Trip
-
అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్‌లో చిల్ అవుతూ! (ఫొటోలు)
-
వావ్.. పదహారేళ్ల పడతిలా అబుదాబీ బీచ్‌లో స్టార్ సింగర్
-
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవులు ట్రిప్? (ఫొటోలు)
-
స్విట్జర్లాండ్ లో రాయ్ లక్ష్మీ సిజ్లింగ్ ఫోటోలు
-
ఇండోనేషియాలో బిగ్ బాస్ బ్యూటీ జిల్ జిల్ జిగా.. (ఫొటోలు)
-
కాంబోడియాలోని అతిపెద్ద దేవాలయంలో నటి హిమజ (ఫొటోలు)
-
'కల్కి' రిలీజ్‌కి రెడీ.. ఇంతలోనే ప్రభాస్ ఫారెన్ టూర్.. కారణమదేనా?
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్స్.. స్టోరీ ఏంటనేది ఆల్మోస్ట్ రివీల్ చేశాయి. ముంబయిలో ఈవెంట్ చేశారు గానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివేం లేవు. దీనిబట్టి చూస్తే ఇక ఈవెంట్స్ ఏం లేనట్లే. రిలీజ్‌కి మరో ఐదారు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ ఫారెన్ టూర్ వెళ్లబోతున్నాడట.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'ప్రభాస్.. తన ప్రతి సినిమా విడుదలకు ముందు విదేశాలకు వెళ్తుంటాడు. గతంలో 'సలార్' రిలీజ్‌కి ముందు ఇటలీ వెళ్లినట్లు గుర్తు. ఇప్పుడు 'కల్కి' థియేటర్లలో రావడానికి ముందు మాత్రం యూరప్ వెళ్లబోతున్నాడట. ఇండస్ట్రీలో దీని గురించి టాక్ వచ్చింది గానీ ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.'బాహుబలి' తర్వాత గతేడాది రిలీజైన 'సాహో'తో మాత్రం ప్రభాస్ హిట్ కొట్టాడు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' మూవీస్.. ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో ఫెయిలయ్యాయి. దీంతో అందరికీ 'కల్కి'పై అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉంది. మరి ప్రభాస్ ఈసారి ఏం చేస్తాడో తెలియాలంటే శుక్రవారం వరకు ఎదురుచూడాల్సిందే?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?) -
US: అమెరికాలో తప్పక చూడాల్సిన ఐదు ప్రదేశాలివే!
ఇండియా నుండి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లే వాళ్ళను విమానాశ్రయాల్లో గమనిస్తే మూడుకాళ్ళ ముసలివాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. ఇలాంటి వారికి వేలాది మైళ్ళ ప్రయాణం చేయగలిగే శక్తి ఉత్సాహలనిచ్చే అసలు అదృశ్యశక్తి దూర దేశాల్లోకి అంతర్జాలమే వాహనంగా దూరిపోయిన మన ఎన్ఆర్ఐ పిల్లలదేనన్నది నిస్సందేహం. హార్డ్‌వేర్ బతుకుల్లో సాఫ్ట్వేర్ పిల్లలు పండు ముదుసళ్లకు తప్పని ఫారిన్ ట్రిప్పులు ! ఎందుకు నాయనా ఈ వయసులో మాకు శ్రమ! అని ఆమ్మో నాన్నో తప్పించుకోజూస్తే.. ‘అలాకాదు మా చదువుల కోసం మీరు చేసిన అప్పులకు, పగలనకా రాత్రనకా కష్టపడి పనిచేసి మేము కూడబెట్టిన ఆస్తులకు, త్వరలోనే వారసులు రాబోతున్నారు కాబట్టి తప్పక రండి, మీరూ వాళ్ళ సేవ చేసుకొని తరించవచ్చు’ అంటారు. అలాంటిదే ఒక సేవా సందర్భం 2013లో నాకూ వచ్చింది. అప్పటి వరకు మాతో హైదరాబాద్ లోనున్న మూడేళ్ల మా మనవడిని అప్పుడు లాస్ ఎంజీల్స్లోనున్న మా అబ్బాయి దగ్గర దింపిరావడానికి ఆగష్టు 17న నేను అమెరికా బయలుదేరి వెళ్ళాను. గమ్యం చేరేవరకు ప్రతి ఎయిర్‌పోర్టులో అధికారులతో నేను పదే పదే ఎదుర్కున్న ప్రశ్న.. మా మనవడి గురించి.! మీ దగ్గర ‘పేరెంట్స్ పర్మిషన్, వాలిడ్ డాకుమెంట్స్ ఉన్నాయా లేవా ? ’ అని. మా జర్నీలో ఫ్లయిట్ మారినప్పుడల్లా కనబడ్డ ప్రతి టాయ్ కావాలని చేస్తున్న మా మనవడి డిమాండ్స్ అయిష్టంగానైనా ఒకటీ అరా తీరుస్తూ ఎలాగైతేనేం ఎట్టకేలకు లాస్ ఎంజీల్స్ చేరి అప్పగింతలు పూర్తిచేశా. నాలాంటి వాడిని అమెరికా వెళ్లి ఏం చేశారని ఎవ్వరూ అడగరు, ఏం చూశారన్నదే ముఖ్యమైన ప్రశ్న. నా లెక్కకు అందరూ అడిగే ఈ ఐదు చూసేస్తే అమెరికా యాత్ర పూర్తయినట్లే. 1 ) ఆ దేశ స్వాతంత్య్రానికి ప్రతీకయైన న్యూయార్క్‌లోని స్టాచ్యు అఫ్ లిబర్టీ 2 ) వాషింగ్టన్ డి సి లోని అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధం అదే వైట్ హౌస్ 3 ) కాలిఫోర్నియాలోని హాలీవుడ్ సినీ ప్రపంచం 4 ) పిల్లల ప్రపంచం డిస్నిల్యాండ్ 5) నిద్రపోని నగరం క్యాసినోల ప్రపంచం లాస్ వేగాస్ను మరిచిపోయానంటారేమో, నా లాంటివాడు అటు వెళ్తే ఉన్న ఆరోగ్యమే కాదు పొదుపు చేసి పెట్టుకున్న పెన్షన్ డబ్బులు కూడా పోతాయేమోనని భయం. లాస్ ఏంజెల్స్ ఒకప్పుడు మెక్సికోలో భాగం, దీన్ని ఓ ఒప్పందం పేరిట 1848లో అమెరికా తీసేసుకున్నదట. లాస్ ఎంజీల్స్లో ఉన్నాను కాబట్టి అక్కడి హాలీవుడ్ సినీ ప్రపంచాన్ని చుట్టేసాను, యూనివర్సల్ స్టూడియోలో ఒక రోజంతా గడిపాను. అటునుండే వెళ్లి పిల్లలతో డిస్నీల్యాండ్ లో ఆడుకొని వచ్చాను. నేను అక్కడ ఉన్నప్పుడే అప్పటివరకు స్కెచర్స్ లో పనిచేస్తున్న మా అబ్బాయికి ఒరాకిల్ పోర్టులాండ్‌లో అవకాశం రావడంతో ముల్లెమూటా సర్దుకొని అక్కడి నుండి మారాల్సి వచ్చింది. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ నుండి పోర్టులాండ్ ( ఒరెగాన్ ) దూరం దాదాపు 900 మైళ్లు. అందరమూ కారులో వెళదామన్నాడు మా అబ్బాయి. నేషనల్ హైవె మీద దాదాపు 350 మైళ్లు, 7 గంటల డ్రైవ్ తర్వాత మేము శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేసాము. ఇదే విమానంలో వచ్చుంటే ఫ్లయిట్ జర్నీ గంటకు మించదు. 1906లో వచ్చిన తీవ్రమైన భూకంపంలో శాన్ ఫ్రాన్సిస్కో దాదాపు మూడు వంతులు దెబ్బతిందట. మళ్ళీ పునర్ నిర్మించుకున్న ఈ నగరం ఒకప్పుడు హిప్పీ సంస్కృతికి తర్వాతి కాలంలో స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమానికి పేరు గాంచింది. ఇంకా దాదాపు 550 మైళ్లు వెళితే గానీ మేము గమ్యం చేరలేము. పిల్లలు అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల, వాళ్ళను మరునాడు ఫ్లయిట్ ఎక్కించి మా అబ్బాయి నేను మాత్రం ఇక్కడి ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూస్తూ పోర్ట్ ల్యాండ్ బాట పట్టాము. ఈ నేషనల్ హైవే 101 అంతా ఘాట్ రోడ్డు, ప్రయాణంలో ఎన్నో పదనిసలు. కుటుంబం నుంచి జాతీయ అంతర్జాతీయ రాజకీయాల వరకు అన్నీ మాట్లాడుతూ, ప్రతి 50-60 మైళ్లకు ఒకచోట హైవేల పక్కనున్న రెస్ట్ ఏరియాల్లో కాస్సేపు విశ్రమిస్తూ చేసిన దాదాపు పది గంటల ప్రయాణం తర్వాత మేము పోర్ట్ ల్యాండ్ చేరుకున్నాము. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు బాగా నచ్చినవి ప్రయాణికులు సేద దీరడానికి రెస్ట్ రూంలు. వీటిలో రెస్టారెంట్ల నుంచి ప్లే ఏరియా వరకు అన్ని సౌకర్యాలున్న ‘ రెస్ట్ ఏరియాలు ’ అవే విశ్రాంత ప్రాంతాలు ఎలాంటి బడలికనైనా అట్టే మాయం చేస్తాయి. అందుకే వేల కిలోమీటర్ల (మైళ్ల) దూరాన్ని సునాయసంగా లాగించేస్తుంటారు అమెరికన్లు. హోటళ్ల తరహాలోనే అన్ని సౌకర్యాలుంటాయి, పైగా ఇవి మోటారిస్టుల కోసం కాబట్టి వీటిని మోటళ్లు అంటారు. తక్కువ ఖర్చులో అవసరమైనవన్నీ ఇక్కడ లభిస్తాయి. అందుకే సగటు అమెరికన్లు ఏడాదిలో కనీసం 30 రోజులు ప్రయాణాల్లో ఉంటారట.! --వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో తప్పకుండా చూడాల్సిన అయిదు ఏంటంటే?) -
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్‌మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్‌యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమరావతిలో ధ్వనించిన సామాజిక సాధికారత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యం కళ్లకు కట్టింది. అమరావతి జనసంద్రం అయింది. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తరలిరాగా కృష్ణాతీరాన అమరేశ్వరుడి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన సభకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్ చేస్తున్న మేలును వివరించినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం : మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి రజిని మాట్లాడుతూ.. మహిషాసురుడ్ని సంహరిస్తే దసరా, నరకాసురుడిని సంహరిస్తే దీపావళి చేసుకుంటామని, తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలని, ఆ సంబరాన్ని ఏమని పిలవాలని అన్నారు. ఆ ఉత్సవాలే సామాజిక సాధికారత అని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచి్చన ఘనత సీఎం జగనన్నకే సొంతమన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టతో ప్రభుత్వ వైద్యులు గ్రామానికే వచ్చి సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క స్కూల్ బాగు చేయాలన్న ఆలోచనే చేయలేదని, ఆఖరికి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా సొమ్ము చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటా : అలీ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనితర సాధ్యమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటానన్నారు. పెద్దగా చదువుకోని తనకే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ బాషలు వచ్చని, మన పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదా? మాట్లాడకూడదా? అని ప్రశి్నంచారు. మారుతున్న ప్రపంచంతోపాటే మన పిల్లలు కూడా మారాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొట్టమొదటి నేత వైఎస్ జగన్ అని చెప్పారు. పెత్తందారీ వ్యవస్థకు సీఎం జగన్ ఒక సవాలుగా నిలబడ్డారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల ఓట్ల కోసం మాయమాటలు చెప్పాయని, సీఎం జగన్ మాత్రం ఈ వర్గాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. చంద్రబాబు బడుగుల జీవితాలను వెక్కిరించారని, మనం ఇంగ్లిష్ మీడియం చదివితే పోటీకి వస్తారని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా, సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతి కోసం బాబు పన్నాగాలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శంకరరావు, మహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జగనే రావాలి.. జగనే కావాలి -
Anupama Parameswaran : ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కు చెక్కేసిన కేరళ కుట్టి (ఫోటోలు)
-
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్‌కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్‌ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
Janhvi Kapoor Paris Holiday: పారిస్‌లో చిల్ అవుతోన్న దేవర భామ జాన్వీ కపూర్! (ఫొటోలు)
-
చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు
ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. భారత్ మండిపాటు.. ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. అరుణాచల్ మాదే.. ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్‌లోని అరుణాచల్‌ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..? -
భద్రకాళి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు..
తిరువనంతపురం: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. గత బుధవారమే విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరింది. ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్.. కేరళ, తిరువనంతపురంలోని పౌర్ణమికవు-భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్ని అమ్మవారికి ప్రార్థనలు చేశారు. #WATCH | Kerala: ISRO chief S Somanath offers prayers at Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram. pic.twitter.com/8MjqllHeYb — ANI (@ANI) August 27, 2023 'చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించగల సామర్థ్యాన్ని మనకు ఉంది. అంతరిక్ష రంగం ఇంకా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి.. అదే మా లక్ష్యం. ప్రధాని మోదీ అందించిన దార్శనికతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం' అని సోమనాథ్ అన్నారు. బుదవారం భారతదేశ అంతరిక్షయాన చరిత్రలో లిఖించతగ్గ రోజుగా మారింది. చంద్రునిపై కాలుమోపిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా రికార్డ్ సృష్టించాం. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్‌గా కూడా పేరుపెట్టారు ప్రధాని మోదీ. చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదీ చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
OceanGate: మళ్లీ ఛలో టైటానికా? సిగ్గుండాలి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అండర్‌వాటర్ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని పదిరోజులు గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దమురారండి అంటూ యాడ్స్‌తో మళ్లీ ఊదరగొడుతోంది. అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానమంటూ తాజాగా ఓషన్‌గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒక వైపు శకలాలను బయటకు తీసుకురావడం.. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్‌గేట్ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? మరేయిత సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే.. టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్‌ను తొలగించింది ఓషన్‌గేట్. టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్‌గేట్ ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే కదా. కానీ, అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్‌ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్‌ల తరహా రిమోట్‌కంట్రోల్‌తో టైటాన్‌ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్‌తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ. ఇదీ చదవండి: ఐదు కోట్ల మందికి మూడేసి చొప్పున పుట్టిన తేదీలు! -
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్‌గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్...
-
యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్
అనంతపురం డెస్క్ : మనం బైక్‌పై వంద, రెండు వందల కిలోమీటర్లు తిరగ్గానే బాగా అలసిపోతాం. బైక్‌లో కంటే బస్సులోనో, రైల్లోనో వెళ్లి ఉంటే బాగుండేదని అనుకుంటాం. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. బైక్‌పై దేశాన్ని చుట్టేయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. ఒకట్రెండు కాదు..ఏకంగా 177 రోజులు బైక్‌యాత్ర చేపట్టాడు. 10,020 కిలోమీటర్ల సుదీర్ఘదూరం ప్రయాణించాడు. అందరితో శభాష్ అనిపించుకున్న ఆ యువకుడే నార్పల మండల కేంద్రానికి చెందిన యనమచింతల బాలకృష్ణ అలియాస్ బాలు. ఆసక్తే ముందుకు నడిపించింది.. బాలు తల్లిదండ్రులు నార్పలలో హోటల్ నిర్వహిస్తున్నారు. అతను కూడా మొబైల్ సర్వీస్ సెంటర్‌తో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చదివినప్పటికీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. బైక్‌పై సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రదేశాలకు వెళ్లిరావడం హాబీగా మలచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో రామేశ్వరం, ఊటీతో పాటు కర్ణాటకలోని పలు ప్రదేశాలను బైక్‌పై వెళ్లి చూసొచ్చాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి కూడా వెళ్లాడు. ఈ కోవలోనే లడఖ్ యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందాడు. సెకండ్ హ్యాండ్ బైక్‌పై యాత్ర బాలు లడఖ్ యాత్రకు అపాచీ 200 సీసీ సెకండ్ హ్యాండ్ బైక్ పై 2022 జూలై 13న నార్పల నుంచి బయలుదేరాడు. మొదట శ్రీశైల మల్లన్నను దర్శించుకుని యాత్ర కొనసాగించాడు. హైదరాబాద్, నాగపూర్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, కురుక్షేత్ర, చండీగఢ్, అమృత్సర్, జమ్మూ, చీనాబ్ బ్రిడ్జ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా లడఖ్ చేరుకున్నాడు. మార్గమధ్యంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి..వాటికి సంబంధించిన వివరాలు సేకరించాడు. లడఖ్ నుంచి తిరుగు ప్రయాణంలో హిమాచల్‌ప్రదేశ్ మీదుగా కాంగ్రా, ధర్మశాల, జ్వాలాముఖి, నైనాదేవి, కేదర్‌నాథ్‌కు వెళ్లాడు. తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ ఏడాది జనవరి ఐదో తేదీన నార్పలకు చేరుకున్నాడు. సుదీర్ఘయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన బాలును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బైక్‌యాత్రలో భాగంగా బాలు పలు వీడియోలు చిత్రీకరించాడు. వాటిలో కొన్నింటిని తన యూట్యూబ్ చానెల్ (బాలు సన్‌రైజ్ ట్రావెలర్)లో అప్లోడ్ చేశాడు. ఆదుకున్న జవాన్లు ప్రపంచంలోనే రెండవ అత్యంత చల్లని ప్రదేశమైన ద్రాస్ వద్ద (కార్గిల్‌కు సమీపంలో) మైనస్ 10 డిగ్రీల చలిని తట్టుకోలేక బాలు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చూపించుకోగా.. మూడు రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో భారత ఆర్మీ జవాన్లు తమ క్యాంపులో ఉండటానికి చోటు కల్పించారు. ఆరోగ్యం కుదుట పడేవరకు బాగా చూసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే బాలు యాత్ర కొనసాగించాడు. కాగా.. బాలు తీసుకెళ్లిన నగదును జమ్మూలోని డార్మెటరీలో దొంగలు అపహరించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆన్లైన్లో డబ్బు పంపి ఆదుకున్నారు. ఎవరెస్ట్‌కు వెళ్లాలనుంది నాకు బైక్ రైడింగ్‌తో పాటు ట్రెక్కింగ్ కూడా ఇష్టమే. కాలేజీ రోజుల్లో తరచూ ట్రెక్కింగ్ వెళ్లేవాడిని. ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్నది లక్ష్యం. కనీసం బేస్ క్యాంపు దాకా వెళ్లినా నా లక్ష్యం నెరవేరినట్టే. బైక్‌యాత్రలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించా. ఎక్కడా హోటల్లో విడిది చేయలేదు. డార్మెటరీలు, ఆలయాలు, గురుద్వారాల్లో విడిది చేస్తూ వెళ్లా. దీనివల్ల తక్కువ బడ్జెట్లోనే యాత్ర పూర్తి చేయగలిగా. వాఘా, సుచిత్ఘర్, కార్గిల్ దగ్గర.. ఇలా మూడుచోట్ల పాకిస్తాన్ బార్డర్‌ను చూడడం మరచిపోలేని అనుభూతి. – బాలకృష్ణ, నార్పల -
క్రికెట్ దిగ్గజాలతో రోడ్ ట్రిప్
సాక్షి, చెన్నై: క్రికెట్ దిగ్గజాలు సచిన్, అనిల్ కుంబ్లే, యువరాజ్‌తో గో ఫర్ రోడ్ ట్రిప్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని స్పిన్నీ వ్యవస్థాపకుడు నీరజ్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఈ కార్యక్రమం గురించి ఆయన వివరించారు. ఐపీఎల్– 2023 సీజన్లో భాగంగా మే 28వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లలో అభిమానులు తమ జట్లను ప్రోత్సహించే విధంగా చేసే వినూత్న అంశాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. గో ఫార్ ఫర్ యువర్ స్క్వాడ్ అన్నది స్పిన్నీ ఎస్యూవీ ద్వారా రోడ్ ట్రిప్‌లో క్రికెట్ అభిమానులను భాగస్వామ్యం చేస్తామన్నారు. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా అభిమానులు భాగస్వాములు కావచ్చునని పిలుపు నిచ్చారు. -
విజయ్ దేవరకొండ తల్లిని ఏడిపించేసిన రౌడీ ఫ్యాన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్‌స్టేటస్ అందుకున్న విజయ్ గత ఐదేళ్ల నుంచి ‘దేవరశాంటా’(Deverasanta) పేరుతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇంకాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన విజయ్ తన అభిమానుల్లో 100మందిని మనాలికి హాలీడే ట్రిప్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ఓ స్పెషల్ వీడియోను షేర్చేసుకున్నాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్‌కి వెళ్లిన సంగతులని గుర్తుచేసుకుంటూ.. 'నాకు 21 ఏళ్లున్నప్పుడు అనుకుంటా. మొదటిసారి నా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి హంపి ట్రిప్‌కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్‌కు సరిపడా డబ్బులన్నీ నా స్నేహితుడే భరించాడు. నా ఫస్ట్ హాలీడే వెకేషన్ అదే. నాలాగే అలాంటి సంతోసాన్ని మీ అందరికి కూడా పంచాలనుకున్నా' అంటూ విజయ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ దేవర శాంటాలో భాగంగా మనాలి ట్రిప్‌కు వెళ్లిన అభిమానులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ ట్రిప్‌కు చివర్లో తన తల్లిదండ్రులతో వెళ్లి విజయ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేయడం విశేషం. -
ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ
సాధారణంగా ఇండియాలో వేసవికాలంలో విహారయాత్రలకు వెళ్తారు. కానీ హీరోయిన్లు మాత్రం వర్షాకాలంలో విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. నవ దంపతులు విఘ్నేష్ శివన్, నయనతార ఇప్పటికే స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తుండగా సాక్షి అగర్వాల్ వంటి కొందరు హీరోయిన్లు కూడా విదేశాల్లో గడిపేస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రియా భవాని శంకర్ చేరింది. ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. కోలీవుడ్‌లో బిజీగా ఉన్న బ్యూటీ ఈమె. యువ హీరోలు, నవ హీరోలు అనే తారతమ్యం లేకుండా అందరితో జతకట్టేస్తోంది. పాత్రల పరిధి కూడా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని రెండు చేతులా సంపాదించుకునే పనిలో పడింది. అలా ఇటీవల ధనుష్ సరసన నటించిన చిత్రం తిరుచిట్రంపలం. ఇందులో ఒక పాట రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఈ అమ్మడు కనిపిస్తుంది. అయినా చిత్ర విజయం సాధించడంతో అందులో తానున్నాననే క్రెడిట్ కొట్టేస్తోంది. బిజీ షెడ్యూల్లోనూ రిలీఫ్ కోసం తన ప్రియుడు రాజవేల్‌తో కలిసి వారం క్రితం విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసింది. ట్రైనర్ సహాయంతో హెలీకాప్టర్ నుంచి పారాచ్యూట్ ద్వారా కిందికి దిగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జయం రవికి జంటగా అఖిలన్, ఎస్జే సూర్య సరసన బొమ్మై, శింబుతో పత్తు తల, రుద్రన్ అనే మరో చిత్రంలో నటిస్తున్న ప్రియా భవాని శంకర్ త్వరలో ఇండియన్–2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతోంది. చదవండి: (మాజీ బాయ్‌ప్రెండ్‌తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్) -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్ !
ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫాం ఉబర్ తాజాగా క్యాబ్ సర్వీసుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ప్రకటించింది. సీఎన్జీ ధరల పెంపు..! దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ క్యాబ్ సర్వీసులు అధిక సంఖ్యలో నడుస్తాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రయాణ ఛార్జీలను 12 శాతం మేర పెంచుతున్నట్లు ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది.కొద్ది రోజల క్రితమే ముంబై, హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీసుల ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని క్యాబ్ డ్రైవర్లు ధరలను పెంచాలని నిరసనలు కూడా చేపట్టారు. ఇక రానున్న రోజుల్లో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఆయా క్యాబ్ సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇలాగే ఇంధన ధరలు పెరిగితే క్యాబ్ సర్వీసుల ధరలు పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఏసీ ఆన్ చేస్తే వాతే..! ఇంధన ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. వాహనాల్లో ఎసీను స్విచ్ ఆన్ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
మాల్దీవుల్లో ప్రియుడితో రచ్చచేస్తున్న మలైకా అరోరా
సెలబ్రిటీలు, ప్రేమికులు ఎక్కువగా మాల్దీవులు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. వారికి ఏమాత్రం సమయం దొరికినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ ప్రేమజంట.. మలైకా అరోరా, అర్జున్ కపూర్లు కూడా మాల్దీవులకు వెళ్లారు. వారు సరదాగా గడిపిన క్షణాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సూర్యకిరణాలు నేలను ముద్దాడుతున్న ఫోటోలను కూడా తీశారు. మలైకా అరోరా తన ప్రియుడితో కలిసి సెల్ఫీ దిగడమే కాక అక్కడ సైక్లింగ్ కూడా చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ జంట 2018 నుంచి డేటింగ్లో ఉంది. మలైకా అరోరా విషయానికి వస్తే ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో టెరెన్స్ లూయిస్, గీతాకపూర్‌తో కలిసి జడ్జిగా వ్యవహరించారు. అంతేకాకుండా చయ్యా.. చయ్యా పాట.., మున్నీ బద్నాం హుయ్ డార్లింగ్ తేరే లియే, అనార్కలీ డిస్కో చాలీ పాటల్లో హుషారైన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. మిలింద్ సోమన్, అనూశా దండేకర్లతో కలిసి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2 కు జడ్జిగా పనిచేశారు. అర్జున్ కపూర్.. సైఫ్ అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్‌లతో కలిసి హరర్ కామెడీ మూవీ భూత్ పోలీస్, సందీప్ ఔర్ పింకీ ఫరార్ లో నటించారు. గతేడాది కృతి సనన్, సంజయ్ దత్‌లతో కలిసి పీరియాడిక్ డ్రామా పానిపట్‌లోనూ నటించారు.