super bowl
-
అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం
కాన్సాస్ సిటీ: అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం కాన్సాస్ సిటీలో కాల్పులు చోటు చేసుకు న్నాయి.. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది చిన్నారులు సహా మరో 22 మంది గాయాలపాలయ్యారు. బుధవారం సూపర్ బౌల్ చాంపియన్ షిప్ గెలుచుకున్న జట్టు విజయోత్సవాలు జరుపుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. దీంతో జనమంతా భయంతో కేకలు వేస్తూ తలోదిక్కుకు పరుగులు తీయడంతో అంతా గందరగోళంగా మారింది. కాల్పులకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో.. రాజధాని వాషింగ్టన్లో బుధవారం ఉదయం పోలీసు అధికారులు జంతు హింస కేసులో జూలియస్ జేమ్స్ అనే వ్యక్తికి వారెంట్లు ఇచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతడు ఇంట్లో ఉండే పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అమెరికాలో రైతుల యాడ్: భారత్‌లో దుమారం
కాలిఫోర్నియా: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం అంతర్జాతీయ స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇటీవల హలీవుడ్ నటులు, ఇతర దేశాల నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు తెలపడంతో ప్రపంచ స్థాయిలో రైతు ఉద్యమంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పది కోట్ల మంది చూస్తున్న ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో రైతుల ఆందోళనకు సంబంధించి ప్రకటన వచ్చింది. రైతులకు అండగా ఉందామని ఆ ప్రకటన పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. అమెరికాలో జాతీయ ఫుట్‌బాల్ వార్షిక చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘సూపర్ బౌల్-2021’ కార్యక్రమం నిర్వహించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో సిటీలో ఫిబ్రవరి 7వ తేదీన ఆ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. కొన్ని కోట్ల మంది చూసే ఈవెంట్లో భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించి ప్రకటన (యాడ్) ప్రసారమైంది. ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. 30 సెకన్ల పాటు ప్రసారమైన ఈ యాడ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలతో ప్రారంభమైంది. చరిత్రలో సుదీర్ఘమైన పోరాటంగా రైతుల ఉద్యమమని ఆ యాడ్‌లో పేర్కొన్నారు. ‘రైతులు లేకుంటే తిండి లేదు.. భవిష్యత్ ఉండదు.. రైతులకు అండగా నిలబడదాం’ అని సందేశాలు ఆ యాడ్‌లో ఉన్నాయి. 2020 నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మొదలైందని చెబుతూ ఫొటోలు, వీడియాలతో యాడ్ ప్రసారమైంది. ‘మేము రైతులం’ అని మొదలైన ఈ యాడ్‌లో ఆరు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమంలో జరిగిన పరిణామాలు వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘన, మృతులు, ఎంతమంది రైతులు ఉన్నారో వివరిస్తూ ఆ యాడ్ కొనసాగింది. అయితే ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లో ప్రకటన ఇవ్వాలంటే కనీసం రూ.36 కోట్ల నుంచి రూ.44 కోట్లు ఖర్చవుతుంది. అంత ఖర్చు చేసి ఎవరు ఆ యాడ్ వేయించారోనని ఆసక్తికర చర్చ జరిగింది. వాలీ సిక్ కమ్యూనిటీ నిధులు ఈ యాడ్‌కు వెచ్చించారని సమాచారం. ఈ యాడ్ ప్రసారంపై భారతదేశంలో వివాదం రేగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే హాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు రైతుల ఆందోళనలపై స్పందిస్తే భారత్ ఆగ్రహం వ్యక్తం చేసి ‘ఇది మా అంతర్గత సమస్య’ అని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు దాదాపు పది కోట్ల మందికి పైగా చూసే ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో రైతుల ఆందోళన చర్చ రావడం ఆసక్తికరంగా మారింది. దీనిపై మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. Here’s the Super Bowl ad featuring the Farmers Protest If you haven’t heard about it yet, now is the time to learn. It’s an issue of injustice that affects all of us. pic.twitter.com/a0WRjIAzqF — Simran Jeet Singh (@simran) February 7, 2021 View this post on Instagram A post shared by Teji Video (@tejivideo) -
డేటింగ్ బెట్టింగ్‌లో ఓడిన టెన్నిస్ స్టార్!
వాషింగ్టన్: ఎగునీ బౌచర్డ్.. కెనడా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం 45 వ ర్యాంకులో కొనసాగుతున్న ఈ అందాల భామ.. ట్విట్టర్ వేదికగా బెట్టింగ్ వేసి ఓటమి పాలైంది. అందుకు ప్రతిఫలంగా అజ్ఞాత వ్యక్తితో డేటింగ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో అతి పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్‌గా సూపర్ బౌల్‌కు విశేషాదరణ ఉంది. అమెరికా స్టయిల్లో జరిగే ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే అక్కడ భలే క్రేజ్. ప్రతీ ఆటగాడు హెల్మెట్, షోల్డర్ ప్యాడ్లు ధరించి కోడిగుడ్డు ఆకారంలో ఉండే బాల్‌తో సూపర్ బౌల్ ను ఆడతారు. మ్యాచ్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనల కోసం కోట్లాది రూపాయిలు చెల్లిస్తారు. ఇదిలా ఉంచితే ఇది బెట్టింగ్‌లకు కూడా అతి పెద్ద వేదికగానే చెప్పొచ్చు. కొంతమంది నేరుగా బెట్టింగ్‌లు వేసుకుంటే, మరికొంతమంది సోషల్ మీడియాలో బెట్టింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనిలో భాగంగా అమెరికా ఫుట్‌బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌచర్డ్ బెట్టింగ్ వేసి ఓటమి చెందింది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్‌లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని బౌచర్డ్ తలపట్టుకుంది. ఇదిలా ఉంచితే బెట్టింగ్ వేసి గెలిచిన జాన్.. బౌచర్డ్ కు వీరాభిమాని. ప్రస్తుతం చేసేదేమీ లేని బౌచర్డ్ త్వరలో అతనితో కలిసి డేటింగ్ చేయడానికి సిద్ధమైంది. -
'షో' ముందు భార్యకు 10వేల రోజాలు పంపాడు!
లాస్ఏంజిల్స్: అర్ధాంగి మీద ప్రేమ అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు ర్యాపర్ జే జెడ్. ప్రాణప్రదమైన తన భార్య బియాన్సే 'సూపర్ బోల్-50'లో ప్రదర్శన ఇస్తున్న సందర్భంగా ఊహించని ఆశ్చర్యంలో ఆమెను ముంచేత్తాడు. షోకు ముందు ఏకంగా తన భార్యకు పదివేల గులాబీపూలు కానుకగా పంపాడు. సాంట్ కార్లాలో లెవిస్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన 'సూపర్ బోల్ -50'లో పాప్ స్టార్ బియాన్సే తన ప్రదర్శనతో దుమ్మురేపింది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు ముందు తన భార్యపై ప్రేమను చాటుతూ ఆమెకు పదివేల గులాబీలతో జే జెడ్ శుభాభినందనలు తెలిపాడు. మరోవైపు 'సూపర్ బోల్' మ్యూజిక్ షోలో ఆద్యంతం తన సంగీత, నృత్య విన్యాసాలతో అదరగొట్టిన పాప్ సింగర్ బియాన్సే ఆకట్టుకుంది. బ్లాక్ పాంథర్స్ పార్టీకి మద్దతుగా ఆమె ఈ షోలో ఓ ప్రదర్శన ఇవ్వడం సంచలనం సృష్టించింది. -
అమెరికాలో 'సూపర్ బౌల్' ఫీవర్
వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే ఇరు దేశాల్లోనూ ఒక్కటే ఉత్కంఠ. క్రికెట్ అభిమానులు ఆ రోజు ఇతర పనులు పక్కనబెట్టి టీవీలకు అతుక్కుపోతారు. ఇక స్టేడియానికయితే బారులు కడతారు. ఆదివారం అమెరికాలోనూ ఇలాంటి సన్నివేశమే కనిపించింది. ఆ దేశంలో ఏడాదిలో అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్‌గా భావించే 'సూపర్ బౌల్' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అమెరికా స్టయిల్లో జరిగే ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే భలే క్రేజ్. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సహా కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా తిలకించారు. బారక్ ఒబామా అధికార నివాసం వైట్‌హౌస్ నుంచే మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఫుట్‌బాల్ ఆడుతున్నట్టుగా ఉన్న తన ఫొటోను ఒబామా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక అమెరికా వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ రోజున మ్యాచ్‌ను చూస్తూ ఏకంగా ఐదు కోట్ల కేసుల బీర్లు తాగేశారు. ఇక చికెన్ కూడా అదే స్థాయిలో లాగించేశారు. సూపర్ బౌల్లో ఇతర మ్యాచ్‌ల మాదిరిగా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడరు. ప్రతీ ఆటగాడు హెల్మెట్, షోల్డర్ ప్యాడ్లు ధరిస్తారు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే బాల్‌ను వాడుతారు. మ్యాచ్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనల కోసం కోట్లాది రూపాయిలు చెల్లిస్తారు.