జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన భాగస్వామి కోర్డె అమరి బ్రూక్స్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై అతడితో సంబంధం లేదు. అంతా ముగిసినట్లే’ అని ఒసాకా సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టం చేసింది.
వేర్వేరు దారుల్లో పయనం
ఈ మేరకు.. ‘పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అతడిపై విమర్శలు చేసేందుకు కూడా లేదు.కోర్డె గొప్ప వ్యక్తి. అంతకుమించి అద్భుతమైన తండ్రి. వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఎన్నో నేర్చుకున్నా. నా కుమార్తె అతిపెద్ద ఆశీర్వాదం’ అని ఒసాకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాగా ఒసాకా ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక తాజా సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. 2019 నుంచి కోర్డె- నయోమి ఒసాకా సహజీవనం చేస్తున్నారు. ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోర్డెతో కలిసి 27 ఏళ్ల ఒసాకా 2023లో ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా జనవరి 12 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ మొదలుకానుంది.
మరిన్నిక్రీడా వార్తలు
సహజ శుభారాంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల డబ్ల్యూ75 టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో సహజ 6–3, 7–5తో పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.
ఒక గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఏడు ఏస్‌లు సంధించింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 76 పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
అయితే, డబుల్స్ విభాగంలో సహజ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. సహజ (భారత్)–దరియా అస్తకోవా (రష్యా) ద్వయం 3–6, 3–6తో నయీమా కరామోకు (స్విట్జర్లాండ్)–ఇనెస్ ఇబు (అల్జీరియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
కళింగ లాన్సర్స్ చేతిలో బెంగాల్ టైగర్స్ చిత్తు
రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో కళింగ లాన్సర్స్ భారీ విజయాన్ని అందుకుంది. లాన్సర్స్ 6–0 గోల్స్‌తో బెంగాల్ టైగర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా... 2 గోల్స్ పెనాల్టీ కార్నర్‌ల ద్వారా వచ్చాయి. లాన్సర్స్ తరఫున థియరీ (3వ నిమిషం, 47వ నిమిషం), సంజయ్ (4వ నిమిషం), హెన్‌డ్రిక్ (6వ నిమిషం), బండూరన్ (29వ నిమిషం), బాబీ సింగ్ ధామీ (49వ నిమిషం) గోల్స్ సాధించారు.
తొలి క్వార్టర్స్‌లో 3 గోల్స్‌తో ముందంజ వేసిన లాన్సర్స్‌ను తర్వాతి రెండు క్వార్టర్‌లలో కొంత వరకు నిలువరించడంలో టైగర్స్ సఫలమైంది. అయితే చివరి క్వార్టర్‌లో కూడా మరో రెండు గోల్స్‌తో కళింగ తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లలో తమిళనాడు డ్రాగన్స్‌తో గోనాసిక వైజాగ్...యూపీ రుద్రాస్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment