తీర్పు ఇస్తుంది. కోర్టులో బౌచర్డ్ దావా కాగా, 2014 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో బౌచర్డ్ టాప్-5 లో చోటు దక్కించుకోవడంతో టెన్నిస్‌లో మరో స్టార్ రాబోతోందని టెన్నిస్ అభిమానులు అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారై బౌచర్డ్ కెరీర్ గాడి తప్పింది. ర్యాంకింగ్స్‌లో ఆమె ఏకంగా 116 వ స్థానానికి పడిపోయింది. అయితే తాను ఈ పరిస్థితికి చేరడానికి కారణం అమెరికా టెన్నిస్ సంఘం అని ఈ కెనడా స్టార్ ఆరోపించింది. 2015 యుఎస్ ఓపెన్ సందర్భంగా లాకర్ రూమ్‌లో కాలుజారి పడడంతో గాయపడ్డానని, అది తన కెరీర్‌ను దెబ్బతీసిందని ఆరోపిస్తూ.. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ యూఎస్‌టీఏ పై బ్రూక్లిన్‌లోని డిస్ట్రిక్ కోర్టులో దావా వేసింది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 2015 లో యుఎస్‌టీఏ గ్లాండ్ స్లామ్ టోర్నీని నిర్వహించింది. ఆ టోర్నీలో లాకర్ రూమ్‌లో తాను కాలు జారి కింద పడటంతో తీవ్రమైన నొప్పితో టోర్ని నుంచి వైదొలినట్టు విచారణ సందర్భంగా బౌచర్డ్ తెలిపింది. బాగా జారేలా, ప్రమాదకరంగా ఉన్న శుభ్రపరిచే పదార్థాలు వాడడం వల్లే నేను జారిపడ్డాను' అని ఆమె దావాలో పేర్కొంది. -
షరపోవా మోసగత్తె.. జీవితకాలం నిషేధమే సరి!
డోపింగ్ ఆరోపణలతో 15 నెలలు నిషేధానికి గురైన టెన్నిస్ స్టార్ మరియా షరపోవా పునరాగమనంలోనూ సత్తా చాటింది. 15 నెలల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో ఆమె విజయం సాధించింది. రాబెర్టా విన్సీని 7-5, 6-3 తేడాతో చిత్తుగా ఓడించింది. ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, మాజీ నంబర్ 1 అయిన ఆమెకు ఈ మ్యాచ్ వీక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఘనమైన స్వాగతం పలికారు. అయితే, ఆమె పునరాగమనంపై కెనడా టెన్నిస్ స్టార్ యూజినీ బౌచర్డ్ ఫైర్ అయింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన ఆమెను మళ్లీ ఆడేందుకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది. ‘ఇది సరికాదు. ఆమె ఒక మోసగత్తె. ఏ క్రీడలో అయిన మోసగాళ్లను మళ్లీ ఆడనివ్వకూడదు. ఇలా ఆడనివ్వడం ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేయడమే. ప్రపంచ టెన్నిస్ సమాఖ్య ఈ విషయంలో తప్పుడు సంకేతాలు ఇస్తోంది. మోసం చేసిన వాళ్లను కూడా తిరిగి ఘనంగా ఆహ్వానిస్తారనే తప్పుడు సంకేతాలు ఈ చర్చ వల్ల పిల్లలకు వెళ్లే అవకాశముంది. షరపోవాకు జీవితకాల నిషేధమే సరైన శిక్ష’ అని యూజినీ అభిప్రాయపడింది. షరపోవా పునరాగమనంపై పలువురు ఇతర టెన్నిస్ స్టార్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
డేటింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకుంది!
వాషింగ్టన్:ఇటీవల ట్విట్టర్ వేదికగా డేటింగ్ బెట్టింగ్ వేసి ఓటమి పాలైన కెనడా టెన్నిస్ స్టార్ ఎగునీ బౌచర్డ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. తాను వేసిన బెట్టింగ్ ప్రకారం 20 ఏళ్ల విద్యార్థి జాన్ గోహ్రెక్ తో కలిసి డేటింగ్ వెళ్లినట్లు బౌచర్డ్ తాజాగా స్పష్టం చేసింది.' నా మాట ప్రకారం అతనితో డేటింగ్ కు వెళ్లా. దానిలో భాగంగా ముందుగా అతనితో కలిసి మిల్ వాకీ-ఎన్బీఏ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ కు హాజరయ్యా. ఆ తరువాత డేటింగ్ కోసం కొన్ని స్విమ్ సూట్లు పరిశీలించా 'అని బౌచర్డ్ తెలిపింది. ఈ మేరకు జాన్ గోహ్రెక్ తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. గత నెల్లో సూపర్ బౌల్ ఈవెంట్ లో భాగంగా అమెరికా ఫుట్‌బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌచర్డ్ బెట్టింగ్ కు పాల్పడి ఓటమి పాలైంది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ వెంటనే అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్‌లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని ఆ తరువాత బౌచర్డ్ తలపట్టుకుంది. ఫిబ్రవరి 25 వ తేదీన 23 ఒడిలోకి అడుగుపెడుతున్న బౌచర్డ్.. తాను జీవితంలో చేసిన పొరపాట్లలో ఇదొక పెద్ద తప్పిదంగా పేర్కొంది. Just met my 'Super Bowl Twitter Date' John -
డేటింగ్ బెట్టింగ్‌లో ఓడిన టెన్నిస్ స్టార్!
వాషింగ్టన్: ఎగునీ బౌచర్డ్.. కెనడా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం 45 వ ర్యాంకులో కొనసాగుతున్న ఈ అందాల భామ.. ట్విట్టర్ వేదికగా బెట్టింగ్ వేసి ఓటమి పాలైంది. అందుకు ప్రతిఫలంగా అజ్ఞాత వ్యక్తితో డేటింగ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో అతి పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్‌గా సూపర్ బౌల్‌కు విశేషాదరణ ఉంది. అమెరికా స్టయిల్లో జరిగే ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే అక్కడ భలే క్రేజ్. ప్రతీ ఆటగాడు హెల్మెట్, షోల్డర్ ప్యాడ్లు ధరించి కోడిగుడ్డు ఆకారంలో ఉండే బాల్‌తో సూపర్ బౌల్ ను ఆడతారు. మ్యాచ్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనల కోసం కోట్లాది రూపాయిలు చెల్లిస్తారు. ఇదిలా ఉంచితే ఇది బెట్టింగ్‌లకు కూడా అతి పెద్ద వేదికగానే చెప్పొచ్చు. కొంతమంది నేరుగా బెట్టింగ్‌లు వేసుకుంటే, మరికొంతమంది సోషల్ మీడియాలో బెట్టింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనిలో భాగంగా అమెరికా ఫుట్‌బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌచర్డ్ బెట్టింగ్ వేసి ఓటమి చెందింది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్‌లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని బౌచర్డ్ తలపట్టుకుంది. ఇదిలా ఉంచితే బెట్టింగ్ వేసి గెలిచిన జాన్.. బౌచర్డ్ కు వీరాభిమాని. ప్రస్తుతం చేసేదేమీ లేని బౌచర్డ్ త్వరలో అతనితో కలిసి డేటింగ్ చేయడానికి సిద్ధమైంది. -
అంతకు ముందు.. ఆ తర్వాత!
అద్భుతాలు జరిగేటప్పుడు చాలా సార్లు సాక్షాలు ఉండవు. అవి సంభవించిన తర్వాతే అందరూ వాటిని గమనిస్తారు. అద్భుతాలు సాధించే వ్యక్తుల విషయంలో కూడా ప్రపంచం ఇలాగే వ్యవహరిస్తుంటుంది. వారు ప్రపంచానికి పరిచయమై, పరిచయం కాని వ్యక్తుల్లా ఉంటారు. అలాంటి వ్యక్తులు... సందర్భాలు ఇవి.. ఎగెనీ బుచార్డ్ టెన్నిస్ కోర్టులో ఆటతీరుతోనే గాక తన అందంతో కూడా సరికొత్త సంచలనంగా మారిన ప్లేయర్ ఎగెనీ బుచార్డ్. ప్రస్తుతం డబ్ల్యూటీవో ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న బుచార్డ్ వెలుగులోకి వచ్చాక ఒక కొత్త సంగతి ప్రచారంలోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఈ కెనడియన్ టీనేజర్, రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవాతో కలిసి ఫోటోలు దిగిందట. అప్పటికి యువ క్రీడాకారిణిగా షరపోవా అభిమానిగా ఎగెనీ ఆ పని చేసింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో షరపోవాతో కలిసి బరిలోకి దిగింది! ఒకప్పుడు అనామకురాలిగా షరపోవా పక్కన నిలబడి ఇప్పుడు ఆమెస్థాయి క్రీడాకిరిణి కావడం అద్భుతమే కదా! మెగాన్ ఫాక్స్ యువత కలల రాణిగా ఇమేజ్ను కలిగిన మెగాన్ఫాక్స్ నటిగా పేరు తెచ్చుకోక ముందే మీడియా ద్వారా అనేక మందికి పరిచయం. మెగాన్ఫాక్స్ తన స్నేహితురాళ్లతో కలిసి తీయించుకొన్న ఫోటోలు ఒక మ్యాగజీన్ కవర్ పేజ్ పై పడ్డాయి. ఆ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయి అంతటితో వదిలేసిందామె. అయితే ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్ ఆమె కెరీర్ అయ్యింది. నటిగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది! సచిన్ టెండూల్కర్ ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం ఎన్నో అద్భుతాలకు వేదిక. ప్రపంచకప్ మ్యాచ్‌లతో సహా ఎన్నో గొప్ప క్రికెట్ పోరాటాలకు ఇది