yaathra
-
వైఎస్ యాత్ర మొదలు
-
వైఎస్ యాత్ర మొదలు
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత జీవిత విశేషాలను ఆవిష్కరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఏంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. అభిమానుల గుండెల్లో ‘రాజన్న’గా నిలిచిపోయిన ఆ మహానేత జీవితాన్ని మహీ వి. రాఘవ్ తెరకెక్కించనున్నారు. ‘పాఠశాల’ వంటి కాలేజ్ లవ్‌స్టోరీ తర్వాత రీసెంట్గా ‘ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ‘యాత్ర’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించనున్నారు. ‘‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యాత్ర’. వైఎస్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఎమోషనల్ కంటెంట్‌గా ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం’’ అని విజయ్ చిల్లా తెలిపారు. -
గెలిస్తే ఉచితంగా జెరూసలేం యాత్ర
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపిస్తామంటూ నాగాలాండ్‌లో బీజేపీ ఎన్నికల హామీని ప్రకటించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. నాగాలాండ్ జనాభాలో 88% మంది క్రైస్తవులే కావడంతో బీజేపీ ఈ హామీ ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే మేఘాలయలోనూ 75% జనాభా క్రైస్తవులే. దీంతో ఈ హామీని బీజేపీ నాగాలాండ్‌కు మాత్రమే పరిమితం చేస్తుందా లేక అన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా లేక దేశంలోని క్రిస్టియన్లకందరికీ అవకాశమిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ముస్లింలకు హజ్ యాత్ర రాయితీని కేంద్ర ప్రభు త్వం గత నెలలోనే రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు క్రైస్తవులను మాత్రం ఉచితంగానే జెరూసలేంకు పంపిస్తామని బీజేపీ హామీనివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
గుట్టకు చేరిన జనచైతన్య యాత్ర
యాదగిరిగుట్ట : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని డి.మహేష్ గత నెల 20న ప్రభుత్వ పథకాలపై చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్ మద్దతు ప్రకటించి మాట్లాడారు. మహేష్‌కు ఒకచేయి లేకున్నా.. ఎడమ చేతితో బైక్ నడుపుకుంటూ పథకాలను ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. జన చైతన్య యాత్ర కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో 10 జిల్లాలు బైక్‌పై యాత్ర చేశానని, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను వివరించడానికి యాత్ర ప్రారంభించానని, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలు పర్యటించి యాదగిరిగుట్టకు వచ్చినట్లు తెలిపారు.