
Samantha Goa Trip With Friends Ahead Of New Year, Pics Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం రూటు మార్చిన సమంత సినిమాల విషయంలో మరింత దూకుడు పెంచింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్‌కు పయనమవుతుంది. తాజాగా యశోద షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ గోవాకి చెక్కేసింది. తన బెస్ట్‌ఫ్రెండ్ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ని ఎంజాయ్ చేస్తుంది.
దీనికి సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఇటీవలె ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటూ హాట్ పర్ఫార్మెన్స్‌తో హెడ్‌లైన్స్‌లో నిలిచిన సామ్ తాజాగా బికినీలో స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.