కేంద్రంగా నిలిచింది. ఈ స్టేడియంకు సంబంధించిన మరో అద్భుతం ఏమిటంటే... ఇదే స్టేడియంలో సచిన్ ప్రస్థానం మొదలైంది. క్రికెటర్‌గా కాదు.. బాల్ బాయ్‌గా. సచిన్ పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా చేసేవాడు. బౌండరీ రోప్ ఆవలకు బంతి వచ్చినప్పుడు దాన్ని అందించేవాడు. పాత మ్యాచ్‌లకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌లో కూడా బుల్లి సచిన్‌ను చూడవచ్చు! శాండ్రాబులాక్ ఈ అమెరికన్ హాలీవుడ్ నటి, నిర్మాత కూడా ఒకనాటి ఉల్లాసినే. చీర్‌లీడర్‌గా బేస్‌బాల్, వాలీబాల్ ఆటగాళ్లను, వీక్షకులను ఉల్లాసపరిచిన వ్యక్తే. అలాంటి ఉత్సాహమే క్రమంగా ఈమె నటిగా మారడానికి కారణం అయ్యింది. మడోన్నా ఆమెను చూసినా, గొంతును విన్నా.. ఆమె తన వయసును తప్పుగా చెబుతున్నారనే అభిప్రాయం కలుగుతుంది. దాదాపు 35 యేళ్ల నుంచి ఒకే పాపులారిటీతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది మడోన్నా. అంతకు ముందు కూడా (పాప్‌స్టార్‌గా పేరు తెచ్చుకోక ముందు) మడోన్నా మీడియా గర్లే! మ్యూజిషియన్ అవడానికి మునుపు ఈ పాప్తరంగం స్టేడియంలో చీర్‌గర్ల్‌గా చేసేది. తన తోటి వారితో కలిసి క్రీడాకారులను ఉత్సాహపరిచే బాధ్యతలో ఉండేది! -
ఫైనల్లో క్విటోవా, బౌచర్డ్
సెమీస్‌లో పేస్ జోడి మిక్స్‌డ్‌లో సానియా ద్వయం ఓటమి లండన్: మూడేళ్ల తర్వాత మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా... వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో 6వ సీడ్ క్విటోవా (చెక్) 7-6 (8/6), 6-1తో 23వ సీడ్ లూసి సఫరోవా (చెక్)పై విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 24 విన్నర్స్, 8 ఏస్‌లతో ప్రత్యర్థిని వణికించింది. బలమైన గ్రౌండ్ స్ట్రోక్‌లను సంధిస్తూ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి గేమ్‌లో సఫరోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే వెంటనే తేరుకున్న సఫరోవా నాలుగో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచింది. టైబ్రేక్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన క్విటోవా తొలి సెట్ పాయింట్‌ను చేజార్చుకున్నా... ఈ అవకాశాన్ని సఫరోవా సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరకు బలమైన విన్నర్‌తో ఆరోసీడ్ ప్లేయర్ సెట్‌ను ముగించింది. రెండోసెట్ రెండో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. ఆరో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో 13వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (5), 6-2తో 3వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచింది. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి కెనడా మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గంటా 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని విజయం సాధించింది. రెండోసెట్లో బ్రేక్ పాయింట్ వద్ద హలెప్ డబుల్ ఫాల్ట్ చేయడం బౌచర్డ్‌కు కలిసొచ్చింది. సెమీస్‌లో పేస్ జోడి పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) జోడి 3-6, 7-6 (5), 6-3, 6-4తో మూడోసీడ్ నెస్టర్ (కెనడా)-జిమోన్జిక్ (సెర్బియా)పై నెగ్గి సెమీస్‌కి చేరింది. మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా (భారత్)-టెకాయు (రొమేనియా) ద్వయం 5-7, 3-6తో జెమీ ముర్రే (బ్రిటన్)-డెల్లాక్వా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.