డేటింగ్ బెట్టింగ్లో ఓడిన టెన్నిస్ స్టార్! | Eugenie Bouchard Has a Date With Stranger After Losing Super Bowl Tweet Bet | Sakshi
Sakshi News home page

డేటింగ్ బెట్టింగ్లో ఓడిన టెన్నిస్ స్టార్!

Published Tue, Feb 7 2017 12:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

డేటింగ్ బెట్టింగ్లో ఓడిన టెన్నిస్ స్టార్!

డేటింగ్ బెట్టింగ్లో ఓడిన టెన్నిస్ స్టార్!

వాషింగ్టన్: ఎగునీ బౌచర్డ్.. కెనడా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం 45 వ ర్యాంకులో కొనసాగుతున్న ఈ అందాల భామ.. ట్విట్టర్ వేదికగా బెట్టింగ్ వేసి ఓటమి పాలైంది. అందుకు ప్రతిఫలంగా అజ్ఞాత వ్యక్తితో డేటింగ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో అతి పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్గా సూపర్ బౌల్కు విశేషాదరణ ఉంది. అమెరికా స్టయిల్లో జరిగే ఈ ఫుట్బాల్ మ్యాచ్ అంటే అక్కడ భలే క్రేజ్.  ప్రతీ ఆటగాడు హెల్మెట్, షోల్డర్ ప్యాడ్లు ధరించి కోడిగుడ్డు ఆకారంలో ఉండే బాల్తో సూపర్ బౌల్ ను ఆడతారు. మ్యాచ్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనల కోసం కోట్లాది రూపాయిలు చెల్లిస్తారు. ఇదిలా ఉంచితే  ఇది బెట్టింగ్లకు కూడా అతి పెద్ద వేదికగానే చెప్పొచ్చు. కొంతమంది నేరుగా బెట్టింగ్లు వేసుకుంటే, మరికొంతమంది సోషల్ మీడియాలో బెట్టింగ్లకు పాల్పడుతుంటారు.

దీనిలో భాగంగా అమెరికా ఫుట్బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్లో బౌచర్డ్ బెట్టింగ్ వేసి ఓటమి చెందింది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా  బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని బౌచర్డ్ తలపట్టుకుంది. ఇదిలా ఉంచితే బెట్టింగ్ వేసి గెలిచిన జాన్.. బౌచర్డ్ కు వీరాభిమాని. ప్రస్తుతం చేసేదేమీ లేని బౌచర్డ్ త్వరలో అతనితో కలిసి డేటింగ్ చేయడానికి సిద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement