
Samantha Char Dham Yatra: సమంత చార్‌ధామ్ యాత్ర ముగిసింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధలోంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు
ఇక యమునోత్రి నుంచి మొదలైన చార్‌ధామ్ యాత్ర గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అక్కడి ఎన్నో విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అక్కడ స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది.
అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక చార్ ధామ్ యాత్ర అద్భుతంగా సాగిందని సామ్ పేర్కొంది.
చదవండి: కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి
డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్