న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపిస్తామంటూ నాగాలాండ్‌లో బీజేపీ ఎన్నికల హామీని ప్రకటించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. నాగాలాండ్ జనాభాలో 88% మంది క్రైస్తవులే కావడంతో బీజేపీ ఈ హామీ ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే మేఘాలయలోనూ 75% జనాభా క్రైస్తవులే. దీంతో ఈ హామీని బీజేపీ నాగాలాండ్‌కు మాత్రమే పరిమితం చేస్తుందా లేక అన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా లేక దేశంలోని క్రిస్టియన్లకందరికీ అవకాశమిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ముస్లింలకు హజ్ యాత్ర రాయితీని కేంద్ర ప్రభు త్వం గత నెలలోనే రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు క్రైస్తవులను మాత్రం ఉచితంగానే జెరూసలేంకు పంపిస్తామని బీజేపీ హామీనివ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment